Sunday, April 10, 2022

Discovering God's Graces

 నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియజేయుము (యోబు 10:2)

అలసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చెయ్యడానికి దేవుడు నిన్నిలా బాధలకి గుర్తుచేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లోగాని బయటికి తెలియనివి ఉన్నాయి. ప్రేమ మిణుగురు పురుగులాంటిది. చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనబడదు. నిరీక్షణ అనేది మిణుకు మిణుకుమనే తారలాంటిది. సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో, పగటి వేళ సూర్యకాంతిలో అది కనబడదు. శ్రమ కాలంలో, చీకటి రాత్రిలోనే దాన్ని చూడగలం. కష్టాలనేవి నల్లవి ముఖమల్ గుడ్డల్లాంటివి. వాటిలో దేవుడు వజ్రాలవంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు. ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తళుకులు విరజిమ్ముతాయి.

ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళూని ప్రార్థించావు, 'ప్రభూ నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది. నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి' అని.

మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది. నీకు తెలియకపోవచ్చు. ఈ ప్రార్ధనకి పర్యవసానం. ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకి గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నదీ లేనిదీ తెలిసేదీ? ఇది నీకు ఆధారం. మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మన పైకి శ్రమలను పంపుతుంటాడు. మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు. ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి. 

దేవుడు తన సైనికులకు శిక్షణనిచ్చేది సౌకర్యాలు, సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు. బయట ఎండలో కవాతులు, కఠినమైన విశ్వాసాలతోనే. ఆయన వాళ్ళని సెలయేళ్ళ కడ్డంపడి నడవమంటాడు. నదుల్ని ఈదమంటాడు. కొండలెక్కమంటాడు. వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే. నీతో ఆయన వ్యాజ్యం ఆడడానికి కారణం ఇదే. 

 సైతాను మిమ్ముల్ని కదిలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలులేదు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Show me wherefore thou contendest with me (Job - 10:2)

Perhaps, O tried soul, the Lord is doing this to develop thy graces. There are some of thy graces that would never have been discovered if it were not for the trials. Dost thou does not know that thy faith never looks so grand in summer weather as it does in winter? Love is too oft like a glowworm, showing but little light except it be in the midst of surrounding darkness. Hope itself is like a star—not to be seen in the sunshine of prosperity, and only to be discovered in the night of adversity. Afflictions are often the black folds in which God doth set the jewels of His children’s graces, to make them shine the better.

It was but a little while ago that, on thy knees, thou wast saying, “Lord, I fear I have no faith: let me know that I have faith.”

Was not this really, though perhaps unconsciously, praying for trials?—for how canst thou know that thou hast faith until thy faith is exercised? Depend upon it. God often sends us trials that our graces may be discovered, and that we may be certified of their existence. Besides, it is not merely discovery; real growth in grace is the result of sanctified trials.

God trains His soldiers, not in tents of ease and luxury, but by turning them out and using them for forced marches and hard service. He makes them ford through streams, swim through rivers and climb mountains, and walk many a weary mile with heavy knapsacks on their backs. Well, Christian, may not this account for the troubles through which you are passing? Is not this the reason why He is contending with you? —C. H. Spurgeon

Saturday, April 9, 2022

Spiritual Force

ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవి (ఆది 42:36). 

దేవుని ప్రేమించువారికి ... మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము (రోమా 8:28). 

చాలామంది శక్తిహీనులుగా ఉంటారు. అయితే శక్తి ఎలా వస్తుంది? ఒక రోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ పెద్ద ట్రాలీ ఇంజన్లు విద్యుచ్ఛక్తి ద్వారా పని చెయ్యడం చూసాం. లోపల ఎక్కడ నుంచో ఎన్నెన్నో  చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన రొద చేస్తున్నాయి. మాతో ఉన్న మిత్రుణ్ణి మేము అడిగాము.

“అంతటి శక్తి ఎలా పుడుతుంది?”

“ఏముంది, ఆ చక్రాలు ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుచ్ఛక్తి పుడుతుంది” అని అతను జవాబిచ్చాడు.

అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని కోరితే ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తాడు. రాపిడి ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాడు. కొందరికిది ఇష్టం లేక, ఇలాటి వత్తిడులనుండి పారిపోతుంటారు. ఈ వత్తిడులనాధారం చేసుకుని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలంపు ఉండదు.

వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి. ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి, కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి, ఈ రెండు శక్తులూ సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది. ఒక శక్తి ఆకర్షిస్తున్నది, మరొకటి వికర్షిస్తున్నది. ఒకటి చర్య, మరోటి ప్రతిచర్య. ఈ కారణం వల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యంలేని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్ష్యలో సవ్యంగా తాను తిరుగుతున్నది.

ఇలానే దేవుడు మన జీవితాలు నడిపిస్తుంటాడు. ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరం. అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన, శ్రమల వత్తిడులలో జీవిత సమస్యలతో పరీక్షిస్తుంటాడు. మనకి వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మనపైకి తెస్తుంటారు. కానీ నిజానికవి మన ఉనికినీ, గమనాన్నీ స్థిరపరచే శక్తులే.

ఈ రెండు రకాల శక్తుల కోసమూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన మనకిచ్చిన రెక్కల్ని, మనపై పెట్టిన బరువుల్నీ కూడా స్వీకరిద్దాము. ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోను, ఓపికతోను పరలోకపు పిలుపుకనుగుణంగా సాగిపోదాము.

కర్మాగారంలో చక్రాలూ యంత్రాలూ తిరుగుతున్నాయి

కప్పీలు, పట్టీలు ఒకదానిలో ఒకటి ఒకదాని వెంట ఒకటి

కొన్ని మౌనంగా రంగులరాట్నంలా తిరుగుతున్నాయి

కొన్ని ముందుకి తన్నుతూ వెనక్కి లాగుతూ గోల పెడుతున్నాయి

కొన్ని మృదువుగా, కొన్ని మొద్దుగా శబ్దాలు చేస్తున్నాయి

గొడవచేస్తూ, మూలుగుతూ, గర్జిస్తూ కదులుతూ, కదిలిస్తూ.


దేనిదారిన అది అర్థం కాకుండా, సంబంధం లేనట్టు

ఊగుతూ లాగుతూ, తూగుతూ రేగుతూ

బ్రహ్మాండమైన చక్రంనుండి చిట్టిమేకు దాకా దేని పనిలో అది

అన్నీ కలిపి సాధించే పని ఒకటే, ప్రయోజనం ఒక్కటే.

కదలికలనూ పనులనూ నిర్దేశించే తెలివి ఒక్కటే

యంత్రబలాన్ని క్రమపరిచే హస్తం ఒక్కటే.


దైవకుమారులకి పనులన్నీ సమకూడి జరుగుతున్నాయి

కొన్ని పనులు బాధిస్తాయి. కొన్ని కష్టపెడతాయి 

కొన్ని అడ్డగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి

కాని అన్నీ మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి

తీరని కోరికలూ, చెదరిన ఆశలూ, అర్థంకాని పరిశోధనలూ, శాపాలూ

వీటన్నింటినీ ముందుకీ వెనక్కీ మెల్లిగా వేగంగా

నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతూ మీట నొక్కుతూ

ఉన్నది మన తండ్రి దేవుడే

-----------------------------------------------------------------------------------------------------------------------------

All these things are against me (Gen -  42:36)

All things work together for good to them that love God - Rom 8:28

Many people are wanting power. Now how is power produced? The other day we passed the great works where the trolley engines are supplied with electricity. We heard the hum and roar of the countless wheels, and we asked our friend,

“How do they make the power?”

“Why,” he said, “just by the revolution of those wheels and the friction they produce. The rubbing creates the electric current.”

And so, when God wants to bring more power into your life, He brings more pressure. He is generating spiritual force by hard rubbing. Some do not like it and try to run away from the pressure, instead of getting the power and using it to rise above the painful causes.

Opposition is essential to a true equilibrium of forces. The centripetal and centrifugal forces acting in opposition to each other keep our planet in her orbit. The one propelling, and the other repelling, so act and re-act, that instead of sweeping off into space in a pathway of desolation, she pursues her even orbit around her solar center.

So God guides our lives. It is not enough to have an impelling force—we need just as much a repelling force, and so He holds us back by the testing ordeals of life, by the pressure of temptation and trial, by the things that seem against us, but really are furthering our way and establishing our goings.

Let us thank Him for both, let us take the weights as well as the wings, and thus divinely impelled, let us press on with faith and patience in our high and heavenly calling. —A. B. Simpson

In a factory building, there are wheels and gearings,  

There are cranks and pulleys, beltings tight or slack—  

Some are whirling swiftly, some are turning slowly,  

Some are thrusting forward, some are pulling back;  

Some are smooth and silent, some are rough and noisy,  

Pounding, rattling, clanking, moving with a jerk;  


In a wild confusion in seeming chaos,  

Lifting, pushing, driving—but they do their work.  

From the mightiest lever to the tiniest pinion,  

All things move together for the purpose planned;  

And behind the working is a mind-controlling,  

And a force directing, and a guiding hand.  


So all things are working for the Lord’s beloved;  

Some things might be hurtful if alone they stood;  

Some might seem to hinder; some might draw us backward;  

But they work together, and they work for good,  

All the thwarted longings, all the stern denials,  

All the contradictions are hard to understand.  

And the force that holds them, speeds them and retards them,  

Stops and starts and guides them—is our Father’s hand.  

—Annie Johnson Flint

Friday, April 8, 2022

Thankful for the Thorns

 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను (2 కొరింథీ 12:10).

ఈ వచనాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనక ఉన్న భావనా శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే “నాకు బలం లేని సమయంలో నన్నెవరన్నా చీటికిమాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, మూలమూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేననుభవించేటప్పుడు నేను అగ్గిపిడుగుని."

దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువ లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనమున్న పరిస్థితులతో మనకిక పనిలేదు. ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసని బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము. ఎందుకంటే సాక్షాత్తూ ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకర్థమువుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకి తిరిగి ఇవి మనకి సంభవించాయి గనుక ఆయన మనకి ప్రతిగా చెయ్యవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురుచూస్తాం.

స్కాట్లాండ్ దేశంలో తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్తకుడు జార్జి మాథిసన్ గారు ఓసారి ఇలా అన్నారు, “ప్రభూ నాలో నీవుంచిన ముల్లు విషయం నీకెన్నడూ కృతజ్ఞతనర్పించ లేదు. నాకిచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను. గాని, ముల్లు కోసం ఒకసారి కూడా స్తుతించ లేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా నిత్య జీవితంలో నాకు దొరికే భాగ్యం కోసమే ఎదురుచూసాను గాని, ఇప్పుడు మోస్తున్న శిలువే నాకు ఇక్కడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేక పోయాను."

“నీ సిలువ మహాత్యాన్ని నాకు తెలియజెయ్యి. నా ముల్లులోని విలువను నాకు తెలియజెప్పు. నా శ్రమల మార్గంలోగుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరుచు. నా కన్నీళ్ళలో వెలిసిన ఇంద్రధనుస్సులను నాకు చూపించు.”

ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో

చుక్క తళుక్కుమన్నది

చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది

-----------------------------------------------------------------------------------------------------------------------------

Therefore I take pleasure in infirmities, in reproaches, in necessities, in persecutions, in distresses for Christ's sake: for when I am weak, then am I strong (2 Cor - 12:10)

The literal translation of this verse gives a startling emphasis to it and makes it speak for itself with a force that we have probably never realized. Here It Is: “Therefore I take pleasure in being without strength, in insults, in being pinched, in being chased about, in being cooped up in a corner for Christ’s sake; for when I am without strength, then am I dynamite.”

Here is the secret of Divine all-sufficiency, to come to the end of everything in ourselves and in our circumstances. When we reach this place, we will stop asking for sympathy because of our hard situation or bad treatment, for we will recognize these things as the very conditions of our blessing, and we will turn from them to God and find in them a claim upon Him. —A. B. Simpson

George Matheson, the well-known blind preacher of Scotland, who recently went to be with the Lord, said: "My God, I have never thanked Thee for my thorn. I have thanked Thee a thousand times for my roses, but not once for my thorn. I have been looking forward to a world where I shall get compensation for my cross, but I have never thought of my cross as itself a present glory.

“Teach me the glory of my cross; teach me the value of my thorn. Show me that I have climbed to Thee by the path of pain. Show me that my tears have made my rainbows.”

“Alas for him who never sees  

The stars shine through the cypress trees.”