ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవి (ఆది 42:36).
దేవుని ప్రేమించువారికి ... మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము (రోమా 8:28).
చాలామంది శక్తిహీనులుగా ఉంటారు. అయితే శక్తి ఎలా వస్తుంది? ఒక రోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ పెద్ద ట్రాలీ ఇంజన్లు విద్యుచ్ఛక్తి ద్వారా పని చెయ్యడం చూసాం. లోపల ఎక్కడ నుంచో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన రొద చేస్తున్నాయి. మాతో ఉన్న మిత్రుణ్ణి మేము అడిగాము.
“అంతటి శక్తి ఎలా పుడుతుంది?”
“ఏముంది, ఆ చక్రాలు ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుచ్ఛక్తి పుడుతుంది” అని అతను జవాబిచ్చాడు.
అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని కోరితే ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తాడు. రాపిడి ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాడు. కొందరికిది ఇష్టం లేక, ఇలాటి వత్తిడులనుండి పారిపోతుంటారు. ఈ వత్తిడులనాధారం చేసుకుని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలంపు ఉండదు.
వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి. ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి, కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి, ఈ రెండు శక్తులూ సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది. ఒక శక్తి ఆకర్షిస్తున్నది, మరొకటి వికర్షిస్తున్నది. ఒకటి చర్య, మరోటి ప్రతిచర్య. ఈ కారణం వల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యంలేని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్ష్యలో సవ్యంగా తాను తిరుగుతున్నది.
ఇలానే దేవుడు మన జీవితాలు నడిపిస్తుంటాడు. ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరం. అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన, శ్రమల వత్తిడులలో జీవిత సమస్యలతో పరీక్షిస్తుంటాడు. మనకి వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మనపైకి తెస్తుంటారు. కానీ నిజానికవి మన ఉనికినీ, గమనాన్నీ స్థిరపరచే శక్తులే.
ఈ రెండు రకాల శక్తుల కోసమూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన మనకిచ్చిన రెక్కల్ని, మనపై పెట్టిన బరువుల్నీ కూడా స్వీకరిద్దాము. ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోను, ఓపికతోను పరలోకపు పిలుపుకనుగుణంగా సాగిపోదాము.
కర్మాగారంలో చక్రాలూ యంత్రాలూ తిరుగుతున్నాయి
కప్పీలు, పట్టీలు ఒకదానిలో ఒకటి ఒకదాని వెంట ఒకటి
కొన్ని మౌనంగా రంగులరాట్నంలా తిరుగుతున్నాయి
కొన్ని ముందుకి తన్నుతూ వెనక్కి లాగుతూ గోల పెడుతున్నాయి
కొన్ని మృదువుగా, కొన్ని మొద్దుగా శబ్దాలు చేస్తున్నాయి
గొడవచేస్తూ, మూలుగుతూ, గర్జిస్తూ కదులుతూ, కదిలిస్తూ.
దేనిదారిన అది అర్థం కాకుండా, సంబంధం లేనట్టు
ఊగుతూ లాగుతూ, తూగుతూ రేగుతూ
బ్రహ్మాండమైన చక్రంనుండి చిట్టిమేకు దాకా దేని పనిలో అది
అన్నీ కలిపి సాధించే పని ఒకటే, ప్రయోజనం ఒక్కటే.
కదలికలనూ పనులనూ నిర్దేశించే తెలివి ఒక్కటే
యంత్రబలాన్ని క్రమపరిచే హస్తం ఒక్కటే.
దైవకుమారులకి పనులన్నీ సమకూడి జరుగుతున్నాయి
కొన్ని పనులు బాధిస్తాయి. కొన్ని కష్టపెడతాయి
కొన్ని అడ్డగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి
కాని అన్నీ మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి
తీరని కోరికలూ, చెదరిన ఆశలూ, అర్థంకాని పరిశోధనలూ, శాపాలూ
వీటన్నింటినీ ముందుకీ వెనక్కీ మెల్లిగా వేగంగా
నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతూ మీట నొక్కుతూ
ఉన్నది మన తండ్రి దేవుడే
-----------------------------------------------------------------------------------------------------------------------------
All these things are against me (Gen - 42:36)
All things work together for good to them that love God - Rom 8:28
Many people are wanting power. Now how is power produced? The other day we passed the great works where the trolley engines are supplied with electricity. We heard the hum and roar of the countless wheels, and we asked our friend,
“How do they make the power?”
“Why,” he said, “just by the revolution of those wheels and the friction they produce. The rubbing creates the electric current.”
And so, when God wants to bring more power into your life, He brings more pressure. He is generating spiritual force by hard rubbing. Some do not like it and try to run away from the pressure, instead of getting the power and using it to rise above the painful causes.
Opposition is essential to a true equilibrium of forces. The centripetal and centrifugal forces acting in opposition to each other keep our planet in her orbit. The one propelling, and the other repelling, so act and re-act, that instead of sweeping off into space in a pathway of desolation, she pursues her even orbit around her solar center.
So God guides our lives. It is not enough to have an impelling force—we need just as much a repelling force, and so He holds us back by the testing ordeals of life, by the pressure of temptation and trial, by the things that seem against us, but really are furthering our way and establishing our goings.
Let us thank Him for both, let us take the weights as well as the wings, and thus divinely impelled, let us press on with faith and patience in our high and heavenly calling. —A. B. Simpson
In a factory building, there are wheels and gearings,
There are cranks and pulleys, beltings tight or slack—
Some are whirling swiftly, some are turning slowly,
Some are thrusting forward, some are pulling back;
Some are smooth and silent, some are rough and noisy,
Pounding, rattling, clanking, moving with a jerk;
In a wild confusion in seeming chaos,
Lifting, pushing, driving—but they do their work.
From the mightiest lever to the tiniest pinion,
All things move together for the purpose planned;
And behind the working is a mind-controlling,
And a force directing, and a guiding hand.
So all things are working for the Lord’s beloved;
Some things might be hurtful if alone they stood;
Some might seem to hinder; some might draw us backward;
But they work together, and they work for good,
All the thwarted longings, all the stern denials,
All the contradictions are hard to understand.
And the force that holds them, speeds them and retards them,
Stops and starts and guides them—is our Father’s hand.
—Annie Johnson Flint
No comments:
Post a Comment