Saturday, April 30, 2022

This is a dream come true for a king

 

అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను... అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మ్రింగివేసెను  (ఆది 41:4,7).

ఆ కలను ఉన్నదున్నట్టుగా చూస్తే మనకొక హెచ్చరిక కనిపిస్తుంది. మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు, మంచి అనుభవాలు, సాధించిన ఘన విజయాలు, చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు, వైఫల్యాలు, అప్రతిష్ట, దేవుని రాజ్యం పట్ల పనికిమాలినతనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది. వాళ్ళ జీవితాల్లో ఘనవిజయం సాధిస్తారని అందరూ ఎదురుచూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకి దిగజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలోచిస్తే బాధేస్తుంది, కాని ఇది నిజం.

 ఒక భక్తుడు చెప్పాడు, ఇలాటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధనం. ప్రతి దినం, ప్రతి ఘడియ దేవునితో ఓ వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం. నిన్నటి నా ఘనకార్యాలూ, నా గతం లోని దీవెనకరం, ఫలభరితం, జయకరం అయిన అనుభవాలు ఈ రోజున నాకేమీ లాభం కలిగించవు సరికదా ఈనాటి పరాజయాలు వాటిని మింగెయ్యవచ్చును కూడా. కాని ‘నిన్నటి గొప్పతనం అంతా’ ఈ రోజు నేను అంతకన్న గొప్ప పనుల్ని చెయ్యడానికి ప్రేరేపణగా ఉండాలి. 

క్రీస్తుకి అంటు కట్టబడడం ద్వారానే నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని, పీల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు.

ఏ రోజుకారోజు నా క్రీస్తుతో కలిగి ఉన్న సహవాసం కోసమే నేను ఆలోచిస్తాను. నిన్న నేను చేసిన ప్రసంగం ద్వారా కలిగిన ఉజ్జీవం కోసమే నేను ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఈ రోజు నేను ఇవ్వాల్సిన దైవ సందేశం లో నాకు మాటలు దొరకవు. విజయాలు అయినా, అపజయాలు అయినా ‘పాతవి గతించెను’. అంతే!

-----------------------------------------------------------------------------------------------------------------------------

Then the cows that were disgusted at the sight were eating the fat cows that were beautiful to look at ... Then those seven vertebrae that were full of fat were devoured by those horses. (Gen. 41: 4,7).

If we look at that dream as if it exists, we will see a warning. Failures, failures, disrepute, futility toward the kingdom of God, etc. are likely to swallow up the good things in our life, such as the best years, good experiences, solid achievements, and outstanding service is done. While everyone expects them to achieve solid success in their lives, there are times when they go down to unimaginable depths. It hurts to think, but it's true.

 As one devotee said, the only way to escape from such a sad thing is to. Re-establishing an innovative fresh relationship with God every day, every hour. My accomplishments of yesterday, the blessed, fruitful, victorious experiences of my past do not benefit me today, even if today's failures can swallow them up. But ‘all the greatness of yesterday’ should motivate me to do even greater things today.

Only this innovative fresh relationship that takes place only through the grafting of Christ can keep the entangled owl, the backbone, out of my life.

Every day I think only of the fellowship I have with Christ. I can not find the words in the divine message I have to give today if I am still sitting thinking about the revival I had through the speech I made yesterday. Successes or failures are 'old gone'. That's it!

Friday, April 29, 2022

Keep Praying

 

ఏలీయా మన వంటి స్వభావము గల మనుష్యుడే  (యాకోబు 5:17).

అందుకు దేవునికి వందనాలు! రేగు చెట్టు క్రింద చతికిలబడ్డాడు. మన లాగానే, మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సణుగుకున్నాడు. ఫిర్యాదు చేసాడు. మనకు లాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తిరిగింది. “మన వంటి స్వభావము గల” మనుష్యుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్ధన చేసాడు,” ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరోటి లేదు. ఏలీయా కేవలం ఆసక్తితోనే ప్రార్ధన చెయ్యలేదు. ప్రార్థనా పూర్వకంగా ప్రార్థించాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? మనం వదలకుండా ప్రార్థించాలి.

కర్మెలు పర్వత శిఖరం మీదికి ఎక్కి రండి. విశ్వాసానికీ, ప్రత్యక్షంగా కనిపించేదానికీ సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి. ఆకాశం నుండి అగ్ని దిగి రావడం కాదు. ఇప్పుడు కావలసింది. ఇప్పుడు ఆకాశంనుండి జల ధారలు కురియాలి. అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి, ఇప్పుడూ అదే పద్ధతిలో, అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ఏలీయా నేలమీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని రాయబడి ఉంది. అంటే అన్ని ధ్వనులనూ, ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలనూ దూరంగానే ఉంచాడన్న మాట. ఇలాటి భంగిమలో దుప్పటి ముసుగేసుకుని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట.

సేవకుణ్ణి పిలిచి “నువ్వు పైకి ఎక్కి సముద్రంవైపుకి చూడమ”న్నాడు. అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు “ఏం లేదు” అన్నాడు.

ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాము.

"నేను ముందే అనుకున్నాలే" అంటామేమో. ప్రార్థించడం చాలిస్తామేమో. ఏలీయా అలా చేసాడా? లేదు. “మళ్ళీ వెళ్ళు” అన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి “ఏం లేదు” అన్నాడు. ఏలీయా “మళ్ళీ వెళ్ళు” అన్నాడు. సేవకుడు “ఏం లేదు” అన్నాడు. ఏలీయా “మళ్ళీ వెళ్ళు” అన్నాడు.

కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు “మనిషి చెయ్యంత మేఘం కన్పించింది” అన్నాడు. ఏలీయా చెయ్యి అర్థింపుగా పరలోకం వైపుకు చాపబడింది. జవాబుగా వర్షం దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచకళ్యాణి గుర్రాల సహాయంతో అహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికీ, ప్రత్యక్షానికీ సామ్యం చెప్పే ఉపమానం. 

ఇలా ప్రార్థించడం నీకు తెలుసా? పనుల్ని సాధించే ప్రార్ధన నీకు తెలుసా? కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండొచ్చు. కాని వాటిని లెక్క చెయ్యకండి. మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆలస్యం చెయ్యడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే, మనకి లాభమే.

ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడన్నాడు “విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం.” రెండో పిల్లవాడు. “పట్టుకునే ఉండడం” అన్నాడు. మూడో పిల్లవాడు “ఎప్పటికీ వదలక పోవడం” అన్నాడు. తుమ్మ జిగురులా అంటి పెట్టుకుని వదలని విశ్వాసం ఇది.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Elias was a man subject to like passions as we are (Jas - 5:17)

Thank God for that! He got under a juniper tree, as you and I have often done; he complained and murmured, as we have often done; was unbelieving, as we have often been. But that was not the case when he really got into touch with God. Though “a man subject to like passions as we are,” “he prayed to pray.” It is sublime in the original—not “earnestly,” but “he prayed in prayer.” He kept on praying. What is the lesson here? You must keep praying.

Come up on the top of Carmel, and see that remarkable parable of Faith and Sight. It was not the descent of the fire that now was necessary, but the descent of the flood; and the man that can command the fire can command the flood by the same means and methods. We are told that he bowed himself to the ground with his face between his knees; that is, shutting out all sights and sounds. He was putting himself in a position where, beneath his mantle, he could neither see nor hear what was going forward.

He said to his servant, “Go and take an observation.” He went and came back, and said—how sublimely brief! one word—“Nothing!”

What do we do under such circumstances?

We say, “It is just as I expected!” and we give up praying. Did Elijah? No, he said, “Go again.” His servant again came back and said, “Nothing!” “Go again.” “Nothing!”

By and by he came back, and said, “There is a little cloud like a man’s hand.” A man’s hand had been raised in supplication, and presently down came the rain, and Ahab had not time to get back to the gate of Samaria with all his fast steeds. This is a parable of Faith and Sight—faith shutting itself up with God; sight taking observations and seeing nothing; faith going right on, and “praying in prayer,” with utterly hopeless reports from sight.

Do you know how to pray that way, how to pray prevailingly? Let sight give as discouraging reports as it may, but pay no attention to these. The living God is still in the heavens and even delay is part of His goodness.—Arthur T. Pierson

Each of the three boys gave a definition of faith which is an illustration of the tenacity of faith. The first boy said, “It is taking hold of Christ”; the second, “Keeping hold”; and the third, “Not letting go.”

Thursday, April 28, 2022

ఎడారి సెలయేర్ల

 

ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ‘కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును’ రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను*_ (న్యాయాధి 3:9,10).

తన యుద్ధశూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాటులో వాళ్ళ స్థానంలో వాళ్ళని ఉంచుతాడు. “ఇతనెక్కడినుంచి వచ్చాడు!” అంటూ ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటుంది.

స్నేహితుడా, పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచనియ్యి. క్రమశిక్షణ నేర్చుకో. పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్టిస్తాడు. దాన్నుంచవలసిన స్థానంలో అమరుస్తాడు.

ఒకరోజు వస్తుంది, ఒత్నీయేలు లాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాము. వెయ్యేళ్ళ పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలుతాము. ఆ రోజును రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, చిన్న చిన్న విజయాలు -వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది మనకి తెలియదు కాని ఒక్క విషయం గురించి మాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఒత్నీయేలును సిద్ధం చేసి ఉంచాడు. పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు.

*మానవ బలము, మానవ ఘనత*

*సుఖశాంతుల్లో చిగురించవు*

*లోకంలో బాధలనెదుర్కోనివారు*

*శూరులెన్నటికీ కాలేరు*

మనిషి జీవిత యాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు. ప్రతివాడు బాధల సొరంగంలో గుండా వెళితేనే తప్ప విజయపు మెట్టు ఎక్కలేడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

When the Israelites cried out to the Lord, Jehovah saved them by appointing “Othniel the son of Canaab's younger brother Othniel” as his Savior. The Spirit of Yahweh came on him * (Judges 3: 9,10).

God is preparing his warriors. He puts them in their place on the eyelid when the right moment comes. "Where did he come from!" The whole world is sniffing around.

Friend, prepare the Holy Spirit for you. Learn discipline. When the marble sculpture is finished, God lifts it up and places it on the pedestal. Fits in where it should be.

The day will come when, like Othniel, we will be judges of the nations. We will also rule and rule with Christ on earth for thousands of years. We must be molded by God to taste that day. God is training us through the hardships and small successes we face in our daily lives. We do not know this but there is no doubt about one thing. The Holy Spirit prepared Othniel to meet that need. God, the King of heaven, has prepared for him a throne.

* Human strength, human dignity *

* Does not sprout in happiness *

* Suffering in the world *

* Can't be a warrior *

Man must walk in the sunken areas at some point in the journey of life. No one can climb the ladder of success unless everyone goes through a tunnel of suffering.

Wednesday, April 27, 2022

The Risen Lord

 

…నేను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను (ప్రకటన 1:18). 

పువ్వుల్లారా, ఈస్టరు రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా, ఏదీ ఈ ఉదయం నాకా దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి! ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకూ వినిపించండి.

జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏదీ మరోసారి నీ పుటలు తిరగెయ్యనియ్యి. చనిపోవడం లాభం అంటూ నీవందించే నిశ్చయతను మళ్ళీ రుచి చూడనియ్యి.

కవులారా, నిత్యజీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుత్థానపు కీర్తనను మళ్ళీ వినిపించండి.

-చెట్లూ, చేమలూ, పక్షులూ, పురుగులూ, ఆకాశం, సముద్రం, గాలులూ, వానలూ మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింప జెయ్యండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపజేయండి. గాలంతా ఈ నినాదం నింపండి.

మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఆశ నిశ్చయతగా మారేదాకా, నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చెయ్యండి. పౌలు లాగా మనమంతా చావుకెదురైనప్పుడు జయగీతాలతో విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో పొంగి పొరలే వదనంతో అతిశయించేంత వరకూ పాడండి.

సమాధి దారిలో మృతుణ్ణి మోసుకుంటూ

శోక వదనాలతో మౌనంగా సాగే మానవుల్లారా

సమాధులవంక ఈ రోజుకి చూడకండి

కళ్ళెత్తి దేవుని మహిమని కలకాలం కనుగొనండి


కన్నీళ్ళ కాలం కదిలిపోయింది

పునరుత్థాన పుష్పాలు పకపకమన్నాయి

హృదయాలు పులకరించాయి

గుడిగంటల పిలుపుకి బదులు పలికాయి.


క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే

మరణపు చెరలో మ్రగ్గుతూ ఉంటే

పాతాళ కూపం నుంచి విముక్తుడు కాకుంటే

నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే

నిరాశకి తావుంది, దుఃఖానికి చోటుంది.

కానీ లేచాడాయన కట్లు తెంచుకుని

మానండిక నిట్టూర్పులు ఇది గ్రహించుకుని

ఒక పాస్టరు గారు తన గదిలో కూర్చుని తాను ఈస్టరు రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాకింది. “ప్రభువు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు!” ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు. “క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు. ఒకప్పుడున్నవాడు కాడు ఆయన. ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు. ప్రస్తుతం సత్యం. జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టరు నిజం ఎంత గొప్పది.” 

మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం. ఎప్పటికీ సజీవులం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I am he that liveth, and was dead; and, behold, I am alive forevermore (Rev - 1:18)

Flower! Easter lilies! speak to me this morning the same dear old lesson of immortality which you have been speaking to so many sorrowing souls.

Wise old Book! let me read again in your pages of firm assurance that to die is gain.

Poets! recite to me your verses which repeat in every line the Gospel of eternal life.

Singers! break forth once more into songs of joy; let me hear again the well-known resurrection psalms.

Tree and blossom and bird and sea and sky and the wind whisper it, sound it afresh, warble it, echo it, let it throb and pulsate through every atom and particle; let the air be filled with it.

Let it be told and retold and still retold until hope rises to conviction, and conviction to the certitude of knowledge; until we, like Paul, even though going to our death, go with triumphant mien, with assured faith, and with a serene and shining face.

O sad-faced mourners, who each day are wending  

Through churchyard paths of cypress and of yew,  

Leave for today the low graves you are tending,  

And lift your eyes to God’s eternal blue!  


It is no time for bitterness or sadness;  

Twine Easter lilies, not pale asphodels;  

Let your souls thrill to the caress of gladness,  

And answer the sweet chime of Easter bells.  


If Christ were still within the grave’s low prison,  

A captive of the enemy we dread;  

If from that moldering cell He had not risen,  

Who then could chide the gloomy tears you shed?  


If Christ were dead there would be a need to sorrow,  

But He has risen and vanquished death for aye;  

Hush, then your sighs, if only till the morrow,  

At Easter give your grief a holiday.  

—May Riley Smith

A well-known minister was in his study writing an Easter sermon when the thought gripped him that his Lord was living. He jumped up excitedly and paced the floor repeating to himself, “Why Christ is alive, His ashes are warm, He is not the great ’I was,’ He is the great ’I am.’” He is not only a fact but a living fact. The glorious truth of Easter Day!

We believe that out of every grave there blooms an Easter lily, and in every tomb there sits an angel. We believe in a risen Lord. Turn not your faces to the past that we may worship only at His grave, but above and within that we may worship the Christ that lives. And because He lives, we shall live also.—Abbott

Tuesday, April 26, 2022

Costly Glory

 

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను (ఫిలిప్పీ 3:8)

వస్తువులు ధగధగా మెరవాలంటే కొంత ఖర్చవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించని కొవ్వొత్తి వెలుగునియ్యదు. మంట లేనిదే తళతళలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుల్ని వెలిగించలేము. మండటం శ్రమ పడడానికి గుర్తు. మరి మనమైతే నొప్పినుండి దూరంగా తొలిగిపోయే ప్రయత్నం చేస్తుంటాము.

మనం దృఢంగా ఉండి పనులు చెయ్యడానికి శక్తి కలిగి ఉండి, మన మనస్సు లోను, చేతులనిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము.

అయితే మనం ఒక మూలన చేరి శ్రమల ననుభవించడం తప్ప మరేమీ చెయ్యలేని స్థితి లోనో, లేక రోగ పీడితులం గానో ఉన్నప్పుడూ, బాధ మనల్ని కబళిస్తున్నప్పుడూ, మన కార్యక్రమాలను పట్టించుకునే నాథుడు లేక మూలనబడినప్పుడూ మనం ఇతరులకేమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము. మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధ పడతాము. 

అయితే దీర్ఘశాంతం కలిగి, దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకి సహాయపడే రోజులకంటే, బాధల్లో కృశిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాటివాళ్ళు. వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు.

రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్ళు పాతుకుంటుంది. చాలా మంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు. మండకుండా వెలుగు నివ్వాలంటారు. కాని శ్రమలు పొందిన తరువాతే కదా కిరీటం దొరికేది? మండితేనే కదా వెలుగు పుట్టేది. 

మా ఊళ్ళో పెరిగే మందుచెట్టు కథ విన్నారా

నూరేళ్ళు పెరిగి పెరిగి పరిపక్వమవుతుంది

చిటారుకొమ్మన చిన్నారిమొగ్గ కళ్ళు తెరిచి

వైభవంగా విరబూస్తాయి వేవేల పుష్పాలు

మందుచెట్టు త్యాగం కన్నారా

పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం


మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా

విరబూసిన వేవేల పుష్పాలు

రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు

రాలిన ప్రతి పువ్వు వేళ్ళు పట్టి

ప్రతి పువ్వూ అవుతుందో మందుచెట్టు


పూల ఆంతం అదే మందు చెట్ల కారంభం

అన్నిటికంటే అతిశ్రేష్టమైన కథ విన్నారా 

ఒక మహాత్ముడి, పవిత్రుడి పరమగాధ

ఆయన మరణం అనేకాత్మల జీవం

ఆకాశంలో జ్యోతుల తళతళలు

మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు


బ్రతుకుని ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి

ప్రేమ నిండిన బ్రతుకు కోరండి

మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం

ఆయన భరించిన నష్టం మనకెంత లాభం!

ఆయన కన్నీళ్ళు మన చిరునవ్వుల కాంతులు

ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు

-----------------------------------------------------------------------------------------------------------------------------

I even reckon all things as pure loss because of the priceless privilege of knowing Christ Jesus my Lord (Phil - 3:8)

Shining is always costly. Light comes only at the cost of that which produces it. An unlit candle does not shine. Burning must come before shining. We cannot be of great use to others without cost to ourselves. Burning suggests suffering. We shrink from pain.

We are apt to feel that we are doing the greatest good in the world when we are strong, and able for active duty, and when our hearts and hands are full of kindly service.

When we are called aside and can only suffer; when we are sick; when we are consumed with pain; when all our activities have been dropped, we feel that we are no longer of use, that we are not doing anything.

But, if we are patient and submissive, it is almost certain that we are a greater blessing to the world in our time of suffering and pain than we were in the days when we thought we were doing the most of our work. We are burning now, and shining because we are burning. —Evening Thoughts

“The glory of tomorrow is rooted in the drudgery of today.”

Many want the glory without the cross, the shining without the burning, but crucifixion comes before coronation.

Have you heard the tale of the aloe plant,  

Away in the sunny clime?  

By humble growth of a hundred years  

It reaches its blooming time;  

And then a wondrous bud at its crown  

Breaks into a thousand flowers;  

This floral queen, in its blooming, seen,  

Is the pride of the tropical bowers,  

But the plant to the flower is sacrificed,  

For it blooms but once, and it dies.  


Have you further heard of the aloe plant,  

That grows in the sunny clime;  

How every one of its thousand flowers,  

As they drop in the blooming time,  

Is an infant plant that fastens its roots  

In the place where it falls on the ground,  

And as fast as they drop from the dying stem,  

Grow lively and lovely around?  

By dying, it liveth a thousand-fold  

In the young that spring from the death of the old.  


Have you heard the tale of the pelican,  

The Arabs’ Gimel el Bahr,  

That lives in the African solitudes,  

Where the birds that live lonely are?  

Have you heard how it loves its tender young,  

And cares and toils for their good,  

It brings them water from mountains far,  

And fishes the seas for their food.  

In famine, it feeds them—what love can devise!  

The blood of its bosom—and, feeding them, dies.  


Have you heard this tale—the best of them all—  

The tale of the Holy and True,  

He dies, but His life, in untold souls  

Lives on in the world anew;  

His seed prevails, and is filling the earth,  

As the stars fill the sky above.  

He taught us to yield up the love of life,  

For the sake of the life of love.  

His death is our life, His loss is our gain;  

The joy for the tear, the peace for the pain.  

Monday, April 25, 2022

Waiting For Resurrection

 

మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి (మత్తయి 27:61). 

విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం! అది నేర్చుకోదు, తెలుసుకోదు. కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభువు సమాధి ద్వారం దగర కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పటిదాకా పునరుత్థానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా?

వాళ్ళకి దుఃఖకారణమైన క్రీస్తు - మరణం ద్వారానే- మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తుగా లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్థానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు గాని, శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్థానపు మొలకను గమనించడం లేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మూగబోయింది, తిరిగి కోటి రెట్లు శక్తిగల పునరుజ్జీవనానికే.

కాని ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్యగోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటబడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. 

మన జీవితాల్లోనూ ఇది అంతే, మనమంతా వనంలో సమాధి నానుకుని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము. “ఈ దుఃఖానికి ఉపశమనం లేదు… ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు… దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు” అని అనుకుంటూ ఉంటాము. కాని మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి.

చావు పొంచియుంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తుంటుంది. పేరుకు పోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తళుక్కు మంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడుచెయ్యదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్థంభాలవల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు. వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కాని అవి ఆత్మపుష్పాలు- ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి సంతోషాలు. ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోను ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి.

శోకాల కాలిబాట

క్రీస్తు విశ్రమించిన చోట

గులాబీలనివ్వదు ఈ తోట

ఇది ముళ్ళబాట

 

పరలోక దీవెనల గరిక పూలు

వికసించాలంటే ఈ చోటే మేలు

ఈ బాటలో సిలువ మోసినవాడు

రాకుమారుడవుతాడు ముందునాడు

-----------------------------------------------------------------------------------------------------------------------------

And there was Mary Magdalene and the other Mary, sitting over against the sepulchre ( Matt -  27:61)

How strangely stupid is grief. It neither learns nor knows nor wishes to learn or know. When the sorrowing sisters sat over against the door of God’s sepulchre, did they see the two thousand years that have passed triumphing away? Did they see anything but this: “Our Christ is gone!”

Your Christ and my Christ came from their loss; Myriad mourning hearts have had the resurrection amid their grief, and yet the sorrowing watchers looked at the seed-form of this result and saw nothing. What they regarded as the end of life was the very preparation for coronation; for Christ was silent that He might live again in tenfold power.

They saw it not. They mourned, they wept, and went away, and came again, driven by their hearts to the sepulchre. Still, it was a sepulchre, unprophetic, voiceless, lusterless.

So with us. Every man sits over against the sepulchre in his garden, in the first instance, and says, “This woe is irremediable. I see no benefit in it. I will take no comfort in it.” And yet, right in our deepest and worst mishaps, often, our Christ is lying, waiting for resurrection.

Where our death seems to be, there our Saviour is. Where the end of hope is, there is the brightest beginning of fruition. Where the darkness is thickest, there the bright beaming light that never is set is about to emerge. When the whole experience is consummated, then we find that a garden is not disfigured by a sepulchre. Our joys are made better if there be sorrow in the midst of them. And our sorrows are made bright by the joys that God has planted around them. The flowers may not be pleasing to us, they may not be such as we are fond of plucking, but they are heart-flowers, love, hope, faith, joy, peace—these are flowers which are planted around about every grave that is sunk in the Christian heart.

“’ Twas by a path of sorrows drear  

Christ entered into rest;  

And shall I look for roses here,  

Or think that earth is blessed?  

Heaven’s whitest lilies blow  

From earth’s sharp crown of woe.  

Who here his cross can meekly bear,  

Shall wear the kingly purple there.”

Sunday, April 24, 2022

Commit and Rest

 

విశ్వాసమనునది... అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది (హెబ్రీ 11:1). 

నిజమైన విశ్వాసం ఎలాటిదంటే పోస్టుబాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రసు తెలియకో, ఇంకా విశేషాలేమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్టు చెయ్యని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి. వాటి వలన మనకి గాని, వాటినందుకోవలసిన వాళ్ళకి గాని ఎలాటి ప్రయోజనమూ లేదు. నేను వాటిని విడనాడి, పోస్టుమేన్ మీద నమ్మకం ఉంచి పోస్టు చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు.

నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పని మొదలుపెడతాడు. 37వ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది. “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును” అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి. ఆయన చెంతకి చేరాలి. ఆయనకు అప్పగించాలి. అంతే. అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో, వాటిని మనం అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము. విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకర్థమౌతుంది.

ఒక వృద్దురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృశించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాసాడు. “అతని గురించి అంత కంగారుపడతావెందుకు? నువ్వతనికోసం ప్రార్థన చేసావు కదా. అతన్ని దేవునికప్పగించావు కదా. ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా?” దేని విషయమూ చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. “మీ చింత యావత్తూ ఆయన మీద వెయ్యండి” అనే మాట కూడా అలాటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపాసింహాసనం దగ్గరనుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. హన్నాలాగా, అంతా దేవునికి అప్పగించి లేచిన తరువాత నా మనస్సులో ఇక ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేసానని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెంట వెనక్కి తెచ్చేసుకుంటే, నేనప్పటి దాకా చేసిన ప్రార్థన విశ్వాస రహితమని అంటే విశ్వాసం లేనిదని అర్థం చేసుకుంటాను.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

Faith is...the evidence of things not seen (Heb - 11:1)

True faith drops its letter in the post office box and lets it go. Distrust holds on to a corner of it, and wonders that the answer never comes. I have some letters on my desk that have been written for weeks, but there was some slight uncertainty about the address or the contents, so they are yet unmailed. They have not done either me or anybody else any good yet. They will never accomplish anything until I let them go out of my hands and trust them to the postman and the mail.

This is the way with true faith. It hands its case over to God, and then He works. That is a fine verse in the Thirty-seventh Psalm: “Commit thy way unto the Lord, trust also in Him, and He worketh.” But He never worketh till we commit. Faith is a receiving or still better, a taking of God’s proffered gifts. We may believe, and come, and commit, and rest; but we will not fully realize all our blessings until we begin to receive and come into the attitude of abiding and taking. —Days of Heaven upon Earth

Dr. Payson, when a young man, wrote as follows, to an aged mother, burdened with intense anxiety on account of the condition of her son: “You give yourself too much trouble about him. After you have prayed for him, as you have done, and committed him to God, should you not cease to feel anxious respecting him? The command, ’Be careful with nothing,’ is unlimited; and so is the expression, ’Casting all your care on him.’ If we cast our burdens upon another, can they continue to press upon us? If we bring them away with us from the Throne of Grace, it is evident we do not leave them there. Concerning myself, I have made this one test of my prayers: if after committing anything to God, I can, like Hannah, come away and have my mind no sadder, my heart no more pained or anxious, I look upon it as one proof that I have prayed in faith; but, if I bring away my burden, I conclude that faith was not in exercise.”

Saturday, April 23, 2022

Thou Wilt Revive Me

 

నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు (కీర్తన 138:7)

హెబ్రీ భాషలో ఈ మాటలెలా ఉన్నాయంటే “ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ” అని వ్రాయబడ్డాయి. మన కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటనుబట్టి ఆయన్నడిగాము, గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డులోకి, ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం. ఇక ప్రభువుకు మొర్రపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది?అని అనుకుంటాము. 

మార్త అంది కదా, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే మా తమ్ముడు చనిపోయే వాడు కాదు.” అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు. “మీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు” ఇలా కష్టాల నడిబొడ్డుకి మనం చేరినప్పుడు మార్త లాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము. కాని తన వాక్యం లోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు. “నీవు ఆపదలలో చిక్కుబడి యున్నను, నేను నిన్ను బ్రతికించెదను.”

ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు. మనల్ని విడిచిపెట్టే చోటు కాదది.

ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా - తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే, ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు. ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది?

సుడిగాలి నిన్నెగరేసుకు పోగలదని

దిగులుపడి దీనంగా దిక్కులు చూడకు

వడగండ్లవాన వేధిస్తుందని వేదన పడకు

తుపాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచివెళ్ళు

అక్కడుందో చోటు వెచ్చగా హాయిగా

విశ్వాసపు నేత్రాలకి మాత్రమే కనిపించే చోటు.


సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి

దుష్టశక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకుని

కొండల్లా అలలెగసిపడ్డాయి

వాన పడగ అవనిని మూసింది

దేవుడి నానుకున్న ఆత్మ నిబ్బరంగా ఉంది

తుపాను నడిబొడ్డున స్తుతి పాటలు పాడింది 


పెనుచీకటిలో ఆశల్ని ఆర్పెయ్యవద్దు

పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరినా

చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి

తండ్రి ప్రేమ నీకు ఇస్తుంది ఆకాశ దీపాల కాంతి

చీకటి పొరల్ని చీల్చుకుని పైపైకి దృష్టి సారించు

కాంతిమయుని వదనారవిందంలోకి


ప్రమాదం నుండీ పాపం నుండీ నీకు రక్షణగా

దేవుడే తుపానుని రప్పించాడు

ఆయన మాటతోనే ఊరుకుంటుంది

గాలిచేసే గోల హల్లెలూయ అవుతుంది

అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు

తుఫాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు

-----------------------------------------------------------------------------------------------------------------------------

Though I walk in the midst of trouble, thou wilt revive me (Ps - 138:7)

The Hebrew rendering of the above is “go on in the center of trouble.” What descriptive words! We have called on God in the day of trouble; we have pleaded His promise of deliverance but no deliverance has been given; the enemy has continued oppressing us until we were in the very thick of the fight, in the center of trouble. Why then trouble the Master any further?

When Martha said, “Lord, if thou hadst been here my brother had not died,” our Lord met her lack of hope with His further promise, “Thy brother shall rise again.” And when we walk “in the center of trouble” and are tempted to think like Martha that the time of deliverance is passed, He meets us too with a promise from His Word. “Though I walk in the midst of trouble, thou wilt revive me.”

Though His answer has been so long delayed, though we may still continue to “go on” amid trouble, “the center of trouble” is the place where He revives, not the place where He fails us.

When in the hopeless place, the continued hopeless place, is the very time when He will stretch forth His hand against the wrath of our enemies and perfect that which concerneth us, the very time when He will make the attack cease and fail and come to an end. What occasion is there then for fainting? —Aphra White

THE EYE OF THE STORM

“Fear not that the whirlwind shall carry thee hence,  

Nor wait for its onslaught in breathless suspense,  

Nor shrink from the whips of the terrible hail,  

But pass through the edge to the heart of the gale,  

For there is a shelter, sunlight and warm,  

And Faith sees her God through the eye of the storm.  


“The passionate tempest with rush and wild roar  

And threatenings of evil may beat on the shore,  

The waves may be mountains, the fields battle plains,  

And the earth be immersed in a deluge of rains,  

Yet, the soul stayed on God, may sing bravely its psalm,  

The heart of the storm is the center of calm.  


“Let hope be not quenched in the blackness of night,  

Though the cyclone awhile may have blotted the light,  

For behind the great darkness the stars ever shine,  

And the light of God’s heavens, His love shall make thine,  

Let no gloom dim thine eyes, but uplift them on high  

To the face of thy God and the blue of His sky.  


“The storm is thy shelter from danger and sin,  

And God Himself takes thee for safety within;  

The tempest with Him passeth into a deep calm,  

And the roar of the winds is the sound of a psalm.  

Be glad and serene when the tempest clouds form;  

God smiles on His child in the eye of the storm.”

Friday, April 22, 2022

God Knows

 నేను నడచుమార్గము ఆయనకు తెలియును (యోబు 23:10). 

విశ్వాసీ, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! నువ్వు నడిచేదారి అది ఎంత అస్తవ్యస్తంగా, వంకరటింకరగా, అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో, కన్నీళ్ళతో నిండిన దారైనప్పటికీ, అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు. దేవుడు దాన్ని చల్లబరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఏలీము లాంటి సేదదీర్చే చోటు కానివ్వండి. అంతా దేవునికి తెలుసు. 

ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటినీ, ఇశ్రాయేలువాళ్ళకి వెలుగునూ ఇచ్చే అగ్ని స్థంభం, మేఘ స్థంభం ఉన్నాయి. అగ్ని గుండం మండుతోంది. కాని దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదుగాని, శుద్ధి చెయ్యడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటికి తీస్తాడు. 

ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు.

మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమానమైనదెవరో మీకు తెలుసా? ఉదయకాలపు కిరణాలతోపాటు మనల్ని పలకరించి నిద్రలేపేదెవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా?

కష్టాలెదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా ఖర్మ అంటారు. "అంతా ఆ పైవాడి లీల” అంటారు. విధి వైపరీత్యం అంటారు. విధి అంటే ఏమిటి? అర్థంలేని అలాంటి పదాలు వాడటం అనవసరం. 

సజీవుడైన పరమ దేవుడిని, చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్పమాత్రంగా నడిపిస్తున్న దేవుడిని, వర్ణించడంలో అర్థంపర్థంలేని ”విధి” లాటి మాటల్ని ఆయనకి బదులుగా ఉపయోగించడం ఏమిటి? పనులు చేస్తూ తన ఇష్ట ప్రకారం సమస్తాన్నీ చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు?

మహాశ్రమలు తనను చుట్టుకుని ఇహలోకపరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది. మనుషులెవరూ కాదు, దేవుడే అది తనకు చేసాడని నమ్మాడు. ఇలాటి దృష్టి మనమూ కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. యోబుకి షేబాయీయుల కత్తుల వెనక దేవుని హస్తమే కనబడింది. ఆకాశంనుండి పడిన పిడుగు వెనక, తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనక, సమస్తమూ పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలని తన జీవితం వెనక దేవుని హస్తాన్నే చూసాడు.

“యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక.”

అన్నిటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదెలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు “ఆయన నన్ను సంహరించినా, నేనాయనలో నమ్మకముంచుతాను.” ఎంత విశ్వాసం!

-----------------------------------------------------------------------------------------------------------------------------

He knoweth the way that I take (Job -  23:10)

Believer! What a glorious assurance! This way of thine—this, it may be, a crooked, mysterious, tangled way—this way of trial and tears. “He knoweth it.” The furnace seven times heated—He lighted it. An Almighty Guide is knowing and directing our footsteps, whether it be to the bitter Marah pool, or to the joy and refreshment of Elim.

That way, dark to the Egyptians, has its pillar of cloud and fire for His own Israel. The furnace is hot; but not only can we trust the hand that kindles it, but we have the assurance that the fires are lighted not to consume, but to refine; and that when the refining process is completed (no sooner—no later) He brings His people forth as gold.

When they think Him least near, He is often nearest. “When my spirit was overwhelmed, then thou knewest my path.”

Do we know of ONE brighter than the brightest radiance of the visible sun, visiting our chamber with the first waking beam of the morning; an eye of infinite tenderness and compassion following us throughout the day, knowing the way that we take?

The world, in its cold vocabulary in the hour of adversity, speaks of “Providence”—“the will of Providence”—“the strokes of Providence.” PROVIDENCE! what is that?

Why dethrone a living, directing God from the sovereignty of His own earth? Why substitute an inanimate, death-like abstraction, in place of acting, controlling, personal Jehovah?

How it would take the sting from many a goading trial, to see what Job saw (in his hour of aggravated woe, when every earthly hope lay prostrate at his feet)—no hand but the Divine. He saw that hand behind the gleaming swords of the Sabeans—he saw it behind the lightning flash—he saw it giving wings to the careening tempest—he saw it in the awful silence of his rifled home.

“The Lord gave, and the Lord hath taken away; blessed be the name of the Lord!”

Thus seeing God in everything, his faith reached its climax when this once powerful prince of the desert, seated on his bed of ashes, could say, “Though He slays me, yet will I trust him.” —Macduff

Thursday, April 21, 2022

నీ సొంత సమయం కోసం పరుగెత్తకు

☘️ అత్యాధునిక కాలములో అన్ని ఇన్స్టంట్ గా జరుగుతున్న సమయములో ప్రతిదానికి వేచి ఉండాలి అంటే మనకి చాల కష్టముగా అనిపిస్తుంది, ఒకవేళ దేవుడు ఏదైనా విషయమై వేచి ఉండమంటే ఉండటానికి మనసొప్పదు. అన్ని పనులు వెంటనే చక చక జరిగిపోవాలి అని కోరుకుంటాము. ఆలోచిస్తాము. 

☘️ రక్షించబడిన పౌలు గారు ప్రతి పట్టణములో క్రీస్తు రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తూ ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు వెళ్తున్నారు. అయితే ఆ సమయములో ఆసియాలో వాక్యం చెప్పకుండా పరిశుద్దాత్మ దేవుడు వారిని ఆటంకపరచారు. మనం అయితే ఎందుకు, ఏమిటి అంటూ దేవుణ్ణి వంద ప్రశ్నలు వేస్తాము కానీ పౌలుగారు దేవుడు చూపించిన ప్రాంతమునకు వెళ్లి సువార్త ప్రకటించడం చేసారు.. అయితే దేవుని చిత్తానుసారముగా ఒక సమయము వచ్చినప్పుడు తిరిగి అదే ఆసియా ప్రాంతములో పౌలుగారు వాక్యం ప్రకటించినప్పుడు ఇంచుమించు ఆసియా ప్రాంతమంతా వాక్యాన్ని అంగీకరించి రక్షించబడ్డారు. 

🍁 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని - అ.కార్యములు 16:6 

🍁 అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి - అ.కార్యములు 19:8-10

🍁 మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను, ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను - అ.కార్యములు 19:11,20

☘️ పలు గారు వెళ్ళాలి అనుకున్నప్పుడు పరిశుద్దాత్మ దేవుడు ఆటంకపరిచారు, కానీ దేవుని సమయమందు అక్కడ పరిచర్య చేయుట వలన ఆసియలో కాపురమున్న ప్రతి ఒక్కరికి సిలువను గూర్చిన వార్త వినిపించింది, అక్కడ దేవుని మహత్కార్యములు అనేకములుగా జరిగాయి. 

☘️ అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతిదానికి సమయము కలదు (ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు; వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు; చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు - ప్రసంగి 3:1 - 8) అదేవిధముగా కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నారు (అ.కార్యములు 1:7) మన కాలగతులు దేవుని వశమై ఉన్నాయి (కీర్తనలు 31:15)

☘️ నడు నీవు కూడా ఆలస్యం అవుతుంది అనో, లేక ఇంకా నీవు ఆశించినది జరగటం లేదనో ఇలా ఏదొక కారణం చేత తొందరపడి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతే ఎవరినైనా లేదా దేనినైనా కోల్పోవాల్సి వస్తుందేమో అంటూ తొందరపడుతున్నావేమో.... లేక దేవునికోసం ఏదేదో చెయ్యాలి సమయం లేదు అంటూ నీ సొంత ఆలోచనలతో ఆరాటపడుతున్నావేమో.... అయితే నీ సమయం కోసం కాదు, పరిస్థితులను కాదు దేవుని సమయాన్ని చూడు, ఆయన ప్రణాళికలను చూడు.... ఆనాడు ఆసియ వెళ్లకుండా అడ్డుపడిన పరిశుద్దాత్మ దేవుడు తన సమయమందు ఆ ప్రాంతమందు సువార్త వ్యాప్తికి అనుమతి కల్పించారు. ఎప్పుడైతే దేవుని సమయమందు పౌలు అక్కడ పరిచర్య చేసారో అప్పుడు ఆసియ యందంతట దేవుని నామము మహిమపరచబడింది, దేవుని ప్రేమ అందరికి తెలియపరచబడింది. 

☘️ ఇదేవిధముగా నీవు, నేను కూడా ఎప్పుడైతే దేవుని సమయము కోసం ఎదురుచూస్తామో అప్పుడు మన జీవితములో కూడా దేవుని మహిమార్థమై అద్భుతకార్యాలు జరుగుతాయి, మన జీవితం కూడా సంతోషముతో నింపబడుతుంది....

Wednesday, April 20, 2022

By Faith Abraham Obeyed

 

అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను (హెబ్రీ 11:8).

తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. తాను దేవునివెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు గాని ప్రయాణం చేయమన్నవాని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకెదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు. కాని మార్గాన్ని సిద్దపరచి, నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు, నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజు పైనే దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకియ్యబడిన పని, ఇవి నువ్వు చెయ్యగలిగిన విధులు. నీ ఆజ్ఞలు ఎలాటివో అని నువ్ పరీక్షించుకోనక్కరలేదు. వాటిని అనుసరించి ఓడను సముద్రమార్గం పట్టించడమే నీ పని. అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు.

విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు నువ్వు స్వంతగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చించి పారెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు.

నిన్ను నడిపించేవాడు. అందరూ నడిచిన దారిగుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు. అలాటి దారుల గుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరి చేరదు. అలానే ఆయన నీతో ఉన్నంత కాలం నువ్వు కూడా దేనికీ భయపడకూదని ఆయన అంటున్నాడు.

మసక చీకటిలో తడుములాడుతూ

దారీ తెన్నూ లేక ఒంటరిగా

వెలుగు దేశాన్ని వెదుకుతూ

చీకటి కోనల్లో తిరుగుతున్నాను

దేవుడు నా చేయి పట్టుకున్నాడు

దారి తప్పకుండా నడిపించాడు

నాకు తెలియని క్షేమ మార్గాల్లో

నిశ్చల జలాల వెంట, పచ్చిక మైదానాల్లో

ఆయన్ను అనుసరించాను

చీకటి చిన్నాభిన్నమై పోయింది

అలసిన నయనాలు ఉదయాన్ని చూపాయి

ముందుముందుకి అరుణోదయం లోకి

ఆయన చేతిలో చేయి వేసి

రాత్రికి దూరంగా సాగిపోయాను

-----------------------------------------------------------------------------------------------------------------------------

By faith Abraham, when he was called to go out into a place which he should after receive for an inheritance, obeyed (Heb - 11:8)

Whither he went, he knew not; it was enough for him to know that he went with God. He leaned not so much upon the promises as upon the Promiser. He looked not on the difficulties of his lot, but on the King, eternal, immortal, invisible, the only wise God, who had deigned to appoint his course and would certainly vindicate Himself. O glorious faith! This is thy work, these are thy possibilities; contentment to sail with sealed orders, because of unwavering confidence in the wisdom of the Lord High Admiral; willing hold to rise up, leave all, and follow Christ, because of the glad assurance that earth best cannot bear comparison with Heaven’s least. —F. B. M.

It is by no means enough to set out cheerfully with your God on any venture of faith. Tear into the smallest pieces any itinerary for the journey which your imagination may have drawn up.

Nothing will fall out as you expect.

Your guide will keep to no beaten path. He will lead you in a way such as you never dreamed your eyes would look upon. He knows no fear, and He expects you to fear nothing while He is with you.

The day had gone; alone and weak  

I groped my way within a bleak  

And sunless land.  

The path that led into the light  

I could not find it! On that dark  

night, God took my hand.  


He led me that I might not stray,  

And brought me a new, safe way  

I had not known.  

By waters still, through pastures green  

I followed Him—the path was clean  

Of briar and stone.  


The heavy darkness lost its strength,  

My waiting eyes beheld at length  

The streaking dawn.  

On, safely on, through the sunrise glow  

I walked, my hand in His, and lo,  

The night had gone.  

—Annie Porter Johnson

Tuesday, April 19, 2022

Stand Still

 

యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి (నిర్గమ 14:13).

ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని, భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది. వాళ్ళు వెనుదిరిగి పోలేరు. ముందుకి వెళ్ళలేరు. ముందు నుయ్యి వెనక గొయ్యి. మరేం చెయ్యాలి?

మన నాయకుడి ఆజ్ఞ ఇది, “ఊరక నిలుచుండి చూడుడి.” ఇలాటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది క్షేమకరం. ఎందుకంటే తప్పుదారి పట్టించేవాళ్ళు చాలా మంది దొంగ సలహాలతో వస్తారు. “ఇంకేముంది, అంతా అయిపోయింది. ఇక చావే శరణ్యం” అని నిస్పృహ నీ చెవిలో నిట్టూరుస్తుంది. అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు. కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతనూ, ప్రేమనూ తలచుకుని ఉత్సహించడమే మన విధి.

పిరికితనం తొందర చేస్తుంది. “వెనక్కి వెళ్ళిపో, అందరూ చేస్తున్నట్టే చెయ్యి, లోకంతో వెళ్ళు, ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యం, లే! నీ నియమాలను తీసి ప్రక్కకి పెట్టు”, అంటూ నిన్ను నీరసింపజేస్తుంది ఆ పిరికితనపు ఆత్మ. 

నువ్వు నిజంగా దేవుని బిడ్డవయితే సైతాను ఇలా ఎంత నిరుత్సాహ పరచినా దాన్ననుసరించలేవు. ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్నీ తేజస్సునీ ధరించుకుని సాగి పొమ్మంటున్నది. నీ దారినుండి నరకం గాని మరణం గాని నిన్ను ప్రక్కకి మళ్ళించ లేవు. కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా? ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకుని నూతనోత్సాహంతో ముందుకి సాగిపోవడానికే గదా? 

దురుసుతనం రంకెలేస్తుంది “ఏదో ఒకటి చెయ్యి! లే! ఊరికే కూర్చోవడం సోమరితనం కదా” అని. ఏదో ఒకటి చేసెయ్యాలి, వెంటనే, అనుకుంటాము. దేవునివైపుకి చూడము. ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాడు. సంపూర్తిగా నెరవేర్చేవాడు.

అతి తెలివి బడాయిలు కొడుతుంది. “నీ ఎదుట సముద్రం ఉందా, నేరుగా దాన్లోకి నడిచి వెళ్ళిపో. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది.” అయితే విశ్వాసం ఈ మాటలేమీ వినదు. పిరికితనాన్నీ, దురుసుతనాన్నీ, అతి తెలివినిచ్చే సలహాలనీ పెడచెవిని పెడుతుంది. దేవుడన్నాడు “నిశ్చలంగా నిలబడి ఉండు!” కదలని బండరాయిలా నిలబెడుతుంది విశ్వాసం.

“నిశ్చలంగా నిలబడు” స్థిరుడైన మనుష్యునిలా నిలబడు. ముందుకు దూకడానికి సన్నద్ధుడివై, సిద్దపాటుతో ఓపికతో ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు. ఇశ్రాయేలీయులకి మోషే “ముందుకు వెళ్ళండి” అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకూ ఆజ్ఞాపిస్తాడు.

చిందర వందరైన నీ మార్గాల గురించి

చీకాకులెందుకు, నిశ్చలంగా నిలబడు

ఆలస్యాలూ, పరుగులూ

కనిపించేదాన్నిబట్టి కాదు


కొరతలేని విశ్వాసంతో సాగు

కొంతకాలం ఓపిక పట్టు

దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది

అర్థం కానిదంతా మబ్బులా విడిపోతుంది

 ఏం చెయ్యాలో అర్థం కాని వేళల్లో, ఊరికే ఉండి కనిపెట్టండి. సందేహాలేమన్నా ఉంటే వేచి యుండండి. తొందరపడి ఏదో చేసెయ్యకండి. నీ మనస్సులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టనిపిస్తే దానికి వ్యతిరేకంగా చెయ్యవద్దు. అదంతా తీరిపోయేదాకా ఆగండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Stand still, and see the salvation of the Lord (Exod -14:13)

These words contain God’s command to the believer when he is reduced to great straits and brought into extraordinary difficulties. He cannot retreat; he cannot go forward; he is shut up on the right hand and on the left. What is he now to do?

The Master’s word to him is “standstill.” It will be well for him if, at such times, he listens only to his Master’s word, for other and evil advisers come with their suggestions. Despair whispers, “Lie down and die; give it all up.” But God would have us put on a cheerful courage, and even in our worst times, rejoice in His love and faithfulness.

Cowardice says, “Retreat; go back to the worldling’s way of action; you cannot play the Christian’s part; it is too difficult. Relinquish your principles.”

But, however much Satan may urge this course upon you, you cannot follow it, if you are a child of God. His Divine fiat has bid thee go from strength to strength, and so thou shalt, and neither death nor hell shall turn thee from thy course. What if for a while thou art called to stand still; yet this is but to renew thy strength for some greater advance in due time.

Precipitancy cries, “Do something; stir yourself; to stand still and wait is sheer idleness.” We must be doing something at once—we must do it, so we think—instead of looking to the Lord, who will not only do something but will do everything.

Presumption boasts, “If the sea is before you, march into it, and expect a miracle.” But faith listens neither to Presumption, nor to Despair, nor to Cowardice, nor to Precipitancy, but it hears God say, “Stand still,” and immovable as a rock it stands.

“Stand still”—keep the posture of an upright man, ready for action, expecting further orders, cheerfully and patiently awaiting the directing voice; and it will not be long ere God shall say to you, as distinctly as Moses said it to the people of Israel, “Go forward.” —Spurgeon

“Be quiet! why this anxious heed  

About thy tangled ways?  

God knows them all. He giveth speed  

And He allows delays.  

’Tis good for thee to walk by faith  

And not by sight.  

Take it on trust a little while.  

Soon shalt thou read the mystery aright  

In the full sunshine of His smile.”

In times of uncertainty, wait. Always, if you have any doubt, wait. Do not force yourself into any action. If you have restraint in your spirit, wait until all is clear, and do not go against it.

Monday, April 18, 2022

PHindrance to Prayer

 

ఆయన నీ కార్యము నెరవేర్చును (కీర్తన 37:5). 

ఒకప్పుడు నేను అనుకునేదాన్ని. ఒక విషయం గురించి ప్రార్ధన చేసిన తరువాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చెయ్యగలిగిందంతా చెయ్యాలి అని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని. ఒకసారంటూ ప్రార్ధించి, తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి యుండాలనీ, ఆయనేదైనా చెప్తే చెయ్యాలనీ నేర్పించాడు. కాని చేతులు ముడుచుకు కూర్చోవడం, ఏమీ చెయ్యకుండా కేవలం దేవుని మీద భారం వేసి ఊరకుండడం మనకి రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం.

నీళ్ళలో మునిగిపోతున్నవాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకి తెలుసు. అలాగే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చెయ్యడం దేవునికి కష్టమైపోతుంది. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే.

ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మ శక్తులు మెదలకుండా ఊరుకుంటాయి.

ప్రార్థనకి జవాబివ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భాలలో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబి పువ్వుకి రంగు వెయ్యడానికీ, ఒక దేవదారు చెట్టుని పెంచడానికీ, గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చెయ్యడానికీ కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చెయ్యాలి, పదును చెయ్యాలి, ఎరువు వెయ్యాలి, నీటితో తడపాలి. మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేసాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని, కంకుల్నీ అమరుస్తాడు. చివరికి కొంత కాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి.

దీనంతటికీ కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాము, దున్నుతాము. తరువాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాము. దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము. దేవునికి తన పని చెయ్యడానికి సమయాన్నిస్తాము. మన ప్రార్థన జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And he shall bring it to pass (Ps - 37:5)

I once thought that after I prayed that it was my duty to do everything that I could do to bring the answer to pass. He taught me a better way and showed that my self-effort always hindered His working and that when I prayed and definitely believed Him for anything, He wanted me to wait in the spirit of praise, and only do what He bade me. It seems so unsafe to just sit still, and do nothing but trust the Lord, and the temptation to take the battle into our own hands is often tremendous.

We all know how impossible it is to rescue a drowning man who tries to help his rescuer, and it is equally impossible for the Lord to fight our battles for us when we insist upon trying to fight them ourselves. It is not that He will not, but He cannot. Our interference hinders His working. —C.H.P.

Spiritual forces cannot work while earthly forces are active.

It takes God time to answer prayer. We often fail to give God a chance in this respect. It takes time for God to paint a rose. It takes time for God to grow an oak. It takes time for God to make bread from wheat fields. He takes the earth. He pulverizes. He softens. He enriches. He wets with showers and dews. He warms with life. He gives the blade, the stock, the amber grain, and then at last the bread for the hungry.

All this takes time. Therefore we sow, and till, and wait, and trust, until all God’s purpose has been wrought out. We give God a chance in this matter of time. We need to learn this same lesson in our prayer life. It takes God time to answer prayer. —J. H. M.

Sunday, April 17, 2022

Diamond in the Rough

 

వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని

తెలిసికొనలేనివాడెవడు? (యోబు 12:9).

 చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ వినీ ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది. దాన్ని ఇంగ్లాండు దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు. ఆయన దాన్ని మెరుగు పెట్టించడానికి ఆమ్ స్టెర్డామ్ నగరానికి పంపాడు. ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు. దాన్ని అతను ఏం చేసాడనుకున్నారు?

ఆ అమూల్యమైన రాయిని తీసుకుని చిన్న గాడి చేసాడు. తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆ వజ్రం రెండు ముక్కలైంది! ఎంత నిర్లక్ష్యం, ఎంత వ్యర్ధం అయిపోయింది? అంత అజాగ్రత్త ఏమిటి? అనుకుంటున్నారా?

పొరపాటు, కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి. ఆ వజ్రపు రాయిని అన్ని కోణాలనుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు. దాని నాణ్యత, దానిలో ఉన్న లొసుగులు, పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకెల్లా అత్యంత నిపుణత గల వజ్రకారుడు.

దాన్నలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటనుకోకండి. అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట. ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపూ, సౌందర్యమూ, కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి. మొత్తంగా ఉన్నదాన్ని రెండుముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్టవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే. ఎందుకంటే ఈ రెండు ముక్కలనుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి. వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు, మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది.

ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు. రక్తం కారుతుంది. నరాలు లాగుతాయి. ఆత్మ బాధతో మూలుగుతుంది. ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని నీకనిపిస్తుంది. కాని అది నిజం కాదు. దేవుడికి నువ్వొక అమూల్యమైన రత్నానివి. ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు.

ఒకరోజున నిన్ను తీసుకెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు. అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీతో ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. దేవుని ప్రేమ చొప్పున తప్ప వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు. నీవు ఊహించని, ఆలోచించని ఆత్మీయాశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూడుతాయి.

జార్జి మెక్ డోనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది.

“దేవుడు నన్నెందుకు చేసాడో అర్ధం కావడం లేదు, నన్ను చేయడం వల్ల ప్రయోజనమేమిటో నాకర్ధం కాదు.” మిసెస్ ఫేబర్ అంది కసిగా.

"ఇప్పుడప్పుడే నీకర్ధం కాదేమో. అయితే నిన్నింకా దేవుడు వదిలెయ్యలేదుగా. ఇంకా నిన్ను తయారుచేస్తూనే ఉన్నాడు. తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు.” అంది డోరతి. 

మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మాలి. దేవునికిష్టం వచ్చినట్టుగా తమని తయారుచేయడానికి సమ్మతించాలి. కుమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమపట్ల చెయ్యడానికి విధేయులవుతూ ఉండాలి. ఈ తయారీలు వాళ్ళ మీదికి వచ్చే పీడనాలనూ, ఉలిదెబ్బలనూ ఓపికతో ఆహ్వానిస్తూ ఉండాలి. నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉండాలి. ఇలా చేస్తే తాము చివరికి ఎలాటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు. తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

The hand of the Lord hath wrought this (Job - 12:9)

Several years ago there was found in an African mine the most magnificent diamond in the world. It was presented to the King of England to blaze in his crown of state. The King sent it to Amsterdam to be cut. It was put into the hands of an expert lapidary. And what do you suppose he did with it?

He took the gem of priceless value and cut a notch in it. Then he struck it a hard blow with his instrument, and lo! the superb jewel lay in his hand cleft in twain. What recklessness! What wastefulness! What criminal carelessness!

Not so. For days and weeks, that blow had been studied and planned. Drawings and models had been made of the gem. Its quality, its defects, its lines of cleavage had all been studied with the minutest care. The man to whom it was committed was one of the most skillful lapidaries in the world.

Do you say that blow was a mistake? Nay. It was the climax of the lapidary’s skill. When he struck that blow, he did the one thing which would bring that gem to its most perfect shapeliness, radiance, and jeweled splendor. That blow that seemed to ruin the superb precious stone was, in fact, its perfect redemption. For, from those two halves were wrought the two magnificent gems which the skilled eye of the lapidary saw hidden in the rough, uncut stone as it came from the mine.

So, sometimes, God lets a stinging blow fall upon your life. The blood spurts. The nerves wince. The soul cries out in agony. The blow seems to you an appalling mistake. But it is not, for you are the most priceless jewel in the world to God. And He is the most skilled lapidary in the universe.

Some day you are to blaze in the diadem of the King. As you lie in His hand now He knows just how to deal with you. Not a blow will be permitted to fall upon your shrinking soul but that the love of God permits it, and works out from its depths, blessing and spiritual enrichment unseen, and unthought of by you. —J. H. McC.

In one of George MacDonald’s books occurs this fragment of conversation: “I wonder why God made me,” said Mrs. Faber bitterly. “I’m sure I don’t know what was the use of making me!”

“Perhaps not much yet,” said Dorothy, “but then He hasn’t done with you yet. He is making you now, and you are quarreling with the process.”

If men would but believe that they are in process of creation, and consent to be made—let the Maker handle them as the potter the clay, yielding themselves in resplendent motion and submissive, hopeful action with the turning of His wheel—they would ere long find themselves able to welcome every pressure of that hand on them, even when it was felt in pain; and sometimes not only to believe but to recognize the Divine end in view, the bringing of a son unto glory.

“Not a single shaft can hit,  

Till then God of love sees fit.”

Saturday, April 16, 2022

విమోచించగలవాడు దేవుడొక్కడే

 ◆  బంధకములనుండి విడుదల అవసరం: 

             ఇశ్రాయేలీయులు ఐగుప్తు లో 430 సంవత్సరములు బానిసలుగా బాధలను అనుభవించుచున్నపుడు వారు పెట్టిన మొఱ్ఱ కృప కలిగిన దేవుడు ఆలకించి వారిని విడిపించుటకు మోషే ను పంపించాడు. యూదా జనాంగము బబులోనులో చేరలోనుండుటకు కొనిపోబడిన 70 సంవత్సరముల తరువాత వారిని బంధకముల నుండి విడిపించాడు. 


● విమోచనకై మార్గాలు ●


◆  విమోచించగలవాడు దేవుడొక్కడే: 

             


"కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని." (నిర్గమ 3: 8,9).


◆  విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి:

          "కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. (నిర్గమ 3:10)."  ఇశ్రాయేలీయులు తమ కష్టకాలంలో దేవునికి మొఱ్ఱపెట్టగా మొదట మోషేను, ఒకసారి ఒత్నియేలును, ఒకసారి ఏ హుదును, ఒకసారి గిద్యోనును ( న్యాయాధిపతులు 3:9,15; 6:14) వారికి రక్షకులుగా పంపితివి. మనం పాపులుముగా ఉండగా యేసే స్వయముగా రక్షకునిగా (మత్త 1:21) వచ్చియున్నాడు. 


◆  విమోచించుటకు రక్తం అవసరం:

             "మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు." (నిర్గమ 12:13). ఇశ్రాయేలీయుల పస్కా పశువు రక్తమును తమ ఇంటి ద్వారము యొక్క కమ్మీ మీద చిలకరించుట ద్వార దేవుని ఆజ్ఞ నెరవేర్చి మరణము నుండి తప్పింపబడి యున్నారు. మానమింక పాపులమై యుండగా పస్కా పశువుగా యేసే విధింప బడి ఆ రక్తము ద్వార మనం రక్షింపబడియున్నాము. "అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యెహను 1:7)".


◆  విమోచించుటకు బహువు (ఒక శక్తి ) అవసరం: 

             "కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించెదను (నిర్గమ 6:6)."

"నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు. (యెషయా 51:5)"

ఉగ్రత నుండి తప్పించుకొనుటకు, విమోచింపబడుటకు యేసు యొక్క బహువు అవసరం.


◆  విమోచించడానికి ఒక దినం అవసరం: 

          ఇశ్రాయేలీయులు 450 సంవత్సరములు గడిచిన తరువాతే యెహోవా సేనలు ఐగుప్తు నుండి బయలుదేరి పోయెను. ఆనాడే పస్కా (15th of Bisan). ఇది దైవ నిర్ణయం. ఇది ఆదిలో అబ్రాహామును పిలిచిన దినమున దేవుడు బయలుపరచాడు (ఆది 15:14). ఆ మహా దేవుని ప్రణాళిక ఎంత సుధీర్ఘమైనది? మరి మన విషయమైతే ప్రతి వ్యక్తి రక్షణ  (విమోచన) గూర్చి ఒక దినము నిర్ణయించాడు (హెబ్రీ 4:7),  ఇదిగో ఇదియే రక్షణ దినము (2కోరింది 6:2). కాబట్టి రక్షణ పొందుటకు ఆలస్యము చేయకు. మంచి రోజు అని చూడకు. ఎందుకంటే రేపు నీది కాదేమో!

             ప్రియమైన సహోదరుడా, సహోదరీ నీవు మరణము యొక్క బలము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, దుర్నీతి నుండి, సాతాను బంధకముల నుండి విడుదల పొందితివా? అవును అంటే దేవునికి వందనములు. ఇంకా లేదు అంటే నేడే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఎందుకనగా నీకు నీవు విడిపించుకోలేవు సుమా! విమోచింపబడిన ఇశ్రాయేలు వలె ఎఱ్ఱసముద్రం దాటి, యెర్ధను దాటి కనాను చేరాలి. విమోచింపబడిన గాడిద వలె ప్రభువుని కలిగి యెరూషలేము చేరాలి. అలా చేరుటకు ఆ ప్రభువు సహాయం చేయును గాక! ఆమెన్!!!

Friday, April 15, 2022

Rest on the Word of God

 

నీ మాట నమ్ముకొనియున్నాను (కీర్తన 119:42).

దేవుడు తాను చేస్తానన్న దానిని చేసి తీరుతాడని మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనలతో గాని, అభిప్రాయాలతో గాని, ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో గాని నిమిత్తం లేదు. బయటికి కనిపించే దానితో పనిలేదు. వీటన్నిటినీ విశ్వాసానికి ముడి పెట్టాలని చూస్తే మనం దేవుని మాటని నమ్మడం లేదన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడూ అంటే ఇక మనకి చీకటిలో పనిలేదు. విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన మాటను మనం ఉన్నదున్నట్టుగా నమ్మితే మన మనస్సుకి శాంతి ఉంటుంది.

మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవుడికెంతో సంతోషదాయకం. మొదటగా మన ఆత్మల్ని దీవించడానికి, రెండవదిగా సంఘాన్ని, సంఘంలో చేరని వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి. కాని ఇలా ఉపయోగపడే స్థితినుంచి మనం మొహం చాటుచేసుకుంటాం.

శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే “నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు. ఇది గడిచిన తరువాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగడానికిస్తాడు.” శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం. మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం. తన పిల్లలకి మంచి చెయ్యడమే ఆయన మనసుకి ఆనందం.

విశ్వాసం ఉపయోగపడడానికీ, అభివృద్ధి పొందడానికీ సాధనాలు కేవలం కష్టాలూ, శ్రమలే కావు. వాక్యాన్ని చదవడం, తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్నదాన్ని ఆకళింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే.

నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి “దేవుడెంత ప్రేయామయుడు!” అని. అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇలాటి స్థితికి తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి. ఆయన దయనూ, మృదుమధురమైన లాలననూ మీరు పూర్తిగా అనుభవించాలనీ, ఆయన ఎంత మంచివాడో తెలుసు కోవాలనీ, తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకెంత ఇష్టమో మీకు తెలియాలని అర్ధించండి.

ఇలాటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం. మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాము. అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం. “వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను. ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నా నిశ్చయం.” ఈ విధంగా ఒక హుందాతనంతో లోకం ఎదుట సాక్ష్యమిస్తాము. ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I trust in thy word (Ps - 119:42)

Just in proportion to which we believe that God will do just what He has said, is our faith strong or weak. Faith has nothing to do with feelings, or with impressions, improbabilities, or with outward appearances. If we desire to couple them with faith, then we are no longer resting on the Word of God because faith needs nothing of the kind. Faith rests on the naked Word of God. When we take Him at His Word, the heart is at peace.

God delights to exercise faith, first for blessing in our own souls, then for blessing in the Church at large, and also for those without. But this exercise we shrink from instead of welcoming. When trials come, we should say: “My Heavenly Father puts this cup of trial into my hands, that I may have something sweet afterward.”

Trials are the food of faith. Oh, let us leave ourselves in the hands of our Heavenly Father! It is the joy of His heart to do good to all His children.

But trials and difficulties are not the only means by which faith is exercised and thereby increased. There is the reading of the Scriptures, that we may buy them acquaint ourselves with God as He has revealed Himself in His Word.

Are you able to say, from the acquaintance you have made with God, that He is a lovely Being? If not, let me affectionately entreat you to ask God to bring you to this, that you may admire His gentleness and kindness, that you may be able to say how good He is, and what a delight it is to the heart of God to do good to His children.

Now the nearer we come to this in our inmost souls, the more ready we are to leave ourselves in His hands, satisfied with all His dealings with us. And when the trial comes, we shall say:

“I will wait and see what good God will do to me by it, assured He will do it.” Thus we shall bear an honorable testimony before the world, and thus we shall strengthen the hands of others. —George Mueller.

Thursday, April 14, 2022

Resurrection Hope

 

ఆర్భాటము తోను, ప్రధాన దూత శబ్దము తోను, దేవుని బూర తోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము (1థెస్స 4:16,17). 

యేసు ప్రభువు సమాధినుండి లేచినది ఉదయం. “పెందలకడనే, ఇంకను చీకటియుండగానే తెరిచియున్న ఆయన సమాధి మీద సూర్యునికంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదింకా. యెరూషలేము నగరవాసులింకా నిద్ర లేవలేదు. అదింకా రాత్రే. నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం, అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందలకడ ఇంకా చీకటి ఉండగానే, వేగుచుక్క వెలుగుతూ ఉన్నప్పుడే, ఆయన మృత్యువునుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోను మరణ నిద్రలోను ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవడంలో ఎవరికీ ఇబ్బంది కలిగించరు. ఎవరికీ నిద్రాభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకి వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసుప్రభువు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగానూ, మెల్లగానూ ఆ ఘడియ వచ్చినప్పుడూ వాళ్ళని నిద్రలేపుతాడు. “మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి” (యెషయా 26:19) అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతఃకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి. తూర్పుదిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జోలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్ళవే.

ఈ విషయాలకీ, వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికీ, వాళ్ళింతవరకూ నిద్రించిన సమాధికీ ఉన్న తేడా గమనించండి. తమని బంధించి ఉంచిన నేలని విదిలించుకుని మృత్యుపాశాలను తెంచుకుని, తమ మహిమ శరీరాలతో, ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమౌతూ ఎవరూ నడవని ఆ దారులవెంట, వేగుచుక్క కిరణాల జలతారు దారాలమీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు. కాని ఉదయంతో పాటు ఉల్లాసం వస్తుంది.

సైన్యాలు పరలోకం నుండి దిగివస్తూ

హోసన్నా అని పాడుతుంటే

పరిశుద్ధులు, దూతలు జయనాదం పలుకుతుంటే

శృంగార మహిమాతిశయాలతో యేసు

తనవారిని చేర్చుకుంటాడు

ఇలాగే అవుతుంది. యేసుప్రభు త్వరగా వచ్చెయ్యి

ఒక సైనికుడన్నాడట “నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు. తెల్లవారు జామునే మేలుకొమ్మని హెచ్చరించే బూరలు ఊదండి.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

For the Lord, himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God: and the dead in Christ shall rise first: then we which are alive and remain shall be caught up together with them in the clouds, to meet the Lord in the air: so shall we ever be with the Lord (1 Thess -  4:16-17)

It was “very early in the morning” while “it was yet dark,” that Jesus rose from the dead. Not the sun, but only the morning star shone upon His opening tomb. The shadows had not fled, the citizens of Jerusalem had not awaked. It was still night—the hour of sleep and darkness when He arose. Nor did his rising break the slumbers of the city. So shall it be “very early in the morning while it is yet dark,” and when naught but the morning star is shining, that Christ’s body, the Church, shall arise. Like Him, His saints shall awake when the children of the night and darkness are still sleeping their sleep of death. In their arising, they disturb no one. The world hears not the voice that summons them. As Jesus laid them quietly to rest, each in his own still tomb, like children in the arms of their mother; so, as quietly, as gently, shall He awake them when the hour arrives. To them come the quickening words, “Awake and sing, ye that dwell in dust” (Isa. 26:19). Into their tomb, the earliest ray of glory finds its way. They drink in the first gleams of the morning, while as yet the eastern clouds give but the faintest signs of the uprising. Its genial fragrance, its soothing stillness, its bracing freshness, its sweet loneliness, its quiet purity, all so solemn and yet so full of hope, these are theirs.

Oh, the contrast between these things and the dark night through which they have passed! Oh, the contrast between these things and the grave from which they have sprung! And as they shake off the encumbering turf, flinging mortality aside, and rising, in glorified bodies, to meet their Lord in the air, they are lighted and guided upward, along the untrodden pathway, by the beams of that Star of the morning, which, like the Star of Bethlehem, conducts them to the presence of the King. “Weeping may endure for a night, but joy cometh in the morning.” —Horatius Bonar

“While the hosts cry Hosanna, from heaven descending,  

With glorified saints and the angels attending,  

With grace on His brow, like, a halo of glory,  

Will Jesus receive His own?”  

“Even so, come quickly.”

A soldier said, “When I die do not sound taps over my grave, but reveille, the morning call, the summons to rise.”

Wednesday, April 13, 2022

Waiting and Working

 

అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. (యెహెజ్కేలు 3:22)

ప్రత్యేకంగా కొంత కాలం ఎదురు చూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్లు మనం చూడం. మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి. పౌలు తాను మారుమనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటప్పుడు మూడేళ్లు అరేబియా ఎడారిలో ఉండాల్సి రావడం నుండి ఈనాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది.

నా విషయంలో ఇలానే జరిగింది. సాహిత్యం ద్వారా దైవ సేవ చేయడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలుపెట్టేద్దామనుకున్నాను కానీ డాక్టర్ అడ్డుపడ్డాడు. “లాభం లేదు, ఆవిడకి రాయడం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి” అన్నాడు. రెండూ చేయాలంటే కుదరదు.

ఇది 1860వ సంవత్సరంలో జరిగింది. ఆ గూట్లో నుండి నేను 1869 లో బయటకు వచ్చాను. నీడలో తొమ్మిదేళ్లు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది. దేవుని ప్రేమ మార్పు లేనిది. ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. అందువల్ల మనకి ఇష్టంగానూ అభివృద్ధికరంగానూ కనిపించే వాటిని కొన్నిసార్లు మనకివ్వడు. ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చెయ్యగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకి తెలుసు.

నా పనిని మౌనంగా ప్రక్కన పెట్టాను

విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను

”విశ్రాంతి తీసుకో” అంటూ యజమాని పిలిచాడు

“క్రీస్తుతోనే నా విశ్రాంతి” నా మనసు పలికింది


తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు

ఇప్పుడున్న అనారోగ్యం ఆయన నిర్ణయమే

విశ్రాంతి తీసుకోమంటే కష్టపడి పోతాం మనం ఆయన దారి మంచిది, అంధులం మనం


ఆయన ఇచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు అలసిన పాదాలు నడవవలసిన దారులున్నాయి

అలసిన చేతులు చెయ్యవలసిన పనులు ఉన్నాయి

ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరం ఉంది


కదలక మెదలక ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది

తన ఇష్టప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి

ఆయన పని జరగాలి పాఠం పూర్తిగా నేర్చుకోవాలి

మర్చిపోవద్దు, ఆయనకున్న నేర్పు మరెవ్వరికీ లేదు


పని చెయ్యడమే కాదు, శిక్షణ పొందాలి

శిక్షలో యేసు శిరస్సు వంచడం నేర్చుకున్నాడు ఆయన భారం తేలిక, ఆయన కాడి సులువు

నీతి ఉంది ఆయన క్రమశిక్షణలో


ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం

మన పని కాదు, మనం సేవకులమే

పనిలోనూ, ఎదురు చూడడం లోను

మన చిత్తం కాదు, దేవుని చిత్తమే నెరవేరాలి

దేవుడు మనకు పనులు పురమాయించినట్లుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు. విశ్రాంతి తీసుకోండి. అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరకు తీసుకు వచ్చిన ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And the hand of the Lord was there upon me; and he said unto me, Arise, go forth unto the plain, and I will there talk with thee (Ezek - 3:22)

Did you ever hear of anyone being much used for Christ who did not have some special waiting time, some complete upset of all his or her plans first; from St. Paul’s being sent off into the desert of Arabia for three years, when he must have been boiling over with the glad tidings, down to the present day?

You were looking forward to telling about trusting Jesus in Syria; now He says, “I want you to show what it is to trust Me, without waiting for Syria.”

My own case is far less severe, but the same in principle, that when I thought the door was flung open for me to go with a bound into literary work, it is opposed, and the doctor steps in and says, simply, “Never! She must choose between writing and living; she can’t do both.”

That was in 1860. Then I came out of the shell with “Ministry of Song” in 1869 and saw the evident wisdom of being kept waiting nine years in the shade. God’s love is unchangeable, He is just as loving when we do not see or feel His love. Also, His love and His sovereignty are co-equal and universal; so He withholds the enjoyment and conscious progress because He knows best what will really ripen and further His work in us. —Memorials of Frances Ridley Havergal

I laid it down in silence,  

This work of mine,  

And took what had been sent me—  

A resting time.  

The Master’s voice had called me  

To rest apart;  

“Apart with Jesus only,”  

Echoed my heart.  


I took the rest and stillness  

From His own Hand,  

And felt this present illness  

Was what He planned.  

How often do we choose labor,  

When He says “Rest”—  

Our ways are blind and crooked;  

His way is best.  


The work Himself has given,  

He will complete it.  

There may be other errands  

For tired feet;  

There may be other duties  

For tired hands,  

The present is obedience  

To His commands.  


There is a blessed resting  

In lying still,  

In letting His hand mold us,  

Just as He will.  

His work must be completed.  

His lesson set;  

He is the higher Workman:  

Do not forget!  


It is not only “working.”  

We must be trained;  

And Jesus “learned” obedience,  

Through suffering gained.  

For us, His yoke is easy,  

His burden is light.  

His discipline most needful,  

And all is right.  


We are but under-workmen;  

They never choose  

If this tool or if that one  

Their hands shall use.  

In working or in waiting  

May we fulfill  

Not ours at all, but only  

The Master’s will!  

—Selected

God provides resting places as well as working places. Rest, then, and be thankful when He brings you, wearied to a wayside well.

Tuesday, April 12, 2022

God Permits Temptation

 

యేసు పరిశుద్ధాత్మ  పూర్ణుడై  యొర్దాను నది నుండి  తిరిగివచ్చి  నలువది దినములు  ఆత్మచేత  అరణ్యములో నడిపింపబడి అపవాది చేత  శోధింపబడి చుండెను - (లూకా 4:1,2).

యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారయితే ఒక అపొస్తలుడి చేత “యేసు ఎవరో నాకు తెలియదు” అని పలికించగలిగాడు వాడు. 

మార్టిన్ లూథర్ కంటే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణకు దిగిన వాళ్లు చాలా తక్కువమంది ఉంటారేమో. ఎందుకు? లూధర్ ఏకంగా నరక రాజ్యం మీదే దండెత్తాడు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు!

ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుపానులు వృక్షాలకు ఎలా మేలు చేస్తాయో, శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తన్నడానికి సహాయ పడతాయి ఈ తుఫానులు.  పింగాణీని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్టవం శాశ్వతం అవుతుంది కదా!

నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలియదు. సైతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకి లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకి లాక్కోవడం తెలుస్తుంది.

అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే. తన ఆభరణాలను మెరుగు పెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తళతళలాడేలా చేయాలనుకుంటాడో వాళ్లపైనే ఎక్కువగా తన పరికరాలను వాడతాడు.

ఇది ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. దేవుడి కర్మాగారంలోని కొలిమికీ, సుత్తులకీ, సానపెట్టే పరికరాలకీ నేను ఋణపడి ఉన్నాను. అసలు బెత్తం ద్వారా తప్ప నేను నేర్చుకున్నదేదైనా ఉందా అని నా అనుమానం. నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి క్రమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And Jesus being full of the Holy Ghost returned from Jordan and was led by the Spirit into the wilderness, being forty days tempted of the devil (Luke - 4:1-2)

Jesus was full of the Holy Ghost, and yet He was tempted. Temptation often comes upon a man with its strongest power when he is nearest to God. As someone has said, “The devil aims high.” He got one apostle to say he did not even know Christ.

Very few men have such conflicts with the devil as Martin Luther had. Why? Because Martin Luther was going to shake the very kingdom of hell. Oh, what conflicts John Bunyan had!

If a man has much of the Spirit of God, he will have great conflicts with the tempter. God permits temptation because it does for us what the storms do for the oaks—it roots us, and what the fire does for the paintings on the porcelain—it makes them permanent.

You never know that you have a grip on Christ, or that He has a grip on you, as well as when the devil is using all his force to attract you from Him; then you feel the pull of Christ’s right hand. —Selected

Extraordinary afflictions are not always the punishment of extraordinary sins, but sometimes the trial of extraordinary graces. God hath many sharp-cutting instruments, and rough files for the polishing of His jewels; and those He especially loves and means to make the most resplendent, He hath oftenest His tools upon. —Archbishop Leighton

I bear my willing witness that I owe more to the fire and the hammer, and the file than to anything else in my Lord’s workshop. I sometimes question whether I have ever learned anything except through the rod. When my schoolroom is darkened, I see most.