నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసికొందును. (కీర్తన 77:6).
పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు యజమాని కోరిన పాట ఎంతమాత్రమూ పాడదు. ఓ కూనిరాగం తీస్తుందేమోగాని పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు.
చాలామంది చీకటి అలుముకుంటేనే గాని పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముల్లుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దూతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి. ‘ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి' అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది.
నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి, చీకట్లు ఆవరించే వరకూ ఆత్మకు తనను ఊరడించి సంతృప్తి పరచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు.
వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది, ఉదయకాంతి అనేది రాత్రి చీకటి కడుపులోనుంచే వస్తుంది.
నటాలీ అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు.
“అదో మరుపురాని ప్రయాణం, గులాబి పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాలనుండే ఎగుమతి ఔతుందని నాకప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబి పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు.
మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకొన్నాను. వైజ్ఞానిక పరీక్షలు ఋజువు చేసిందేమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబి పూలలో నుండి 40 శాతం పరిమళం తగ్గిపోతుందని.”
ఈ ఉదాహరణను మన ఆత్మలకు ఎలా అన్వయించుకోగలం? ఆ గులాబీలు చీకట్లో ఉన్నపుడు కలిగినంత పరిమళం వెలుగులో ఉన్నప్పుడు కలిగి ఉండటం లేదు. అలాగే మనం కూడా చీకటి బాధలలో ఉన్నప్పుడే ఎక్కువగా క్రీస్తు పరిమళాలను పోగు చేసుకుంటాం.
----------------------------------------------------------------------------------------------------------------------------
I call to remembrance my song in the night. (Ps - 77:6)
I have read somewhere of a little bird that will never sing the melody his master wishes while his cage is full of light. He learns a snatch of this, a bar of that, but never an entire song of its own until the cage is covered and the morning beams shut out.
A good many people never learn to sing until the darkling shadows fall. The fabled nightingale carols with his breast against a thorn. It was at the night that the song of the angels was heard. It was at midnight that the cry came, “Behold, the bridegroom cometh; go ye out to meet him.”
Indeed it is extremely doubtful if a soul can really know the love of God in its richness and in its comforting, satisfying completeness until the skies are black and lowering.
Light comes out of darkness, morning out of the womb of the night.
James Creelman, in one of his letters, describes his trip through the Balkan States in search of Natalie, the exiled Queen of Serbia.
“In that memorable journey,” he says, “I learned for the first time that the world’s supply of attar of roses comes from the Balkan Mountains. And the thing that interested me most,” he goes on, "is that the roses must be gathered in the darkest hours. The pickers start out at one o’clock and finish picking them at two.
“At first it seemed to be a relic of superstition, but I investigated the picturesque mystery, and learned that actual scientific tests had proven that fully forty percent of the fragrance of roses disappeared in the light of day.”
And in human life and human culture that is not a playful, fanciful conceit; it is a real veritable fact. -Malcolm J. McLeod
No comments:
Post a Comment