Monday, November 29, 2021

Music of the Storm

 

మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును (హెబ్రీ 12:11)


జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది. ఒక రాజ వంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగెల్ని అమర్చాడట. స్వర తంతులమీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటుంది. కాని ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగెల్ని వాయిద్యానికున్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది గాని సంగీత ధ్వనులేవీ వినిపించేవి కావట.


ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుఫాను  వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగెలనుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను  అవసరమైంది.


మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా, సౌఖ్యంగా జీవించినంత కాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించ లేదు. అయితే తుఫానులు వాళ్ళను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీతనాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు.


కిటికీకేసి టపటపా

*కొడుతూ పడుతున్న వానజల్లు *

కారు మబ్బుల్లోంచి వదలక

కురిసేదెందుకో అర్థం కాలేదు

పువ్వులు పువ్వులు 

వర్షం వెలిసాక విరిసే పువ్వులు 

నేలంతా పరుచుకునే పువ్వులు 

దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకో 


మనం శ్రమలను సరియైన పధ్ధతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తరువాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరూ బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తరువాతి కాలంలో ఫలితాలెలా ఉంటాయి?

-----------------------------------------------------------------------------------------------------------------------------

Nevertheless afterward (Heb -  12:11)

There is a legend that tells of a German baron who, at his castle on the Rhine, stretched wires from tower to tower, that the winds might convert them into an Aeolian harp. And the soft breezes played about the castle, but no music was born.

But one night there arose a great tempest, and hill and castle were smitten by the fury of the mighty winds. The baron went to the threshold to look out upon the terror of the storm, and the Aeolian harp was filling the air with strains that rang out even above the clamor of the tempest. It needed the tempest to bring out the music!

And have we not known men whose lives have not given out any entrancing music in the day of a calm prosperity, but who, when the tempest drove against them have astonished their fellows by the power and strength of their music?


“Rain, rain  

Beating against the pane!  

How endlessly it pours  

Out of doors  

From the blackened sky  

I wonder why!  


“Flowers, flowers,  

Upspringing after showers,  

Blossoming fresh and fair,  

Everywhere!  

Ah, God has explained  

Why it rained!”  


You can always count on God to make the “afterward” of difficulties, if rightly overcome, a thousand times richer and fairer than the forward. “No chastening … seemeth joyous, nevertheless afterward …” What a yield!

Sunday, November 28, 2021

The Lord's Times

 ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు (కీర్తనలు 65:8). 


ఉదయం పెందలాడే లేచి కొండ మీదికి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి. దేవుడు సూర్యుణ్ణి పైకి నెడుతున్నాడా అనిపిస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. అన్ని రంగులూ కాస్త కాస్త అక్కడక్కడా ప్రత్యక్షమౌతాయి. అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమౌతుంది. దినకరుడు ఠీవిగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి.


సంజెకాంతుల కెంజాయలో

మంజుల స్వరమొకటి విన్నాను

“దినమంతా నీతో ఉన్నాను 

సంతోషంగా ఉండు"

అనేది ఆ దేవుని స్వరం


ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది. ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది. అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శ్రుతి కలపడానికి నాకు తోడ్పడుతుంది. ఉషోదయవేళ విసిరే గాలి నా నాసికారంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది. ఆయన తన ఊపిరితోను, తన మనసుతోను, తన ఆత్మతోను నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా, ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా, అందులోనే నా బ్రతుకును నిలుపుకుని మహిమను పొందగలిగేలా, ప్రార్థించేలా చేసింది. దేవుడు ఇచ్చే ఉదయాలూ,

రాత్రిళ్ళూ లేకపోతే మానవమాత్రులం, మనమెలా బ్రతకగలం!


రాత్రికి పగటికీ మధ్య

వేగుచుక్క పొడిచిన వేళ

నీడల జాడలు నిశ్శబ్దంగా

కదిలిపోతున్న వేళ


ఈ దినం చెయ్యవలసినదేమిటని

నీ గదిలో ఏకాంతంగా

ముచ్చటగా యేసుతో ముచ్చటించు*

ఆయన చిత్తమేమిటని


నిన్ను నడిపిస్తాడు

పర్వతాలు వంచుతాడు

ఎడారులు పూలు పూస్తాయి

‘మారా ధార' మధురమౌతుంది 


ఈ జీవన యాత్రంతా

తెలుసా జైత్రయాత్రని

ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే

నిజమే ఇది ప్రతి నిత్యం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Thou makest the outgoing of the morning and evening to rejoice (Ps - 65:8)

Get up early and go to the mountain and watch God make a morning. The dull gray will give way as God pushes the sun towards the horizon, and there will be tints and hues of every shade, that will blend into one perfect light as the full-orbed sun bursts into view. As the King of day moves forth majestically, flooding the earth and every lowly vale, listen to the music of heaven’s choir as it sings of the majesty of God and the glory of the morning.


In the holy hush of the early dawn  

I hear a Voice  

“I am with you all the day,  

Rejoice! Rejoice!”  


The clear, pure light of the morning made me long for the truth in my heart, which alone could make me pure and clear as the morning, tune me up to the concert-pitch of the nature around me. And the wind that blew from the sunrise made me hope in the God who had first breathed into my nostrils the breath of life; that He would at length so fill me with His breath, His mind, His Spirit, that I should think only His thoughts, and live His life, finding therein my own life, only glorified infinitely. What should we poor humans do without our God’s nights and mornings? —George MacDonald


“In the early morning hours,  

’Twixt the night and day,  

While from earth the darkness passes  

Silently away;  


“Then ’tis sweet to talk with Jesus  

In thy chamber still  

For the coming day and duties  

Ask to know His will.  


“Then He’ll lead the way before you,  

Mountains laying low;  

Making desert places blossom,  

Sweet’ning Marah’s flow.  


“Would you know this life of triumph,  

Victory all the way?  

Then put God in the beginning  

Of each coming day.”

Saturday, November 27, 2021

Impossible Flowers

 

దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదు (లూకా 1:37). 


హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి యేడూ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల మంచు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ వెలుతురు చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచు గడ్డలను చీల్చుకుని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి.


గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను, కొమ్మలను వ్యాపింపజేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగునా తన వేళ్ళలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచు గడ్డలక్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలోనుంచి పుట్టిన వేడి మంచుపొరను కొద్దికొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచుపొరను తొలుచుకుని మొగ్గ బయటకి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది. ఎండలో మంచుగడ్డ తళతళలాడినట్టుగానే ఆ పుష్పపు ముఖ్ మల్ ఎరుపుదనం తళతళ లాడుతుంది.


స్ఫటికంలా, స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహలపడుతుంటాం. దేవునికి కూడా ఇదే ఇష్టం.


చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి. మీరు వెయ్యగలిగినన్నిటిని వేసి మోపు కట్టండి. ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు. విశ్వాసం దేవునివైపుకి చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

For with God nothing shall be impossible (Luke 1:37)

Far up in the Alpine hollows, year by year God works one of His marvels. The snow-patches lie there, frozen with ice at their edge from the strife of sunny days and frosty nights; and through that ice-crust come, unscathed, flowers that bloom.

Back in the days of the by-gone summer, the little soldanelle plant spread its leaves wide and flat on the ground, to drink in the sun-rays, and it kept them stored in the root through the winter. Then spring came, and stirred the pulses even below the snow-shroud, and as it sprouted, warmth was given out in such strange measure that it thawed a little dome in the snow above its head.

Higher and higher it grew and always above it rose the bell of air, till the flower-bud formed safely within it: and at last the icy covering of the air-bell gave way and let the blossom through into the sunshine, the crystalline texture of its mauve petals sparkling like snow itself as if it bore the traces of the flight through which it had come.

And the fragile thing rings an echo in our hearts that none of the jewel-like flowers nestled in the warm turf on the slopes below could waken. We love to see the impossible done. And so does God.

Face it out to the end, cast away every shadow of hope on the human side as an absolute hindrance to the Divine, heap up all the difficulties together recklessly, and pile as many more on as you can find; you cannot get beyond the blessed climax of impossibility. Let faith swing out to Him. He is the God of the impossible.