Saturday, May 21, 2022

Remember My Song in the Night

నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసికొందును. (కీర్తన 77:6).

పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు యజమాని కోరిన పాట ఎంతమాత్రమూ పాడదు. ఓ కూనిరాగం తీస్తుందేమోగాని పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు.

చాలామంది చీకటి అలుముకుంటేనే గాని పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముల్లుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దూతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి. ‘ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి' అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది.

నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి, చీకట్లు ఆవరించే వరకూ ఆత్మకు తనను ఊరడించి సంతృప్తి పరచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు.

వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది, ఉదయకాంతి అనేది రాత్రి చీకటి కడుపులోనుంచే వస్తుంది.

నటాలీ అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు.

“అదో మరుపురాని ప్రయాణం, గులాబి పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాలనుండే ఎగుమతి ఔతుందని నాకప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబి పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు.

మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకొన్నాను. వైజ్ఞానిక పరీక్షలు ఋజువు చేసిందేమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబి పూలలో నుండి 40 శాతం పరిమళం తగ్గిపోతుందని.”

ఈ ఉదాహరణను మన ఆత్మలకు ఎలా అన్వయించుకోగలం? ఆ గులాబీలు చీకట్లో ఉన్నపుడు కలిగినంత పరిమళం వెలుగులో ఉన్నప్పుడు కలిగి ఉండటం లేదు. అలాగే మనం కూడా చీకటి బాధలలో ఉన్నప్పుడే ఎక్కువగా క్రీస్తు పరిమళాలను పోగు చేసుకుంటాం.

----------------------------------------------------------------------------------------------------------------------------

I call to remembrance my song in the night. (Ps - 77:6)

I have read somewhere of a little bird that will never sing the melody his master wishes while his cage is full of light. He learns a snatch of this, a bar of that, but never an entire song of its own until the cage is covered and the morning beams shut out.

A good many people never learn to sing until the darkling shadows fall. The fabled nightingale carols with his breast against a thorn. It was at the night that the song of the angels was heard. It was at midnight that the cry came, “Behold, the bridegroom cometh; go ye out to meet him.”

Indeed it is extremely doubtful if a soul can really know the love of God in its richness and in its comforting, satisfying completeness until the skies are black and lowering.

Light comes out of darkness, morning out of the womb of the night.

James Creelman, in one of his letters, describes his trip through the Balkan States in search of Natalie, the exiled Queen of Serbia.

“In that memorable journey,” he says, “I learned for the first time that the world’s supply of attar of roses comes from the Balkan Mountains. And the thing that interested me most,” he goes on, "is that the roses must be gathered in the darkest hours. The pickers start out at one o’clock and finish picking them at two.

“At first it seemed to be a relic of superstition, but I investigated the picturesque mystery, and learned that actual scientific tests had proven that fully forty percent of the fragrance of roses disappeared in the light of day.”

And in human life and human culture that is not a playful, fanciful conceit; it is a real veritable fact. -Malcolm J. McLeod

Friday, May 20, 2022

Receive the Cup of Sorrow

తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. (యోహాను 18:11).

ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన, అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి.

కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే, మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు. కాని మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో, మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం.

ఆపైన “అయ్యో ప్రభూ! నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది” అంటూ మనం దేవునికి ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం.


*దేవా బాధని తొలగించు*

*ఆక్రోశించాడు మనిషి*

*నువ్వు చేసిన ప్రపంచాన్ని*

*చీకటి అలుముకుంది*

*గుండెని గొలుసులతో కట్టి*

*రెక్కల్ని నేలకి బిగబట్టి*

*నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు*

*నువ్వు చేసిన ప్రపంచాన్ని*

*బాధలనుండి విడిపించు*


*బాధను రూపుమాపమంటావా?*

*గంభీరంగా పలికాడు దేవుడు*

*ఓర్చుకుని శక్తినొందే అవకాశాన్ని*

*నీ ఆత్మకు లేకుండా చేయమంటావా?*

*గుండెను గుండెను ముడి వేసే సానుభూతిని*

*సమూల నాశనం చేస్తే*

*త్యాగాన్ని లోకం నుండి తొలగిస్తే*

*నీ హత సాక్షులు ఇంకెవరు?*

*అగ్నికి ఆహుతై ఆకాశానికి ఎగసేదెవరు?*

*ప్రాణం పెట్టే ప్రేమను*

*ఆ ప్రేమ తెచ్చే చిరు నవ్వునూ*

*తీసెయ్యమంటావా?*

*క్రీస్తు సిలువకు ఎగబ్రాకే కరుణా శక్తిని*

*నీ జీవితం నుండి తీసెయ్యమంటావా?*

*తీసెయ్యమంటావా?*

-----------------------------------------------------------------------------------------------------------------------------

Shall I refuse to drink the cup of sorrow which the Father has given me to drink? (John - 18:11)

God takes thousand times more pains with us than the artist with his picture, by many touches of sorrow, and by many colors of circumstance, to bring us into the form which is the highest and noblest in His sight, if only we receive His gifts of myrrh in the right spirit.

But when the cup is put away, and these feelings are stifled or unheeded, a greater injury is done to the soul that can ever be amended. For no heart can conceive in what surpassing love God giveth us this myrrh, yet this which we ought to receive to our souls’ good we suffer to pass by us in our sleepy indifference, and nothing comes of it.

Then we come and complain: “Alas, Lord! I am so dry, and it is so dark within me!” I tell thee, dear child, open thy heart to the pain, and it will do thee more good than if thou were full of feeling and devoutness. —Tauler


“The cry of man’s anguish went up to God,  

 ’Lord takes away pain:  

The shadow that darkens the world Thou hast made,  

The close-coiling chain  

That strangles the heart, the burden that weighs  

On the wings that would soar,  

Lord, take away the pain from the world Thou hast made,  

That it love Thee the more.’  


“Then answered the Lord to the cry of His world:  

’Shall I take away the pain,  

And with it the power of the soul to endure,  

Made strong by the strain?  

Shall I take away pity, that knits heart to heart  

And sacrifice high?  

Will ye lose all your heroes that lift from the fire  

White brows to the sky?  

Shall I take away the love that redeems with a price  

And smiles at its loss?  

Can ye spare from your lives that would climb unto Me  

The Christ on His cross?”

Thursday, May 19, 2022

Attitude of Trust

అతడు మాటలాడుట చాలింపకముందే... అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు (అనెను). (ఆది 24:15,27).

యథార్థమైన ప్రతి పార్ధనకీ ఆ ప్రార్థన ముగియకముందే జవాబు దొరుకుతుంది. మనం మాటలాడుట చాలించకముందే మన మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడెప్పుడో మాట యిచ్చాడు. క్రీస్తు నామం పేరిట (అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్తం ప్రకారం) విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని వాగ్దానం చేశాడు. 

దేవుని మాట నిరర్థకం కానేరదు. ప్రార్థనకి సంబంధించిన ఈ కొన్ని నిబంధనలనూ మనం అనుసరిస్తే, మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది. పూర్తి అవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు.

కాబట్టి ప్రతి ప్రార్థననూ స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని, సత్యాన్ని చూపించడం మానడు (దానియేలు 9:20-27, 10:12 కూడా చదవండి).

మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులూ, ప్రార్థనలూ ఉండాలి. మనం అడిగినదానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి. మనం అడిగినదానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకం.

ఒక కన్యక పెళ్ళయినప్పుడు ఆమె దృక్పధం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తును మన రక్షకునిగా, పరిశుద్ధపరిచేవానిగా, బాగుచేసేవానిగా, విడిపించేవానిగా స్వీకరించినప్పటి నుంచీ ఆయన మీద మనం ఎలాటి ఆశపెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి, ఆయన మన పట్ల ఏవిధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి.


*ప్రార్థనలో నేనడిగిన మాట*

*ప్రార్థించిన ప్రకారమే*

*ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు.*

*దేవునికి స్తోత్రం*

-----------------------------------------------------------------------------------------------------------------------------

And it came to pass, before he had done speaking...and he said, Blessed be Jehovah...who hath not forsaken his lovingkindness and his truth. (Gen - 24:15,27)

Every right prayer is answered before the prayer itself is finished—before we have “done speaking.” This is because God has pledged His Word to us that whatsoever we ask in Christ’s name (that is, in oneness with Christ and His will) and in faith, shall be done.

As God’s Word cannot fail, whenever we meet those simple conditions in prayer, the answer to our prayer has been granted and completed in Heaven as we pray, even though its showing forth on earth may not occur until long afterward.

So it is well to close every prayer with praise to God for the answer that He has already granted; He who never forsakes His loving-kindness and His truth. (See Daniel 9:20-27 and 10:12.) —Messages for the Morning Watch

When we believe for a blessing, we must take the attitude of faith, and begin to act and pray as if we had the blessing. We must treat God as if He had given us our request. We must lean our weight over upon Him for the thing that we have claimed, and just take it for granted that He gives it, and is going to continue to give it. This is the attitude of trust.

When the wife is married, she at once falls into a new attitude, and acts in accordance with the fact; and so when we take Christ as our Savior, as our Sanctifier, as our Healer, or as our Deliverer, He expects us to fall into the attitude of recognizing Him in the capacity that we have claimed, and expect Him to be to us all that we have trusted Him for. —Selected

“The thing I ask when God doth bid me pray,  

Begins in that same act to come my way.”