Friday, May 20, 2022

Receive the Cup of Sorrow

తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. (యోహాను 18:11).

ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన, అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి.

కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే, మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు. కాని మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో, మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం.

ఆపైన “అయ్యో ప్రభూ! నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది” అంటూ మనం దేవునికి ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం.


*దేవా బాధని తొలగించు*

*ఆక్రోశించాడు మనిషి*

*నువ్వు చేసిన ప్రపంచాన్ని*

*చీకటి అలుముకుంది*

*గుండెని గొలుసులతో కట్టి*

*రెక్కల్ని నేలకి బిగబట్టి*

*నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు*

*నువ్వు చేసిన ప్రపంచాన్ని*

*బాధలనుండి విడిపించు*


*బాధను రూపుమాపమంటావా?*

*గంభీరంగా పలికాడు దేవుడు*

*ఓర్చుకుని శక్తినొందే అవకాశాన్ని*

*నీ ఆత్మకు లేకుండా చేయమంటావా?*

*గుండెను గుండెను ముడి వేసే సానుభూతిని*

*సమూల నాశనం చేస్తే*

*త్యాగాన్ని లోకం నుండి తొలగిస్తే*

*నీ హత సాక్షులు ఇంకెవరు?*

*అగ్నికి ఆహుతై ఆకాశానికి ఎగసేదెవరు?*

*ప్రాణం పెట్టే ప్రేమను*

*ఆ ప్రేమ తెచ్చే చిరు నవ్వునూ*

*తీసెయ్యమంటావా?*

*క్రీస్తు సిలువకు ఎగబ్రాకే కరుణా శక్తిని*

*నీ జీవితం నుండి తీసెయ్యమంటావా?*

*తీసెయ్యమంటావా?*

-----------------------------------------------------------------------------------------------------------------------------

Shall I refuse to drink the cup of sorrow which the Father has given me to drink? (John - 18:11)

God takes thousand times more pains with us than the artist with his picture, by many touches of sorrow, and by many colors of circumstance, to bring us into the form which is the highest and noblest in His sight, if only we receive His gifts of myrrh in the right spirit.

But when the cup is put away, and these feelings are stifled or unheeded, a greater injury is done to the soul that can ever be amended. For no heart can conceive in what surpassing love God giveth us this myrrh, yet this which we ought to receive to our souls’ good we suffer to pass by us in our sleepy indifference, and nothing comes of it.

Then we come and complain: “Alas, Lord! I am so dry, and it is so dark within me!” I tell thee, dear child, open thy heart to the pain, and it will do thee more good than if thou were full of feeling and devoutness. —Tauler


“The cry of man’s anguish went up to God,  

 ’Lord takes away pain:  

The shadow that darkens the world Thou hast made,  

The close-coiling chain  

That strangles the heart, the burden that weighs  

On the wings that would soar,  

Lord, take away the pain from the world Thou hast made,  

That it love Thee the more.’  


“Then answered the Lord to the cry of His world:  

’Shall I take away the pain,  

And with it the power of the soul to endure,  

Made strong by the strain?  

Shall I take away pity, that knits heart to heart  

And sacrifice high?  

Will ye lose all your heroes that lift from the fire  

White brows to the sky?  

Shall I take away the love that redeems with a price  

And smiles at its loss?  

Can ye spare from your lives that would climb unto Me  

The Christ on His cross?”

No comments:

Post a Comment