Sunday, February 13, 2022

The Father's Hand


 మీ పరలోకపు తండ్రికి తెలియును*_ - (మత్తయి 6:32).


మూగ చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒకాయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తున్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు. "దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకివ్వలేదు?"


ఈ భయంకరమైన ప్రశ్న చెంపదెబ్బ లాగ వాళ్ల ముఖాలకి తగిలింది. 'ఎందుకు?' అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లాగా చేసేసింది. అంతలో ఒక చిన్న పాప లేచింది. 


ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్ పీస్ ని అందుకుంది.  స్థిరమైన చేతితో ఈ జవాబును రాసింది. "తండ్రీ,  ఇది నీ దృష్టికి సరైనది గనుక ఇది ఇలానే ఉండనియ్యి."


ఎంత ధన్యకరమైన జవాబు! ఇది నిత్య సత్యం. తల నెరసిపోయిన విశ్వాసి దగ్గర్నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు. దేవుడు మన తండ్రి అనేదే సత్యం. నిజంగా దీన్ని నమ్ముతున్నావా?


నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటూ ఇటూ ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడుకట్టుకుని ఉంటుంది. దేవుడు నీ తండ్రి.


అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకి అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను.


*కారణం లేకుండా రాలేదు నాకీ కష్టాలు* 

*ఉంది దీని వెనుక దేవుని హస్తం*

*నేను చూడలేనిది ఆయనకవగతమే*

*ప్రతి నొప్పి వెనుకా ఉందొక ప్రయోజనం*

*ఈ లోకంలో నష్టం, పై లోకంలో లాభం* 

*అల్లిక వెనుక వైపంతా దారాలు అల్లిబిల్లిగా* *ముందువైపు అంతా అందంగా*

*కళాకారుని కలలు పండిన కళ*

*ప్రభూ, నువ్వు చిత్రకారుడివి*

*నీ ఆకారం ముద్రించు*

*నీ మహిమార్థం నామీద*

-------------------------------------------------------------------

Your heavenly Father knoweth*_ - (Matt - 6:32)


    A visitor at a school for the deaf and dumb was writing questions on the blackboard for the children. By and by he wrote this sentence: “Why has God made me to hear and speak, and made you deaf and dumb?”


    The awful sentence fell upon the little ones like a fierce blow in the face. They sat palsied before that dreadful “Why?” And then a little girl arose.


    Her lip was trembling. Her eyes were swimming with tears. Straight to the board she walked, and, picking up the crayon, wrote with firm hand these precious words: “Even so, Father, for so it seemed good in thy sight!” What a reply! It reaches up and lays hold of an eternal truth upon which the maturest believer as well as the youngest child of God may alike securely rest—the truth that God is your Father.


    Do you mean that? Do you really and fully believe that? When you do, then your dove of faith will no longer wander in weary unrest, but will settle down forever in its eternal resting place of peace. “Your Father!”


    I can still believe that a day comes for all of us, however far off it may be, when we shall understand; when these tragedies, that now blacken and darken the very air of heaven for us, will sink into their places in a scheme so august, so magnificent, so joyful, that we shall laugh for wonder and delight.  —Arthur Christopher Bacon


No chance hath brought this ill to me;

’Tis God’s own hand, so let it be,

He seeth what I cannot see.

There is a need-be for each pain,

And He one day will make it plain

That earthly loss is heavenly gain.

Like as a piece of tapestry

Viewed from the back appears to be

Naught but threads tangled hopelessly;

But in the front a picture fair

Rewards the worker for his care,

Proving his skill and patience rare.

Thou art the Workman, I the frame.

Lord, for the glory of Thy Name,

Perfect Thine image on the same. 

Saturday, February 12, 2022

Word Was GOD

 

🏮 నీ జీవితాన్ని కట్టాలని దేవుడు ఆశకలిగి ఉన్నారు 🏮 

🌐 ఇశ్రాయేలీయులు దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ వస్తున్నారు ఎంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వారు దేవుని మాటకు చెవి యొగ్గలేదు, దేవుని గద్ధింపును స్వీకరించలేదు అయితే దేవుడు కల్దీయుల చేతికి వారిని అప్పగించారు,  వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్పగించెను. దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి - 2దినవృ 36:17-20

🌐 అయితే ఆ దినములలో దేవుడు విడిచిపెట్టేసిన యెరూషలేమునకు ప్రాకారము లేదు, దానిని రక్షించువారు లేరు, దానిని కావాలి కాయు వారు లేరు, జనాలందరు కల్దీయుల దాసోహం అయ్యారు, కానీ యెరూషలేములోని ప్రజలు చెల్లాచెదురైపోయారు.... అయితే ఆ సమయములో దేవుడే వారియెడల ప్రేమ గలవారై కాల్చివేయబడిన, చెల్లాచెదురైన వారిని తిరిగి చెరలో నుండి రప్పిస్తానని, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతానని దేవుడే వాగ్దానం చేసారు.  

🚨 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే - ఆమోసు 9:11,12

🚨 మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు - ఆమోసు 9:14,15

🌐 అయితే దేవుడు నిన్ను నన్ను తన మందిరములో ఒలీవ మొక్కలవలె నాటారు. అయితే నీవు నేను కూడా  బహుశా విగ్రహారాధనతో, వ్యభిచారముతో, శరీర క్రియలతో, లోకాచారములతో మన ఆధ్యాత్మిక గుడారమును పాడు చేసుకుని ఉండచ్చు, మన ఆధ్యాత్మిక గుడారము యెరూషలేమువలె ప్రాకారము లేనిదిగా కాల్చివేయబడి ఉండచ్చు. తిరిగి ఎలా బాగుపడాలో తెలియక, తిరిగి ఎలా దేవుని యొద్దకు రావాలో తెలియక, దేవుణ్ణి ఎదుర్కొనలేక నీవు సతమతం అవుతుండవచ్చు అయితే నేడు ప్రేమగల దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు "పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును" అని అలాగే "నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు - యిర్మియా 31:4" 

🌐 దేవుడే నీ జీవితాన్ని కట్టాలని అనుకుంటున్నారు, దేవుడే నీ గుడారమును బాగుచెయ్యాలి అనుకుంటున్నారు కారణం ఏమిటంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు అందుకే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి సైతం మన నిమిత్తం సిలువకు అప్పగించారు కాబట్టి ఇంతగా ప్రేమిస్తున్న దేవుని యొద్దకు చేరి మన జీవితం వాక్యమనే బండపై స్థిరముగా కట్టబడునట్లు దేవుని యొద్దకు తిరిగి వద్దాము, దేవుని చెంతకు చేరుదాము. ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక... ఆమేన్...

Friday, February 11, 2022

Strong Composure

ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి - (రోమా 12:19)

కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చెయ్యడం కంటే చేతులు ముడుచుకుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తిగలవాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన, అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసినవాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభువైతే మౌనంగా మాట తూలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాపనిందలపాలైన వాళ్ళకి, ఏ తప్పు చెయ్యకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్ధమవుతుంది, దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో.

మనుషులు నిన్నపార్థం చేసుకోవచ్చు

నిందించే నెపం వెదకవచ్చు

అభియోగం మోపవచ్చు

తొణకక బెణకక మౌనం వహించు

క్రీస్తే న్యాయాధికారి! వాళ్ళు కాదు

భయం వదలి వీ మౌనబలం చూపించు 

పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, 'ఇవేవీ నన్ను కదిలించలేవు.' అని. 

'ఇవేవీ నన్ను గాయపరచవు' అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి యే అపొస్తలుడు విలపించినట్లు కనబడడు. యేసు ప్రభువు కన్నీళ్ళు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకీ ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే 'ఇవేవీ నన్ను గాయపరచవు' అనడం లేదు పౌలు. గాయమవుతుంది గాని తాను నమ్మినదానినుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢనిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుని పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Dearly beloved, avenge not yourselves - (Rom - 12:19)

     There are seasons when to still demand immeasurably higher strength than to act. Composure is often the highest result of power. To the vilest and most deadly charges, Jesus responded with deep, unbroken silence, such as excited the wonder of the judge and the spectators. To the grossest insults, the most violent ill-treatment and mockery that might well bring indignation into the feeblest heart, He responded with voiceless complacent calmness. Those who are unjustly accused, and causelessly ill-treated know what tremendous strength is necessary to keep silent to God.

“Men may misjudge thy aim,

Think they have cause to blame,

Say, thou art wrong;

Keep on thy quiet way,

Christ is the Judge, not they,

Fear not, be strong.”

    St. Paul said, “None of these things move me.”

    He did not say, none of these things hurt me. It is one thing to be hurt, and quite another to be moved. St. Paul had a very tender heart. We do not read of any apostle who cried as St. Paul did. It takes a strong man to cry. Jesus wept, and He was the manliest man that ever lived. So it does not say, none of these things hurt me. But the apostle had determined not to move from what he believed was right. He did not count as we are apt to count; he did not care for ease; he did not care for this mortal life. He cared for only one thing, and that was to be loyal to Christ, to have His smile. To St. Paul, more than to any other man, His work was waged, His smile was Heaven.  —Margaret Bottome