Friday, April 8, 2022

Thankful for the Thorns

 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను (2 కొరింథీ 12:10).

ఈ వచనాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనక ఉన్న భావనా శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే “నాకు బలం లేని సమయంలో నన్నెవరన్నా చీటికిమాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, మూలమూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేననుభవించేటప్పుడు నేను అగ్గిపిడుగుని."

దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువ లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనమున్న పరిస్థితులతో మనకిక పనిలేదు. ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసని బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము. ఎందుకంటే సాక్షాత్తూ ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకర్థమువుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకి తిరిగి ఇవి మనకి సంభవించాయి గనుక ఆయన మనకి ప్రతిగా చెయ్యవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురుచూస్తాం.

స్కాట్లాండ్ దేశంలో తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్తకుడు జార్జి మాథిసన్ గారు ఓసారి ఇలా అన్నారు, “ప్రభూ నాలో నీవుంచిన ముల్లు విషయం నీకెన్నడూ కృతజ్ఞతనర్పించ లేదు. నాకిచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను. గాని, ముల్లు కోసం ఒకసారి కూడా స్తుతించ లేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా నిత్య జీవితంలో నాకు దొరికే భాగ్యం కోసమే ఎదురుచూసాను గాని, ఇప్పుడు మోస్తున్న శిలువే నాకు ఇక్కడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేక పోయాను."

“నీ సిలువ మహాత్యాన్ని నాకు తెలియజెయ్యి. నా ముల్లులోని విలువను నాకు తెలియజెప్పు. నా శ్రమల మార్గంలోగుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరుచు. నా కన్నీళ్ళలో వెలిసిన ఇంద్రధనుస్సులను నాకు చూపించు.”

ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో

చుక్క తళుక్కుమన్నది

చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది

-----------------------------------------------------------------------------------------------------------------------------

Therefore I take pleasure in infirmities, in reproaches, in necessities, in persecutions, in distresses for Christ's sake: for when I am weak, then am I strong (2 Cor - 12:10)

The literal translation of this verse gives a startling emphasis to it and makes it speak for itself with a force that we have probably never realized. Here It Is: “Therefore I take pleasure in being without strength, in insults, in being pinched, in being chased about, in being cooped up in a corner for Christ’s sake; for when I am without strength, then am I dynamite.”

Here is the secret of Divine all-sufficiency, to come to the end of everything in ourselves and in our circumstances. When we reach this place, we will stop asking for sympathy because of our hard situation or bad treatment, for we will recognize these things as the very conditions of our blessing, and we will turn from them to God and find in them a claim upon Him. —A. B. Simpson

George Matheson, the well-known blind preacher of Scotland, who recently went to be with the Lord, said: "My God, I have never thanked Thee for my thorn. I have thanked Thee a thousand times for my roses, but not once for my thorn. I have been looking forward to a world where I shall get compensation for my cross, but I have never thought of my cross as itself a present glory.

“Teach me the glory of my cross; teach me the value of my thorn. Show me that I have climbed to Thee by the path of pain. Show me that my tears have made my rainbows.”

“Alas for him who never sees  

The stars shine through the cypress trees.”

No comments:

Post a Comment