Thursday, May 5, 2022

The Mountain After the Quake

 

ఆయన గాయ పరచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును*_ (యోబు 5:18).

భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లోగుండా మనం వెళ్తే మనకి తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది అలుముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ళ క్రింద ప్రశాంతమైన సరస్సులు పలుకరిస్తాయి. ఆ బండరాళ్ళ నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జల వల్లులు మొలకలెత్తాయి. నాశనం జరిగిపోయిన తరువాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద వాతావరణం సరికొత్త రూపు దిద్దుకుంటుంది. దాని ఆలయ శిఖరం తెల్లగా తుపాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకి రక్షణ కోసం అర్రులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకి చూస్తుంటుంది. భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వతాల గాంభీర్యం ఆయనదే.

*భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు,*

*లోతుగా నెర్రెలుచేసి గాయపరిచాడు.*

*నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి.*

*కొండలు బండలు ఎగిరెగిరి పడ్డాయి.*


*పర్వతాలకి తెలుసు దైవ రహస్యం*

*అనాదిగా మదిలో దాచుకున్న సత్యం*

*దేవుని శాంతి ఉంటుంది నిత్యం,*

*ఇదే వాటి విశ్రాంతికి ఆధారం.* 


*అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు.*

*తన కృపకు అవే జన్మ స్థానాలు*

*తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు.*

*చేసాయవి సంధ్యాకాంతిలో స్నానాలు* 


*కొండగాలి వాటికి వార్తాహరుడు*

*సుడిగాలులు కేంద్రంనుండి వచ్చే సమాచారాలు*

*కారుమబ్బు వర్షపు ధారలు ప్రేమ గీతాలు*

*లోయల్లో ధ్వనించి వ్యాపించే సంగీతాలు.*


*పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి.*

*వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి.*

*శ్రమలు విరుచుకుపడ్డప్పుడు*

*కష్టాలు ముంచుకొచ్చినప్పుడు* 


*దేవుడు తన పర్వతాలను తన నాగలితో దున్నుతున్నాడని*

*కృపా సమృద్ధి బీజాలను విత్తనున్నాడని*

*నిత్యమైన ఆయన శాంతిని తలచి*

*తత్తరపాటును మానండి*

-----------------------------------------------------------------------------------------------------------------------------

He maketh sore, and bindeth up he woundeth and his hands make whole* (Job - 5:18)

The ministry of great sorrow.

As we pass beneath the hills which have been shaken by the earthquake and torn by convulsion, we find that periods of perfect repose succeed those of destruction. The pools of calm water lie clear beneath their fallen rocks, the water lilies gleam, and the reeds whisper among the shadows; the village rises again over the forgotten graves, and its church tower, white through the storm twilight, proclaims a renewed appeal to His protection “in whose hand are all the corners of the earth, and the strength of the hills is his also.” —Ruskin

God plowed one day with an earthquake,  

And drove His furrows deep!  

The huddling plains upstarted,  

The hills were all a leap!  


But that is the mountains’ secret,  

Age-hidden in their breast;  

“God’s peace is everlasting,”  

These are the dream words of their rest.  


He made them the haunts of beauty,  

The home elect of His grace;  

He spreadeth His mornings upon them,  

His sunsets light their face.  


His winds bring messages to them  

Wild storm news from the main;  

They sing it down the valleys  

In the love song of the rain.  


They are nurseries for young rivers,  

Nests for His flying cloud,  

Homesteads for new-born races,  

Masterful, free, and proud.  


The people of tired cities  

Come up to their shrines and pray;  

God freshens again within them,  

As He passes by all day.  


And lo, I have caught their secret!  

The beauty is deeper than all!  

This faith—that life’s hard moments,  

When the jarring sorrows befall,  


Are but God plowing His mountains;  

And those mountains yet shall be  

The source of His grace and freshness,  

And His peace everlasting to me.  

—William C. Gannett

Wednesday, May 4, 2022

Call Upon the Lord

 

ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు*_ (యోవేలు 2:32).

నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్త ధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరుగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొర్ర పెట్టకూడదు? నాకై నేను కూర్చుని పథకాలూ, అంచనాలు వేసుకోవడం దేనికీ? ఏ గొడవా లేకుండా నన్నూ నా భారాన్ని ఆయన మీద వెయ్యడానికి అభ్యంతరం ఏమిటి?

గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరుగెత్తేవాడే సరైన పందెగాడు. అలాంటప్పుడు నేను అటూ, ఇటూ పరుగెత్తడం దేనికీ? సహాయం కోసం మరెక్కడో వెదికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యలనుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయతను ఆయన నాకిచ్చాడు.

ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే “ప్రార్థన చేయు వారందరును” అనే మాట అంతు లేనిది. 'వారందరును’ అనే దాన్లో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగినవాళ్ళు ఎవరైనా, అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను. 

నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకనవసరం. వాగ్దానం చేసినవాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు, పద్దతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడడమే. ఆయనకి సలహాలివ్వడానికి నేనెవరిని? నేనాయన భృత్యుణ్ణి మాత్రమే. మంత్రిని కాను. మొర్రపెట్టడమే నా వంతు. విడిపించడం ఆయన పని.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And it shall come to pass that whosoever shall call on the name of the Lord shall be delivered* (Joel - 2:32)

Why do not I call on His name? Why do I run to this neighbor when God is so near and will hear my faintest call? Why do I sit down and devise schemes and invent plans? Why not at once roll me and my burden upon the Lord?

Straightforward is the best runner—why do not I run at once to the living God? In vain shall I look for "deliverance anywhere else; but with God, I shall find it; for here I have His royal shall to make it sure.

I need not ask whether I may call on Him or not, for the word “Whosoever” is a very wide and comprehensive one. Whosoever means me, for it means anybody and everybody who calls upon God. I will therefore follow the leading of the text, and at once call upon the glorious Lord who has made so large a promise.

Tuesday, May 3, 2022

How Your Spiritual Life

🌿 ప్రతిరోజు ప్రార్ధన చేస్తున్నాను, వాక్యము చదువుతున్నాను, అంతా సవ్యమైన దిశలోనే నా ఆధ్యాత్మిక జీవితం ఉంది అని చాలాసార్లు మనం నిర్లిప్తముగా ఉంటూ ఉంటాము.. దేవునితో సహవాసం సరైన దిశలోనే ఉందొ లేదో అనే అనుమానం లేకుండా ఆలోచన దరిచేరనివ్వకుండా జీవించేస్తూ ఆచారబద్ధమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ రోజులు గడిపేస్తుంటాము... అయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే "తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను - 1కోరింథీయులకు 10:12" అని దేవుడు స్పష్టముగా చెప్తున్నారు.

🍂 ఇశ్రాయేలీయులు అందరు మోషే మాట చొప్పున నడిచి ఐగుప్తు దేశమునుండి బయలుదేరారు. అందరు ఆకాశము నుండి వచ్చిన మన్నాను భుజించారు, ఒకే బండ నుండి వచ్చిన నీటిని పానము చేసారు, ఒక్కటే మేఘము క్రింద నడిచారు అయితే నలువది సంవత్సరములు గడచి వాగ్దాన దేశమైన కనానును చేరేప్పటికీ ఎవరైతే ఐగుప్తు దేశమునుండి బయలుదేరారో వారిలో అందరు వారి తరమంతా మధ్యలోనే రాలిపోయింది..... కేవలం యెహోషువ, కాలేబు తప్ప... అందుకే వారి గురించి దేవుడు చెప్తున్నారు వారిలో ఎక్కువమంది దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములోని సంహరించబడ్డారు అని. 

🌿 ఎందుకు వారు సంహరించబడ్డారు అంటే దేవుడే నాలుగు కారణాలు చెప్తున్నారు. విగ్రహారాధన, వ్యభిచారం, దేవుణ్ణి శోధించడం, దేవునిపై సణగటం అని. 

🍂 మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి - 1కోరింథీయులకు 10:1-5 

🍂 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. వారివలె మనము వ్యభిచరింపకయుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి - 1కోరింథీయులకు 10:7-10

🌿 అయితే నేడు మనము కూడా ఒక్కటే ఆహారమైన జీవాహారమును... ఒక్కటే పానీయము అయిన జీవజలమును, అలాగే ఒక్క దేవుణ్ణి సేవిస్తున్నాము... అయితే మనం దేవునికి యిష్టులుగా  ఉంటున్నామా... లేక వారివలె దేవునికి ఇష్టములేని జీవితము జీవిస్తున్నామా.... తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని దేవుడు తెలియజేస్తున్నారు గనుక ఒక్కసారి ఆలోచిద్దాము... దేవుని చేతిలో సంహరించేబడే విధముగా మన జీవితం ఉంటుందా లేక దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుందాము...