ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు*_ (యోవేలు 2:32).
నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్త ధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరుగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొర్ర పెట్టకూడదు? నాకై నేను కూర్చుని పథకాలూ, అంచనాలు వేసుకోవడం దేనికీ? ఏ గొడవా లేకుండా నన్నూ నా భారాన్ని ఆయన మీద వెయ్యడానికి అభ్యంతరం ఏమిటి?
గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరుగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటూ, ఇటూ పరుగెత్తడం దేనికీ? సహాయం కోసం మరెక్కడో వెదికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యలనుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయతను ఆయన నాకిచ్చాడు.
ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే “ప్రార్థన చేయు వారందరును” అనే మాట అంతు లేనిది. 'వారందరును’ అనే దాన్లో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగినవాళ్ళు ఎవరైనా, అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను.
నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకనవసరం. వాగ్దానం చేసినవాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు, పద్దతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడడమే. ఆయనకి సలహాలివ్వడానికి నేనెవరిని? నేనాయన భృత్యుణ్ణి మాత్రమే. మంత్రిని కాను. మొర్రపెట్టడమే నా వంతు. విడిపించడం ఆయన పని.
-----------------------------------------------------------------------------------------------------------------------------
And it shall come to pass that whosoever shall call on the name of the Lord shall be delivered* (Joel - 2:32)
Why do not I call on His name? Why do I run to this neighbor when God is so near and will hear my faintest call? Why do I sit down and devise schemes and invent plans? Why not at once roll me and my burden upon the Lord?
Straightforward is the best runner—why do not I run at once to the living God? In vain shall I look for "deliverance anywhere else; but with God, I shall find it; for here I have His royal shall to make it sure.
I need not ask whether I may call on Him or not, for the word “Whosoever” is a very wide and comprehensive one. Whosoever means me, for it means anybody and everybody who calls upon God. I will therefore follow the leading of the text, and at once call upon the glorious Lord who has made so large a promise.
No comments:
Post a Comment