Saturday, February 12, 2022

Word Was GOD

 

🏮 నీ జీవితాన్ని కట్టాలని దేవుడు ఆశకలిగి ఉన్నారు 🏮 

🌐 ఇశ్రాయేలీయులు దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ వస్తున్నారు ఎంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వారు దేవుని మాటకు చెవి యొగ్గలేదు, దేవుని గద్ధింపును స్వీకరించలేదు అయితే దేవుడు కల్దీయుల చేతికి వారిని అప్పగించారు,  వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్పగించెను. దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి - 2దినవృ 36:17-20

🌐 అయితే ఆ దినములలో దేవుడు విడిచిపెట్టేసిన యెరూషలేమునకు ప్రాకారము లేదు, దానిని రక్షించువారు లేరు, దానిని కావాలి కాయు వారు లేరు, జనాలందరు కల్దీయుల దాసోహం అయ్యారు, కానీ యెరూషలేములోని ప్రజలు చెల్లాచెదురైపోయారు.... అయితే ఆ సమయములో దేవుడే వారియెడల ప్రేమ గలవారై కాల్చివేయబడిన, చెల్లాచెదురైన వారిని తిరిగి చెరలో నుండి రప్పిస్తానని, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతానని దేవుడే వాగ్దానం చేసారు.  

🚨 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే - ఆమోసు 9:11,12

🚨 మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు - ఆమోసు 9:14,15

🌐 అయితే దేవుడు నిన్ను నన్ను తన మందిరములో ఒలీవ మొక్కలవలె నాటారు. అయితే నీవు నేను కూడా  బహుశా విగ్రహారాధనతో, వ్యభిచారముతో, శరీర క్రియలతో, లోకాచారములతో మన ఆధ్యాత్మిక గుడారమును పాడు చేసుకుని ఉండచ్చు, మన ఆధ్యాత్మిక గుడారము యెరూషలేమువలె ప్రాకారము లేనిదిగా కాల్చివేయబడి ఉండచ్చు. తిరిగి ఎలా బాగుపడాలో తెలియక, తిరిగి ఎలా దేవుని యొద్దకు రావాలో తెలియక, దేవుణ్ణి ఎదుర్కొనలేక నీవు సతమతం అవుతుండవచ్చు అయితే నేడు ప్రేమగల దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు "పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును" అని అలాగే "నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు - యిర్మియా 31:4" 

🌐 దేవుడే నీ జీవితాన్ని కట్టాలని అనుకుంటున్నారు, దేవుడే నీ గుడారమును బాగుచెయ్యాలి అనుకుంటున్నారు కారణం ఏమిటంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు అందుకే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి సైతం మన నిమిత్తం సిలువకు అప్పగించారు కాబట్టి ఇంతగా ప్రేమిస్తున్న దేవుని యొద్దకు చేరి మన జీవితం వాక్యమనే బండపై స్థిరముగా కట్టబడునట్లు దేవుని యొద్దకు తిరిగి వద్దాము, దేవుని చెంతకు చేరుదాము. ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక... ఆమేన్...

Friday, February 11, 2022

Strong Composure

ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి - (రోమా 12:19)

కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చెయ్యడం కంటే చేతులు ముడుచుకుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తిగలవాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన, అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసినవాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభువైతే మౌనంగా మాట తూలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాపనిందలపాలైన వాళ్ళకి, ఏ తప్పు చెయ్యకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్ధమవుతుంది, దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో.

మనుషులు నిన్నపార్థం చేసుకోవచ్చు

నిందించే నెపం వెదకవచ్చు

అభియోగం మోపవచ్చు

తొణకక బెణకక మౌనం వహించు

క్రీస్తే న్యాయాధికారి! వాళ్ళు కాదు

భయం వదలి వీ మౌనబలం చూపించు 

పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, 'ఇవేవీ నన్ను కదిలించలేవు.' అని. 

'ఇవేవీ నన్ను గాయపరచవు' అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి యే అపొస్తలుడు విలపించినట్లు కనబడడు. యేసు ప్రభువు కన్నీళ్ళు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకీ ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే 'ఇవేవీ నన్ను గాయపరచవు' అనడం లేదు పౌలు. గాయమవుతుంది గాని తాను నమ్మినదానినుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢనిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుని పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Dearly beloved, avenge not yourselves - (Rom - 12:19)

     There are seasons when to still demand immeasurably higher strength than to act. Composure is often the highest result of power. To the vilest and most deadly charges, Jesus responded with deep, unbroken silence, such as excited the wonder of the judge and the spectators. To the grossest insults, the most violent ill-treatment and mockery that might well bring indignation into the feeblest heart, He responded with voiceless complacent calmness. Those who are unjustly accused, and causelessly ill-treated know what tremendous strength is necessary to keep silent to God.

“Men may misjudge thy aim,

Think they have cause to blame,

Say, thou art wrong;

Keep on thy quiet way,

Christ is the Judge, not they,

Fear not, be strong.”

    St. Paul said, “None of these things move me.”

    He did not say, none of these things hurt me. It is one thing to be hurt, and quite another to be moved. St. Paul had a very tender heart. We do not read of any apostle who cried as St. Paul did. It takes a strong man to cry. Jesus wept, and He was the manliest man that ever lived. So it does not say, none of these things hurt me. But the apostle had determined not to move from what he believed was right. He did not count as we are apt to count; he did not care for ease; he did not care for this mortal life. He cared for only one thing, and that was to be loyal to Christ, to have His smile. To St. Paul, more than to any other man, His work was waged, His smile was Heaven.  —Margaret Bottome

Thursday, February 10, 2022

Trust Amid the Silence

అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు - (మత్తయి 15:23).

ఊహించని విధంగా హృదయవిదారకమైన వేదన వచ్చిపడి, ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి, మనసు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి, క్రుంగిపోయి ఉన్న వారెవరన్నా ఈ మాటలు చదువుతున్నారేమో. నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో. కాని నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు. అంతా అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు. - “అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు.”

బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయవిదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటోందో! ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే.

యేసు ప్రభువు నిశ్శబ్దం ఆయన మాటలకంటే ఎక్కువ అర్థవంతంగా ఉంది. ఇది ఒక సూచన కావచ్చు. తిరస్కారానికి కాదుగాని, సమ్మతికే. నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే.

* "నా ప్రాణమా నీవేల కృంగియున్నావు? ఇంకను నేనాయన్ని స్తుతిస్తాను* ". ఆయన మౌనం కోసం చెప్పే ఒక పాతకాలపు కథ ఉంది. ఒకావిడకి కల వచ్చిందట. ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెంతకి వచ్చాడు.

మొదటి స్త్రీ దగ్గరకి వచ్చి కరుణతో, కృపతో, వదనంలో వెల్లివిరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ  ఉండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు. 

ఆమెని వదలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటి మీద ఒక్కక్షణం  చెయ్యివేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూసాడు.

 మూడో ఆమెవైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్లిపోయాడు. ఆ కలలో ఆ కలకంటున్న ఆమె అనుకుందట - 'దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు! రెండో ఆవిడని కూడా మెచ్చుకున్నాడు. కాని మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు. మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధపెట్టి ఉంటుంది, అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా కనీసం ఆమెవంక చూడనైనా చూడలేదు.’

ఏం చేసిందో ఆమె. ఆ ముగ్గురి మధ్య అంత తేడాలెందుకు చూపించాడు ప్రభువు? దేవుడలా ఎందుకు చేసాడో, ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు - “నన్నెంత తప్పుగా అంచనా వేసావు! మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ, నా అపేక్ష ఆమెకి అవసరం. దినంలో ప్రతిక్షణం నేను నా ప్రేమతో ఆమెని వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి. లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది.”

“రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది. ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాటివైనా, మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసముంచుతుందన్న నమ్మకం నాకుంది.”

“నేను నిర్లక్ష్యం చేసినట్టు, పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం, ప్రేమ అతి శ్రేష్ఠమైనవి. నేనే ఆమెకు అత్యున్నతమైన, బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను.”

“ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది. మనసంతటితో నా మీద విశ్వాసముంచింది. చూపుల్లోగాని, మాటల్లోగాని, చేష్టల్లోగాని నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కుచెదరదు. నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా, నిస్సందేహంగా దాటిపోతుంది. స్వభావసిద్ధంగా ఆమెలోని అణువణువూ ఆమె మనస్సు, జ్ఞానమూ వ్యతిరేకించినా నా మీద నిరీక్షణను మాత్రం వదులుకోదు. ఎందుకంటే నేనామెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాననీ, నేను చేస్తున్నది ఇప్పుడామెకి అర్థం కాకపోయినా ఇకముందు అర్థమవుతుందనీ ఆమెకి తెలుసు.”

“నా ప్రేమలో నేను మౌనంగా ఉంటానెందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది. మానవ హృదయం అర్థం చేసుకోలేనిది. బాహ్య సంబంధమైన వాటివల్లకాక ఆత్మలో బాధనొందిన మీరు కూడా సహజంగా నా ప్రేమకి స్పందించి నా మీద విశ్వాసముంచాలన్నదే నా ఆకాంక్ష.”

ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకుని ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. తన బహుమానాలను ఇవ్వకుండా దాచి పెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి.

----------------------------------------------------------------------------------------------------------------------------

He answered her not a word - (Matt - 15:23)

He will be silent in his love - Zeph 3:17  

    It may be a child of God who is reading these words who has had some great crushing sorrow, some bitter disappointment, some heart-breaking blow from a totally unexpected quarter. You are longing for your Master’s voice bidding you “Be of good cheer,” but only silence and a sense of mystery and misery meet you —“He answered her not a word.”

    God’s tender heart must often ache to listen to all the sad, complaining cries which arise from our weak, impatient hearts because we do not see that for our own sakes He answers not at all or otherwise than seems best to our tear-blinded, short-sighted eyes.

    The silences of Jesus are as eloquent as His speech and maybe a sign, not of His disapproval, but of His approval and of a deep purpose of blessing for you.

    “Why art thou cast down, O…soul?” Thou shalt yet praise Him, yes, even for His silence. Listen to an old and beautiful story of how one Christian dreamed that she saw three others at prayer. As they knelt the Master drew near to them.

    As He approached the first of the three, He bent over her in tenderness and grace, with smiles full of radiant love, and spoke to her in accents of purest, sweetest music.

    Leaving her, He came to the next, but only placed His hand upon her bowed bead, and gave her one look of loving approval.

    The third woman passed almost abruptly without stopping for a word or glance. The woman in her dream said to herself, "How greatly He must love the first one, to the second He gave His approval, but none of the special demonstrations of love He gave the first; and the third must have grieved Him deeply, for He gave her no word at all and not even a passing look.

    “I wonder what she has done, and why He made so much difference between them?” As she tried to account for the action of her Lord, He stood by her and said: "O woman! how wrongly hast thou interpreted Me. The first kneeling woman needs all the weight of My tenderness and care to keep her feet in My narrow way. She needs My love, thought, and help every moment of the day. Without it, she would fail and fall.

    “The second has stronger faith and deeper love, and I can trust her to trust Me however things may go and whatever people do.

    “The third, whom I seemed not to notice, and even to neglect, has faith and love of the finest quality, and here I am training by quick and drastic processes for the highest and holiest service.

    “She knows Me so intimately and trusts Me so utterly, that she is independent of words or looks or any outward intimation of My approval. She is not dismayed nor discouraged by any circumstances through which I arrange that she shall pass; she trusts Me when sense and reason and every finer instinct of the natural heart would rebel;—because she knows that I am working in her for eternity and that what I do, though she knows not the explanation now, she will understand hereafter.

    “I am silent in My love because I love beyond the power of words to express, or of human hearts to understand, and also for your sakes that you may learn to love and trust Me in Spirit-taught, spontaneous response to My love, without the spur of anything outward to call it forth.”

    He “will do marvels” if you will learn the mystery of His silence, and praise Him, for every time He withdraws His gifts that you may better know and love the Giver.  —Selected