Wednesday, January 5, 2022

None to Help But God

 

సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు. (2 దిన 14:11) 


దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకు గుర్తు చెయ్యండి. నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు మరెవరూ లేరు అని ఆయనకు చెప్పండి. వెయ్యి వేలమంది ఆయుధాలు ధరించిన సైనికులు, మూడువందల రథాలు ఆసా అనే రాజుకు ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవి రాలేదు. అందువల్ల అతనికున్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే.  నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్కపెట్టున కలిసికట్టుగా వచ్చి పడితే, చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు. సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు. 


నీకూ, నీ శత్రువుకూ మధ్య దేవుణ్ణి పెట్టు. ఆసా విశ్వాసం ఎలాంటిదంటే కూషు దేశపు రాజైన జెరహుకూ, తనకూ  మధ్యలో దేవుడే నిలబడినట్టుగా అతనికి అనిపించింది. ఇది యథార్ధమే. కూషీయులు “యెహోవా భయముచేతను, ఆయన సైన్యపు భయముచేతను పారిపోయారు” అని రాసి ఉంది. ఇశ్రాయేలువారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకోత కోసారేమో అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీయులు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యములకధిపతి అయిన యెహోవా. ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు. నీకు, నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారుపెట్టే ఆ  కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుట నుండి పారిపోతుంది.


దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే 

కోటలు బద్దలై కూలిపోతే 

దేవుడున్నాడన్న ఆలంబన తప్ప 

మిగిలినదంతా అయోమయమైపోతే, 


నమ్మకం నిలబడే తరుణమిదే 

వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న 

కనుపించని పెనుచీకటిలో 

నమ్మకమే విశ్వాసపు  వేకువ వెలుగు 


అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. కంటికి కనిపించేదానిని ప్రక్కకు నెట్టాడు. ప్రకృతి  ధర్మాలను ‘మీరు గొడవ చెయ్యకండి’ అంటూ ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని “నోర్మూయి, శోధన పిశాచి” అని గద్దించాడు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Lord, there is none beside thee to help. -  (2 Chr 14:11)

    Remind God of His entire responsibility. “There is none beside thee to help.” The odds against Asa were enormous. There were a million men in arms against him, besides three hundred chariots. It seemed impossible to hold his own against that vast multitude. There were no allies who would come to his help; his only hope, therefore, was in God. It may be that your difficulties have been allowed to come to so alarming a pitch that you may be compelled to renounce all creature aid, to which in lesser trials you have had recourse, and cast yourself back on your Almighty Friend.

    Put God between yourself and the foe. To Asa’s faith, Jehovah seemed to stand between the might of Zerah and himself, as one who had no strength. Nor was he mistaken. We are told that the Ethiopians were destroyed before the Lord and before His host, as though celestial combatants flung themselves against the foe in Israel’s behalf, and put the large host to rout so that Israel had only to follow up and gather the spoil. Our God is Jehovah of hosts, who can summon unexpected reinforcements at any moment to aid His people. Believe that He is there between you and your difficulty, and what baffles you will flee before Him, as clouds before the gale.  —F. B. Meyer

“When nothing whereon to lean remains,

When strongholds crumble to dust;


When nothing is sure but that God still reigns,

That is just the time to trust.


“’ Tis better to walk by faith than sight,

In this path of yours and mine;


And the pitch-black night, when there’s no outer light

Is the time for faith to shine.”


    Abraham believed God, and said to sight, “Stand back!” and to the laws of nature, “Hold your peace!” and to a misgiving heart, “Silence, thou lying tempter!” He believed God.  —Joseph Parker

Tuesday, January 4, 2022

Believing Prayer

 

యేసు – నీవు వెళ్ళుము; నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను. (యోహాను 4:50)

ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటినెల్లను పొందియున్నామని నమ్ముడి.(మార్కు 11:24)

ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్ధన చేయవలసి వచ్చినప్పుడు, దేవుని మీద నమ్మకం కుదిరే దాకా ప్రార్ధించాలి. జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకూ ప్రార్ధించాలి. జవాబు యింకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్ధించకూడదు (ఇది జరిగేలా లేదు, జరిగేలా చెయ్యి ప్రభువా అన్ని ప్రార్ధించకూడదన్న మాట). అలాంటి ప్రార్ధన ఏమీ సహాయం చేయదు సరికదా, అడ్డుబండ అయి కూర్చుంటుంది. ఇలాంటి ప్రార్ధన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్తో కూస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి ప్రార్ధన చెయ్యాలి అనే  ప్రేరేపణ ఖచ్చితంగా సైతాను నుండి వచ్చినదే. అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చెయ్యడంలో తప్పులేదు. అయితే ఆ ప్రార్ధనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి. విశ్వాసం ఆవిరైపోయేలా ప్రార్ధించవద్దు. “జవాబు కోసం కనిపెడుతున్నాను. నీ మీద నమ్మకంతో ఉన్నాను.  నీనుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు” అంటూ  ప్రార్ధించాలి. జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడంకన్నా గట్టి విశ్వాసం వేరే లేదు. విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్ధనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో ‘అవును’ అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నోక్కేస్తాయి.

ఇలాంటి ప్రార్ధనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలిజేస్తాయి. అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే. “విశ్వాసులమైన మనము (విశ్వాసము ఉన్న మనము) ఆ విశ్రాంతిలో ప్రకాశించుచున్నాము.” (హెబ్రీ 4:3). విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్ధన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దానిమీద మనసు లగ్నం చేసినప్పుడు వస్తుంది. అబ్రహాము “తన శరీరము మృతతుల్యమైనట్టు... (భావించెను గాని) అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహించ లేదు” (రోమా 4:19,20). విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్ధనలు మనం చెయ్యకుండా ఉండేలా జాగ్రత్త పడదాం.


విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు. ఒక దృశ్యం కాదు. ఒక వివేచన కాదు. దేవుని మాటను ఉన్నదున్నట్టుగా నమ్మడమే విశ్వాసం.


ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది. నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకి ముగింపు.


అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు. నిశ్శబ్దమైన  వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు. గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు. ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంత వరకు మనకు నమ్మకం ఉన్నదో కనిపెడతాడు, ఆ తరువాత శోధకుడిని మన దగ్గరకి వచ్చేందుకు అనుమతిస్తాడు. మనకు సంభవించేవన్నీ దేవుని మాటలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది. నమ్మకం గెలుస్తుంది.


ఇప్పుడైతే మనం చెలరేగే తుపానులో మన సాటివాళ్ళంతా భయంతో వణికిపోతున్న వేళ  జయోత్సాహంతో కేక పెట్టాలి  - “ దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది. నేనాయన్ని నమ్ముతున్నాను!” అని. 


దినకరుడు జీవించునంత కాలం

నక్షత్రాలు ప్రకాశించినంత కాలం

మరణంలోను మనుగడలోను విశ్వసించండి

ఆయన జ్ఞాన హస్తాలే మనల్ని  నడిపిస్తాయి

చీకటి దారైనా దివ్య సంకల్పపు

దివ్వెలు వెలుగుతుంటాయి.

---------------------------------------------------------------------------------------------------------------------------

Jesus told him, “Go home; your son will live.” The man believed the word that Jesus spoke to him and set off for home. (John - 4:50 )

For this reason, I tell you, whatever you pray and ask for, believe that you have received it, and it will be yours.—Mark 11:24

When there is a matter that requires definite prayer, pray till you believe God, until with unfeigned lips you can thank Him for the answer. If the answer still tarries outwardly, do not pray for it in such a way that it is evident that you are not definitely believing in it. Such prayer in place of being a help will be a hindrance; and when you are finished praying, you will find that your faith has weakened or has entirely gone. The urgency that you felt to offer this kind of prayer is clearly from self and Satan. It may not be wrong to mention the matter in question to the Lord again if He is keeping you waiting, but be sure you do so in such a way that it implies faith. Do not pray yourself out of faith. You may tell Him that you are waiting and that you are still believing Him and therefore praise Him for the answer. There is nothing that so fully clinches faith as to be so sure of the answer that you can thank God for it. Prayers that pray us out of faith deny both God’s promise in His Word and also His whisper “Yes,” that He gave us in our hearts. Such prayers are but the expression of the unrest of one’s heart, and unrest implies unbelief about the answer to prayer. “For we which have believed do enter into rest” (Heb. 4:3). This prayer that prays ourselves out of faith frequently arises from centering our thoughts on the difficulty rather than on God’s promise. Abraham “considered not his own body,” “he staggered not at the promise of God” (Rom. 4:19, 20). May we watch and pray that we enter not into the temptation of praying ourselves out of faith. —C. H. P.

Faith is not a sense, nor sight, nor reason, but a taking God at His Word. —Evans

The beginning of anxiety is the end of faith, and the beginning of true faith is the end of anxiety. —George Mueller

You will never learn faith in comfortable surroundings. God gives us the promises in a quiet hour; God seals our covenants with great and gracious words, then He steps back and waits to see how much we believe; then He lets the tempter come, and the test seems to contradict all that He has spoken. It is then that faith wins its crown. That is the time to look up through the storm, and among the trembling, frightened seamen cry, “I believe God that it shall be even as it was told me.”

“Believe and trust; through stars and suns,

Through life and death, through soul and sense,

His wise, paternal purpose runs;

The darkness of His Providence

Is starlit with Divine intents.”

Monday, January 3, 2022

Gentle Leading



*నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడువ గలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదను*_ (ఆది 33:14)


మందల గురించి, పిల్లల గురించి యకోబుకు ఎంత శ్రద్ధ! ఎంత ఆపేక్ష! వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకు తెలిసేలా ఎంత చక్కగా రాయబడ్డాయి ఈ మాటలు! ఒక్క రోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసొప్పడం లేదు. బలవంతుడైన ఏశావు వెళ్ళినంత వేగంగా తన మందల్ని తోలడం ఇష్టం లేదు. ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు. ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలన్నది దీన్నిబట్టే అతడు నిర్ణయించాడు. అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాలు క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ప్రయాణంలో కష్టసుఖాలు, దూరభారాలు  అతనికి తెలుసు. అందుకే ‘నేను మెల్లగా నడిపించుకొని వస్తాను’ అంటున్నాడు. “మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు,”


ఇంతకు ముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు, కాని మన ప్రభువైన యేసు వెళ్ళాడు. మనకైతే ఆ దారి తెలియదు. కాని ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు. కాళ్ళు లాగేసే పల్లాలు, ఎదురు దెబ్బలు తగిలే కోసు రాళ్ళు, నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారి దారులు, దారికడ్డంగా సుడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు, వీటన్నింటి మీదుగా యేసు ప్రభువు ఇంతకు ముందు నడిచాడు. ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి. ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు. ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు. మనం నిర్మితమైన రీతి ఆయనకు తెలుసు. మనం మట్టితో చేయబడ్దామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది. నీ పాదం వెయ్యగల అడుగులు కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ ఎక్కువ వేయించడాయన. తరువాత అడుగు వెయ్యగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనియ్యి. ఆయనకి తెలుసు. ఆ అడుగు వెయ్యడానికి బలాన్నివ్వాలా, లేక అక్కడితో ఆపి విశ్రాంతి నివ్వాలా? – ఆయనకే తెలుసు.


*లేబచ్చిక మైదానాల్లో* 

*నా ప్రభువు నడిపిస్తాడు*

*పచ్చదనం కోల్పోయిన తావుల్లో* 

*కరుణ కవోష్ణ ధృక్కులతో నడిపిస్తాడు*

------------------------------------------------------------------*Let my lord go on ahead of his servant. I will travel more slowly, at the pace of the herds and the children, until I come to my lord at Seir.”*_ (Gen -  33:14 )



What a beautiful picture of Jacob’s thoughtfulness for the cattle and the children! He would not allow them to be overdriven even for one day. He would not lead on according to what a strong man like Esau could do and expected them to do, but only according to what they were able to endure. He knew exactly how far they could go in a day; and he made that his only consideration in arranging the marches. He had gone the same wilderness journey years before, and knew all about its roughness and heat and length, by personal experience. And so he said, “I will lead on softly.” “For ye have not passed this way heretofore” (Josh.3:4.).


We have not passed this way heretofore, but the Lord Jesus has. It is all untrodden and unknown ground to us, but He knows it all by personal experience. The steep bits that take away our breath, the stony bits that make our feet ache so, the hot shadeless stretches that make us feel so exhausted, the rushing rivers that we have to pass through—Jesus has gone through it all before us. “He was wearied with his journey.” Not some, but all the many waters went over Him, and yet did not quench His love. He was made a perfect Leader by the things which He suffered. “He knoweth our frame; he remembereth that we are dust.” Think of that when you are tempted to question the gentleness of His leading. He is remembering all the time; and not one step will He make you take beyond what your foot is able to endure. Never mind if you think it will not be able for the step that seems to come next; either He will so strengthen it that it shall be able, or He will call a sudden halt, and you shall not have to take it at all. —Frances Ridley Havergal


In “pastures green”? Not always; sometimes He

Who knowest best, in kindness leadeth me

In weary ways, where heavy shadows be.

So, whether on the hill-tops high and fair

I dwell, or in the sunless valleys, where

The shadows lie, what matter? He is there.

—Barry----------------------------------------