Sunday, May 22, 2022

He Worketh

ఆయన... నెరవేర్చును. (కీర్తన 37:5). 

“నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యమును నెరవేర్చును” అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేసారు.

“యెహోవా అనే మార్గం మీద పయనించు. ఆయన్ని నమ్ము, ఆయన పనిచేస్తాడు.”

మనం నమ్మినప్పుడు, దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకు చూపిస్తుందీ వాక్యం. మన చేతుల్లో ఉన్న భారమంతటినీ ఆయన మీదికి పొరలించు. అది దుఃఖకరమైన సంగతి కావచ్చు, శారీరకావసరం కావచ్చు లేదా మనకిష్టులైన వాళ్ళెవరన్నా మారుమనస్సు పొందాలన్న ఆత్రుత కావచ్చు.

ఆయన నెరవేరుస్తాడు, ఎప్పుడు? ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము. ఆయన వెంటనే నెరవేరుస్తాడు. అందుకని ఆయన్ని స్తుతించండి.

మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకు సహాయపడుతుంది. మనకైతే ఆ పని అసాధ్యం. దాని విషయం మనమిక ఏమీ కల్పించుకోము. ఆయనే నెరవేరుస్తాడు.

ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి, మరిక దాన్లో వేలు పెట్టవద్దు. ఎంత హాయిగా ఉంటుంది! ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు.

ఇలా చెయ్యడం వల్ల నాకేం ఫలితం కనిపించడంలేదు అని కొందరనుకోవచ్చు. పర్వాలేదు, ఆయన పనిచేస్తున్నాడు. నీ పని అంతా ఆయన మీదికి నెట్టేసావుగా. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో. మొత్తానికి ఆయన మాత్రం పనిమీదే ఉన్నాడు, సందేహం లేదు.

*మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొఱ్ఱపెట్టుచున్నాను* (57:2). మరొక అనువాదం ఇలా ఉంది. “నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు.” ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా? నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని, లేక ఈ రోజు నేను చెయ్యవలసిన పని, నా తలకి మించిన ఈ పని, చెయ్యగలనులే అనుకొని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని - ఈ పనే నేను ఆయనకి అప్పగించి నాకోసం దాన్ని చేసి పెట్టమంటాను. ఇహ చీకు చింతా లేకుండా హాయిగా ఉంటాను. ఆయన చూసుకుంటాడు. 

దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ, ఇవి చాలవా, ప్రతి నిత్యమూ ఆయన వైపు చేతులు చాపడానికి?

-----------------------------------------------------------------------------------------------------------------------------

He worketh. (Ps - 37:5)

The translation that we find in Young of “Commit thy way unto the Lord; trust also in him; and he shall bring it to pass,” reads: “Roll upon Jehovah thy way; trust upon him: and he worketh.”

It calls our attention to the immediate action of God when we truly commit, or roll out of our hands into His, the burden of whatever kind it may be; a way of sorrow, of difficulty, of physical need, or of anxiety for the conversion of some dear one.

“He worketh.” When? Now. We are so in danger of postponing our expectation of His acceptance of the trust, and His undertaking to accomplish what we ask Him to do, instead of saying as we commit, “He worketh.” “He worketh” even now; and praise Him that it is so.

The very expectancy enables the Holy Spirit to do the very thing we have rolled upon Him. It is out of our reach. We are not trying to do it any more. “He worketh!”

Let us take the comfort out of it and not put our hands on it again. Oh, what a relief it brings! He is really working on the difficulty.

But someone may say, “I see no results.” Never mind. “He worketh,” if you have rolled it over and are looking to Jesus to do it. Faith may be tested, but “He worketh”; the Word is sure! —V. H. F.

“I will cry unto God most high; unto God that performeth all things for me” (Ps. 57:2).

The beautiful old translation says, “He shall perform the cause which I have in hand.” Does not that make it very real to us today? Just the very thing that “I have in hand”—my own particular bit of work today, this cause that I cannot manage, this thing that I undertook in miscalculation of my own powers—this is what I may ask Him to do “for me,” and rest assured that He will perform it. “The wise and their works are in the hands of God.” —Havergal

The Lord will go through with His covenant engagements. Whatever He takes in hand He will accomplish; hence past mercies are guarantees for the future and admirable reasons for continuing to cry unto Him. —C. H. Spurgeon

Saturday, May 21, 2022

Remember My Song in the Night

నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసికొందును. (కీర్తన 77:6).

పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు యజమాని కోరిన పాట ఎంతమాత్రమూ పాడదు. ఓ కూనిరాగం తీస్తుందేమోగాని పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు.

చాలామంది చీకటి అలుముకుంటేనే గాని పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముల్లుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దూతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి. ‘ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి' అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది.

నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి, చీకట్లు ఆవరించే వరకూ ఆత్మకు తనను ఊరడించి సంతృప్తి పరచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు.

వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది, ఉదయకాంతి అనేది రాత్రి చీకటి కడుపులోనుంచే వస్తుంది.

నటాలీ అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు.

“అదో మరుపురాని ప్రయాణం, గులాబి పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాలనుండే ఎగుమతి ఔతుందని నాకప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబి పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు.

మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకొన్నాను. వైజ్ఞానిక పరీక్షలు ఋజువు చేసిందేమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబి పూలలో నుండి 40 శాతం పరిమళం తగ్గిపోతుందని.”

ఈ ఉదాహరణను మన ఆత్మలకు ఎలా అన్వయించుకోగలం? ఆ గులాబీలు చీకట్లో ఉన్నపుడు కలిగినంత పరిమళం వెలుగులో ఉన్నప్పుడు కలిగి ఉండటం లేదు. అలాగే మనం కూడా చీకటి బాధలలో ఉన్నప్పుడే ఎక్కువగా క్రీస్తు పరిమళాలను పోగు చేసుకుంటాం.

----------------------------------------------------------------------------------------------------------------------------

I call to remembrance my song in the night. (Ps - 77:6)

I have read somewhere of a little bird that will never sing the melody his master wishes while his cage is full of light. He learns a snatch of this, a bar of that, but never an entire song of its own until the cage is covered and the morning beams shut out.

A good many people never learn to sing until the darkling shadows fall. The fabled nightingale carols with his breast against a thorn. It was at the night that the song of the angels was heard. It was at midnight that the cry came, “Behold, the bridegroom cometh; go ye out to meet him.”

Indeed it is extremely doubtful if a soul can really know the love of God in its richness and in its comforting, satisfying completeness until the skies are black and lowering.

Light comes out of darkness, morning out of the womb of the night.

James Creelman, in one of his letters, describes his trip through the Balkan States in search of Natalie, the exiled Queen of Serbia.

“In that memorable journey,” he says, “I learned for the first time that the world’s supply of attar of roses comes from the Balkan Mountains. And the thing that interested me most,” he goes on, "is that the roses must be gathered in the darkest hours. The pickers start out at one o’clock and finish picking them at two.

“At first it seemed to be a relic of superstition, but I investigated the picturesque mystery, and learned that actual scientific tests had proven that fully forty percent of the fragrance of roses disappeared in the light of day.”

And in human life and human culture that is not a playful, fanciful conceit; it is a real veritable fact. -Malcolm J. McLeod

Friday, May 20, 2022

Receive the Cup of Sorrow

తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. (యోహాను 18:11).

ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన, అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి.

కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే, మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు. కాని మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో, మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం.

ఆపైన “అయ్యో ప్రభూ! నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది” అంటూ మనం దేవునికి ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం.


*దేవా బాధని తొలగించు*

*ఆక్రోశించాడు మనిషి*

*నువ్వు చేసిన ప్రపంచాన్ని*

*చీకటి అలుముకుంది*

*గుండెని గొలుసులతో కట్టి*

*రెక్కల్ని నేలకి బిగబట్టి*

*నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు*

*నువ్వు చేసిన ప్రపంచాన్ని*

*బాధలనుండి విడిపించు*


*బాధను రూపుమాపమంటావా?*

*గంభీరంగా పలికాడు దేవుడు*

*ఓర్చుకుని శక్తినొందే అవకాశాన్ని*

*నీ ఆత్మకు లేకుండా చేయమంటావా?*

*గుండెను గుండెను ముడి వేసే సానుభూతిని*

*సమూల నాశనం చేస్తే*

*త్యాగాన్ని లోకం నుండి తొలగిస్తే*

*నీ హత సాక్షులు ఇంకెవరు?*

*అగ్నికి ఆహుతై ఆకాశానికి ఎగసేదెవరు?*

*ప్రాణం పెట్టే ప్రేమను*

*ఆ ప్రేమ తెచ్చే చిరు నవ్వునూ*

*తీసెయ్యమంటావా?*

*క్రీస్తు సిలువకు ఎగబ్రాకే కరుణా శక్తిని*

*నీ జీవితం నుండి తీసెయ్యమంటావా?*

*తీసెయ్యమంటావా?*

-----------------------------------------------------------------------------------------------------------------------------

Shall I refuse to drink the cup of sorrow which the Father has given me to drink? (John - 18:11)

God takes thousand times more pains with us than the artist with his picture, by many touches of sorrow, and by many colors of circumstance, to bring us into the form which is the highest and noblest in His sight, if only we receive His gifts of myrrh in the right spirit.

But when the cup is put away, and these feelings are stifled or unheeded, a greater injury is done to the soul that can ever be amended. For no heart can conceive in what surpassing love God giveth us this myrrh, yet this which we ought to receive to our souls’ good we suffer to pass by us in our sleepy indifference, and nothing comes of it.

Then we come and complain: “Alas, Lord! I am so dry, and it is so dark within me!” I tell thee, dear child, open thy heart to the pain, and it will do thee more good than if thou were full of feeling and devoutness. —Tauler


“The cry of man’s anguish went up to God,  

 ’Lord takes away pain:  

The shadow that darkens the world Thou hast made,  

The close-coiling chain  

That strangles the heart, the burden that weighs  

On the wings that would soar,  

Lord, take away the pain from the world Thou hast made,  

That it love Thee the more.’  


“Then answered the Lord to the cry of His world:  

’Shall I take away the pain,  

And with it the power of the soul to endure,  

Made strong by the strain?  

Shall I take away pity, that knits heart to heart  

And sacrifice high?  

Will ye lose all your heroes that lift from the fire  

White brows to the sky?  

Shall I take away the love that redeems with a price  

And smiles at its loss?  

Can ye spare from your lives that would climb unto Me  

The Christ on His cross?”