Saturday, January 1, 2022

_*New Year*_

*మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును*_ (ద్వితీ 11 :11-12) 


  ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయేదాన్ని గురించి ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపర్చుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలుగబోయే క్రొత్త అనుభవాలు, జరుగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరూహించగలరు? కాని మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద  సందేశాన్ని  అందిస్తున్నాడు. *“అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును”.* మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు అయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉన్నాయి.  ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి  ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది.


  మనం అడుగుపెట్టబోతున్న దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. అంతా చదునుగానూ ఉండదు. అంతా పల్లంగానూ ఉండదు. జీవితం చదునుగా, ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు ఉండాలి, లోయలు ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగుచేసి లోయల్లోకి ప్రవహింప జేస్తాయి. మన జీవితాల్లోనూ ఇంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళూని ఆశీర్వాద వర్షధారల్ని  పొందుతాము. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము, సణుగుకుంటాము.  కాని ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం. 


  అరణ్యంలో, చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో! అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా ఉంటే బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డూ అదుపు  లేకుండా వీస్తూ చెట్లనూ చేమలనూ నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో!  కాని దృడమైన, తలవంచని, అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండచరియల్లో ఉండేవారు క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకెదురయ్యే కష్టాలు దేవుడు మన యెదుట నిలువబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణం అయి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాము. మనకి ఎలాంటి భాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. *‘కేవలం నమ్మకం ఉంచు’.*  ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈ రోజు దేవుడు మన దగ్గరకి వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. ఇది మంచి సంవత్సరం. దీవెనకరమైన క్రొత్త సంవత్సరం.


*అగమ్యగోచరమైన దారులగుండా* 

*అయన నిన్ను నడిపిస్తాడు*

*అడుగులు తడబడినా*

*అలసట పైబడినా పైపైకి పైపైకి*

*అంధకారం దారి మూసినా*

*గాలివానలు గోలచేసినా*

*మబ్బులు విడిపోతాయి*

*ముందుకు నడిపిస్తాడు*


*కాల కల్లోలాల ఊహాలోకాల్లో*

*అనుమానాల్లో భయాల్లో*

*అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ముళ్ళ కంచెల్లో*

*చెయ్యిపట్టి నడిపిస్తాడు*


*మబ్బు కమ్మిన వేళల్లో*

*కష్టంలో నష్టంలో*

*తన చిత్తం నెరవేరుస్తాడు*

*తానే ముందుకు నడిపిస్తాడు*

----------------------------------------------------------------*Instead, the land you are crossing the Jordan to occupy is one of hills and valleys, a land that drinks in water from the rains, a land the Lord your God looks after. He is constantly attentive to it from the beginning to the end of the year.*_ (Deut - 11:11-12 )


Today dear friends, we stand upon the verge of the unknown. There lies before us the new year and we are going forth to possess it. Who can tell what we shall find? What new experiences, what changes shall come, what new needs shall arise? But here is the cheering, comforting, gladdening message from our Heavenly Father, “The Lord thy God careth for it.” “His eyes are upon it away to the ending of the year.”


All our supply is to come from the Lord. Here are springs that shall never dry; here are fountains and streams that shall never be cut off. Here, anxious one, is the gracious pledge of the Heavenly Father. If He be the Source of our mercies they can never fail us. No heat, no drought can parch that river, “the streams whereof make glad the city of God.”


The land is a land of hills and valleys. It is not all smooth nor all down hill. If life were all one dead level the dull sameness would oppress us; we want the hills and the valleys. The hills collect the rain for a hundred fruitful valleys. Ah, so it is with us! It is the hill difficulty that drives us to the throne of grace and brings down the shower of blessing; the hills, the bleak hills of life that we wonder at and perhaps grumble at, bring down the showers. How many have perished in the wilderness, buried under its golden sands, who would have lived and thriven in the hill-country; how many would have been killed by the frost, blighted with winds, swept desolate of tree and fruit but for the hill-stern, hard, rugged, so steep to climb. God’s hills are a gracious protection for His people against their foes!


We cannot tell what loss and sorrow and trial are doing. Trust only. The Father comes near to take our hand and lead us on our way today. It shall be a good, a blessed new year!


He leads us on by paths we did not know;

Upward He leads us, though our steps be slow,

Though oft we faint and falter on the way,

Though storms and darkness oft obscure the day;

Yet when the clouds are gone,

We know He leads us on.


He leads us on through all the unquiet years;

Past all our dreamland hopes, and doubts and fears,

He guides our steps, through all the tangled maze

Of losses, sorrows, and o’erclouded days;

We know His will is done;

And still He leads us on.

—N.L. Zinzendorf

Friday, December 31, 2021

Hitherto


యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెను (1సమూ 7:12).

ఇంత వరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. ఇరవై ఏళ్ళు కానివ్వండి. డెబ్భై ఏళ్ళు కానివ్వండి. గడిచిన కాలమెంతైనా ఇంత వరకు దేవుడు మనకి సహాయం చేసాడు. కలిమిలోను, లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంటా బయటా, భూమి మీదా, నీళ్ళ మీదా, గౌరవంలో, అగౌరవంలో, కంగారులో, ఆనందంలో, శ్రమలో, విజయంలో, ప్రార్థనలో, శోధనలో - ఇంత వరకు దేవుడు మనకు సహాయము చేసెను.

చెట్లు వరసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు, కాండాలు, ఈ చివరినుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదానివెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది. అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసల్ని ఒక్కసారి వెనుదిగిరి చూడు. కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమబలంతో స్థిరంగా నిలిపిన కాండాలనూ, సంతోషాల కొమ్మలనూ చూడు.

ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా. అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపనుబట్టి అవి పాటలు పాడుతున్నాయి.

ఇంత వరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది. కొంతదూరం నడిచిన తరువాత 'ఇంత వరకు' అని అతను రాసాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలూ, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయసు, మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి.

అంతేనా? లేదు. ఇంకా ఉంది. యేసు పోలిక లోనికి మేలుకొలుపు. సింహాసనాలు, వీణెలు, స్తుతిగీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖారవిందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత ఇవన్నీ ఉన్నాయి. ధైర్యం తెచ్చుకోండి, గొప్ప ఆత్మ విశ్వాసంతో మీ ఎబినేజరును నిలబెట్టండి.

ఇంత వరకు వెంటనున్న వాడు 

ఇక పైన జంటగా ఉంటాడు.


ఈ “ఇంత వరకు”ను పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది!

ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది. ప్రతిరోజూ ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడంవల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి. కనుచీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగుచేసి ఆ కొండదారులగుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. “ఇంతవరకు దేవుడు కాపాడాడు! ఆయన నామానికి స్తోత్రాలు!”

చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. "గుడ్ నైట్, గుడ్ నైట్” ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది.

ఈ చీకటిలో మనం కూడా ఒకర్నొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆపైన ఉదయమై నప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము. విమోచన పొందిన వాళ్ళతో కలిసి “సింహాసనాససీనుడైన వానికి, గొర్రెపిల్లకూ మహిమ, ఘనత సదాకాలము కలుగును గాక” అంటూ ఉత్సాహగానం చేస్తాము.

యుగయుగాలకూ ఇదే నా పాట

యేసు చూపించాడు నాకు బాట

“మరి రెండవసారి వారు - ప్రభువును స్తుతించుడి అనిరి” (ప్రకటన 19:3).

-----------------------------------------------------------------------------------------------------------------------------

Hitherto hath the Lord helped us - (1 Sam - 7:12)

The word “hitherto” seems like a hand pointing in the direction of the past. Twenty years or seventy, and yet “hitherto hath the Lord helped us!” Through poverty, through wealth, through sickness, through health; at home, abroad, on the land, on the sea; in honor, in dishonor, in perplexity, in joy, in a trial, in triumph, in prayer, in temptation—“hitherto hath the Lord helped!”

We delight to look down a long avenue of trees. It is delightful to gaze from one end of the long vista, a sort of verdant temple, with its branching pillars and its arches of leaves. Even so look down the long aisles of your years, at the green boughs of mercy overhead, and the strong pillars of lovingkindness and faithfulness which bear up your joys.

Are there no birds in yonder branches singing? Surely, there must be many, and they all sing of mercy received “hitherto.”

But the word also points forward. For when a man gets up to a certain mark and writes “hitherto,” he is not yet at the end; there are still distances to be traversed. More trials, more joys; more temptations, more triumphs; more prayers, more answers; more toils, more strength; more fights, more victories; and then come sickness, old age, disease, death.

Is it over now? No! there is more yet—awakening in Jesus’ likeness, thrones, harps, songs, psalms, white raiment the face of Jesus, the society of saints, the glory of God, the fullness of eternity, the infinity of bliss. Oh, be of good courage, believer, and with grateful confidence raise thy “Ebenezer,” for,

“He who hath helped thee hitherto  

Will help thee all thy journey through.”  

When read in Heaven’s light, how glorious and marvelous a prospect will thy “hitherto” unfold to thy grateful eye. —C. H. Spurgeon

The Alpine shepherds have a beautiful custom of ending the day by singing to one another an evening farewell. The air is so crystalline that the song will carry long distances. As the dusk begins to fall, they gather their flocks and begin to lead them down the mountain paths, singing, “Hitherto hath the Lord helped us. Let us praise His name!”

And at last with a sweet courtesy, they sing to one another the friendly farewell: “Goodnight! Goodnight!” The words are taken up by the echoes, and from side to side the song goes reverberating sweetly and softly until the music dies away in the distance.

So let us call out to one another through the darkness, till the gloom becomes vocal with many voices, encouraging the pilgrim host. Let the echoes gather till a very storm of Hallelujahs breaks in thundering waves around the sapphire throne, and then as the morning breaks we shall find ourselves at the margin of the sea of glass, crying, with the redeemed host, “Blessing and honor and glory be unto him that sitteth on the throne and to the Lamb forever and ever!”

“This my song through endless ages,  

Jesus led me all the way.”

Thursday, December 30, 2021

Believing Prayer

 పేతురు చెరసాలలో ఉంచబడెను; సంఘమయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్ధన చేయుచుండెను (అపొ.కా. 12:5). 


పేతురు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతణ్ణి విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం గాని శక్తి గాని లేవు. లోక సంబంధమైన సహాయం లేదు. అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్తులంతా బహు నిష్ఠగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్రనుండి లేపి కావలివాళ్ళ మధ్యనుండి బయటికి నడిపించాడు. వాళ్ళు ఇనుప గేటు దగ్గరికి వచ్చేసరికి దానంతట అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు.


నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుప గేటు ఉందేమో. పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో. నువ్వొక రహస్యం నేర్చుకోవాలి. నమ్మికగల ప్రార్థన. నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆనాటి సంఘస్తులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అనవసరమైన బాధలకూ నువ్వు లోనుకాకుండా తప్పించుకోగలవు. ఆటంకాలు మాయమైపోతాయి. నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి (మార్కు 11:22). చెరసాలల్లో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ళ తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు, సైతాను బంధకాల్లో ఉన్నవారు, నమ్మికతో కూడిన నీ ప్రార్థనవల్ల విముక్తులౌతారు.


అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మెలుపై ఏలీయా నేలమట్టుకు వంగి తన మోకాళ్ళ మధ్య తలను పెట్టుకుని ప్రార్థించాడు. అదీ ప్రార్థనంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వమంతా దేవునితో లీనమైంది. మాటలేవీ ఉచ్ఛరించలేదు. మాటల్లో ఇమడనంత ఆవేదనా పూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కోసారి. దేవునితో ఐక్యమై దుష్టశక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాటి ప్రార్థన ఎంతో అవసరం. 


ఉచ్ఛరింపశక్యంగాని మూలుగులు దేవుడు నిరాకరింపశక్యం గాని ప్రార్థనలు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Peter was kept in prison: but prayer [instant and earnest prayer] was made for him - (Acts - 12:5)

Peter was in prison awaiting his execution. The Church had neither human power nor influence to save him. There was no earthly help, but there was a help to be obtained by the way of Heaven. They gave themselves to fervent, importunate prayer. God sent His angel, who aroused Peter from sleep and led him out through the first and second wards of the prison; and when they came to the iron gate, it opened to them of its own accord, and Peter was free.

There may be some iron gate in your life that has blocked your way. Like a caged bird you have often been beaten against the bars, but instead of helping, you have only had to fall back tired, exhausted, and sore at heart. There is a secret for you to learn, and that is believing prayer; and when you come to the iron gate, it will open of its own accord. How much wasted energy and sore disappointment will be saved if you will learn to pray as did the Church in the upper room! Insurmountable difficulties will disappear; adverse circumstances will prove favorable if you learn to pray, not with your own faith but with the faith of God (Mark 11:22, margin). Souls in prison have been waiting for years for the gate to open; loved ones out of Christ, bound by Satan, will be set free when you pray till you definitely believe God. —C. H. P.

Emergencies call for intense prayer. When the man becomes the prayer nothing can resist its touch. Elijah on Carmel, bowed down on the ground, with his face between his knees, that was prayer—the man himself. No words are mentioned. Prayer can be too tense for words. The man’s whole being was in touch with God and was set with God against the powers of evil. They couldn’t withstand such praying. There’s more of this embodied praying needed. —The Bent-knee Time

“Groanings which cannot be uttered are often prayers which cannot be refused.” —C. H. Spurgeon