_*ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరము చుట్టునున్న యీ మేడ గదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.*_ యెహెజ్కేలు 41 : 7
*పైకి పైపైకి సాగిపో పైకి*
*ప్రార్ధనలో ఆరాధనలో*
*రోజులు సంవత్సరాలు*
*కాలాలు గతిస్తూ ఉంటే*
*పైకి పైపైకి ప్రతి యేడు*
*అలయక సొలయక*
*మెట్లెక్కుతూ అడుగులేస్తూ*
*రక్షకుడి వెంట*
*పైపైకి ఆత్మలో సాగిపో*
*కష్టాలు రాని నష్టాలు రాని*
*శోకాలు గుండెల్ని చీల్చనీ*
*శోధనలే సోపానాలు క్రీస్తులో*
*పైకి పైపైకి ఉదయమయ్యేదాకా*
*నీడలు కరిగేదాకా*
*స్వర్గ ద్వారాలు పిలిచేదాకా*
*స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా*
పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులో ఆగిపోకూడదు. కొండలపై కురిసే మంచు ముత్యాలెంత స్వచ్చమైనవి! కొండగాలి ఎంత పరిశుభ్రమైనది! అక్కడ నివసించేవాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలా మంది విశ్వాసులు బొగ్గు గనుల్లో, మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు. వాళ్ళు సూర్యకాంతిని చూడటానికి నోచుకోరు. పరమ తైలంతో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేమీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌధాల మీద నడిచే బదులు చీకటి కొట్లలో జీవితాలు గడుపుతారు. విశ్వాసీ, నీ దీనస్థితి నుండి మేలుకో. నీ బద్దకాన్ని, మత్తునీ, జడత్వాన్ని, చల్లారిపోయి చప్పబడిన ఆత్మనీ, క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్ర బిందువు, సంతోష కిరణం. మరుగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన, సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు. పరలోకం వైపుకు దేవునికి దగ్గరగా సాగిపో.
*ఉన్నత శిఖరాలనెక్కాలి*
*ఉజ్వల మహిమోదయం చూడాలి*
*పరలోకం కనిపించేదాకా ప్రార్ధించాలి*
*దేవా, నీవే పైకి నడిపించాలి*
మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు. మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం. ఆ కొండల గాంభీర్యం, ఎత్తూ, మనల్ని కంగారుపెడుతున్నాయి. అందుకని లోయల్లో, పొగ మంచులో నిలిచిపోతున్నాం. కొండ శిఖరాల పైన మర్మమైన విషయాలు మనకి తెలియడం లేదు. ఇలా మనం సోమరితనంగా ఉండడంవల్ల మనకి కలిగే నష్టం మనకర్ధం కావడం లేదు. ఆ కొండలనెక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురుచూస్తున్నాయో కళ్ళారా చూడగలం.
---------------------------------------------------------------------
_*The side chambers surrounding the temple were wider at each successive story; for the structure HVsurrounding the temple went up story by story all around the temple. For this reason the width of the temple increased as it went up, and one went up from the lowest story to the highest by the way of the middle story.*_ (Ezek - 41:7 )
“Still upward be thine onward course:
For this I pray today;
Still upward as the years go by,
And seasons pass away.
“Still upward in this coming year,
Thy path is all untried;
Still upward may’st thou journey on,
Close by thy Savior’s side.
“Still upward e’en though sorrow come,
And trials crush thine heart;
Still upward may they draw thy soul,
With Christ to walk apart.
“Still upward till the day shall break,
And shadows all have flown;
Still upward till in Heaven you wake,
And stand before the throne.”
We ought not to rest content in the mists of the valley when the summit of Tabor awaits us. How pure are the dews of the hills, how fresh is the mountain air, how rich the fare of the dwellers aloft, whose windows look into the New Jerusalem!
Many saints are content to live like men in coal mines, who see not the sun. Tears mar their faces when they might anoint them with celestial oil. Satisfied I am that many a believer pines in a dungeon when he might walk on the palace roof, and view the goodly land and Lebanon. Rouse thee, O believer, from thy low condition! Cast away thy sloth, thy lethargy, thy coldness, or whatever interferes with thy chaste and pure love to Christ. Make Him the source, the center, and the circumference of all thy soul’s range of delight. Rest no longer satisfied with thy dwarfish attainments. Aspire to a higher, a nobler, a fuller life. Upward to heaven! Nearer to God! —Spurgeon
“I want to scale the utmost height,
And catch a gleam of glory bright;
But still I’ll pray, till heaven I’ve found,
Lord, lead me on to higher ground!”
Not many of us are living at our best. We linger in the lowlands because we are afraid to climb the mountains. The steepness and ruggedness dismay us, and so we stay in the misty valleys and do not learn the mystery of the hills. We do not know what we lose in our self-indulgence, what glory awaits us if only we had courage for the mountain climb, what blessing we should find if only we would move to the uplands of God. —J. R. M
“Too low they build who build beneath the stars.”
No comments:
Post a Comment