Friday, December 31, 2021

Hitherto


యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెను (1సమూ 7:12).

ఇంత వరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. ఇరవై ఏళ్ళు కానివ్వండి. డెబ్భై ఏళ్ళు కానివ్వండి. గడిచిన కాలమెంతైనా ఇంత వరకు దేవుడు మనకి సహాయం చేసాడు. కలిమిలోను, లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంటా బయటా, భూమి మీదా, నీళ్ళ మీదా, గౌరవంలో, అగౌరవంలో, కంగారులో, ఆనందంలో, శ్రమలో, విజయంలో, ప్రార్థనలో, శోధనలో - ఇంత వరకు దేవుడు మనకు సహాయము చేసెను.

చెట్లు వరసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు, కాండాలు, ఈ చివరినుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదానివెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది. అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసల్ని ఒక్కసారి వెనుదిగిరి చూడు. కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమబలంతో స్థిరంగా నిలిపిన కాండాలనూ, సంతోషాల కొమ్మలనూ చూడు.

ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా. అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపనుబట్టి అవి పాటలు పాడుతున్నాయి.

ఇంత వరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది. కొంతదూరం నడిచిన తరువాత 'ఇంత వరకు' అని అతను రాసాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలూ, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయసు, మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి.

అంతేనా? లేదు. ఇంకా ఉంది. యేసు పోలిక లోనికి మేలుకొలుపు. సింహాసనాలు, వీణెలు, స్తుతిగీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖారవిందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత ఇవన్నీ ఉన్నాయి. ధైర్యం తెచ్చుకోండి, గొప్ప ఆత్మ విశ్వాసంతో మీ ఎబినేజరును నిలబెట్టండి.

ఇంత వరకు వెంటనున్న వాడు 

ఇక పైన జంటగా ఉంటాడు.


ఈ “ఇంత వరకు”ను పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది!

ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది. ప్రతిరోజూ ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడంవల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి. కనుచీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగుచేసి ఆ కొండదారులగుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. “ఇంతవరకు దేవుడు కాపాడాడు! ఆయన నామానికి స్తోత్రాలు!”

చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. "గుడ్ నైట్, గుడ్ నైట్” ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది.

ఈ చీకటిలో మనం కూడా ఒకర్నొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆపైన ఉదయమై నప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము. విమోచన పొందిన వాళ్ళతో కలిసి “సింహాసనాససీనుడైన వానికి, గొర్రెపిల్లకూ మహిమ, ఘనత సదాకాలము కలుగును గాక” అంటూ ఉత్సాహగానం చేస్తాము.

యుగయుగాలకూ ఇదే నా పాట

యేసు చూపించాడు నాకు బాట

“మరి రెండవసారి వారు - ప్రభువును స్తుతించుడి అనిరి” (ప్రకటన 19:3).

-----------------------------------------------------------------------------------------------------------------------------

Hitherto hath the Lord helped us - (1 Sam - 7:12)

The word “hitherto” seems like a hand pointing in the direction of the past. Twenty years or seventy, and yet “hitherto hath the Lord helped us!” Through poverty, through wealth, through sickness, through health; at home, abroad, on the land, on the sea; in honor, in dishonor, in perplexity, in joy, in a trial, in triumph, in prayer, in temptation—“hitherto hath the Lord helped!”

We delight to look down a long avenue of trees. It is delightful to gaze from one end of the long vista, a sort of verdant temple, with its branching pillars and its arches of leaves. Even so look down the long aisles of your years, at the green boughs of mercy overhead, and the strong pillars of lovingkindness and faithfulness which bear up your joys.

Are there no birds in yonder branches singing? Surely, there must be many, and they all sing of mercy received “hitherto.”

But the word also points forward. For when a man gets up to a certain mark and writes “hitherto,” he is not yet at the end; there are still distances to be traversed. More trials, more joys; more temptations, more triumphs; more prayers, more answers; more toils, more strength; more fights, more victories; and then come sickness, old age, disease, death.

Is it over now? No! there is more yet—awakening in Jesus’ likeness, thrones, harps, songs, psalms, white raiment the face of Jesus, the society of saints, the glory of God, the fullness of eternity, the infinity of bliss. Oh, be of good courage, believer, and with grateful confidence raise thy “Ebenezer,” for,

“He who hath helped thee hitherto  

Will help thee all thy journey through.”  

When read in Heaven’s light, how glorious and marvelous a prospect will thy “hitherto” unfold to thy grateful eye. —C. H. Spurgeon

The Alpine shepherds have a beautiful custom of ending the day by singing to one another an evening farewell. The air is so crystalline that the song will carry long distances. As the dusk begins to fall, they gather their flocks and begin to lead them down the mountain paths, singing, “Hitherto hath the Lord helped us. Let us praise His name!”

And at last with a sweet courtesy, they sing to one another the friendly farewell: “Goodnight! Goodnight!” The words are taken up by the echoes, and from side to side the song goes reverberating sweetly and softly until the music dies away in the distance.

So let us call out to one another through the darkness, till the gloom becomes vocal with many voices, encouraging the pilgrim host. Let the echoes gather till a very storm of Hallelujahs breaks in thundering waves around the sapphire throne, and then as the morning breaks we shall find ourselves at the margin of the sea of glass, crying, with the redeemed host, “Blessing and honor and glory be unto him that sitteth on the throne and to the Lamb forever and ever!”

“This my song through endless ages,  

Jesus led me all the way.”

Thursday, December 30, 2021

Believing Prayer

 పేతురు చెరసాలలో ఉంచబడెను; సంఘమయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్ధన చేయుచుండెను (అపొ.కా. 12:5). 


పేతురు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతణ్ణి విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం గాని శక్తి గాని లేవు. లోక సంబంధమైన సహాయం లేదు. అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్తులంతా బహు నిష్ఠగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్రనుండి లేపి కావలివాళ్ళ మధ్యనుండి బయటికి నడిపించాడు. వాళ్ళు ఇనుప గేటు దగ్గరికి వచ్చేసరికి దానంతట అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు.


నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుప గేటు ఉందేమో. పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో. నువ్వొక రహస్యం నేర్చుకోవాలి. నమ్మికగల ప్రార్థన. నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆనాటి సంఘస్తులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అనవసరమైన బాధలకూ నువ్వు లోనుకాకుండా తప్పించుకోగలవు. ఆటంకాలు మాయమైపోతాయి. నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి (మార్కు 11:22). చెరసాలల్లో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ళ తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు, సైతాను బంధకాల్లో ఉన్నవారు, నమ్మికతో కూడిన నీ ప్రార్థనవల్ల విముక్తులౌతారు.


అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మెలుపై ఏలీయా నేలమట్టుకు వంగి తన మోకాళ్ళ మధ్య తలను పెట్టుకుని ప్రార్థించాడు. అదీ ప్రార్థనంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వమంతా దేవునితో లీనమైంది. మాటలేవీ ఉచ్ఛరించలేదు. మాటల్లో ఇమడనంత ఆవేదనా పూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కోసారి. దేవునితో ఐక్యమై దుష్టశక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాటి ప్రార్థన ఎంతో అవసరం. 


ఉచ్ఛరింపశక్యంగాని మూలుగులు దేవుడు నిరాకరింపశక్యం గాని ప్రార్థనలు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Peter was kept in prison: but prayer [instant and earnest prayer] was made for him - (Acts - 12:5)

Peter was in prison awaiting his execution. The Church had neither human power nor influence to save him. There was no earthly help, but there was a help to be obtained by the way of Heaven. They gave themselves to fervent, importunate prayer. God sent His angel, who aroused Peter from sleep and led him out through the first and second wards of the prison; and when they came to the iron gate, it opened to them of its own accord, and Peter was free.

There may be some iron gate in your life that has blocked your way. Like a caged bird you have often been beaten against the bars, but instead of helping, you have only had to fall back tired, exhausted, and sore at heart. There is a secret for you to learn, and that is believing prayer; and when you come to the iron gate, it will open of its own accord. How much wasted energy and sore disappointment will be saved if you will learn to pray as did the Church in the upper room! Insurmountable difficulties will disappear; adverse circumstances will prove favorable if you learn to pray, not with your own faith but with the faith of God (Mark 11:22, margin). Souls in prison have been waiting for years for the gate to open; loved ones out of Christ, bound by Satan, will be set free when you pray till you definitely believe God. —C. H. P.

Emergencies call for intense prayer. When the man becomes the prayer nothing can resist its touch. Elijah on Carmel, bowed down on the ground, with his face between his knees, that was prayer—the man himself. No words are mentioned. Prayer can be too tense for words. The man’s whole being was in touch with God and was set with God against the powers of evil. They couldn’t withstand such praying. There’s more of this embodied praying needed. —The Bent-knee Time

“Groanings which cannot be uttered are often prayers which cannot be refused.” —C. H. Spurgeon

Wednesday, December 29, 2021

Appropriating Faith

 

ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి ... దేవుడు మీ చేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి (న్యాయాధి 18:9,10).


లేవండి! మనం చెయ్యడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మనం స్వాధీనపరచుకుంటే తప్ప ఏదీ మన స్వంతం కాదు. "అక్కడ యోసేపు పుత్రులైన  మనష్షే  ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి” (యెహోషువ 16:4). "యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు” (ఓబద్యా 17). నీతిమంతులు శ్రేష్ఠమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు.


దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మన స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి. స్వాధీనపరచుకునే విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే “ఒక పెన్సిలు తీసుకుని 'నావి', 'నా యొక్క' అనే పదాలన్నిటినీ అండర్లైన్ చెయ్యడమే” అని జవాబిచ్చాడు. 


దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకుని “ఇది నా కోసమే” అనుకోవచ్చు. ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి 'ఇది నాది' అనాలి. వాక్యంలోని ఎన్ని వాగ్దానాలపట్ల 'ఇది జరిగింది' అని నువ్వు అనగలవు. 'ఇది నాపట్ల నిజమైంది' అని చెప్పగలవు.


"కుమారుడా, నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే” నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు.


విశ్వాసం అనేది మార్కెట్ కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది.

----------------------------------------------------------------------------------------------------------------------------

Arise ... for we have seen the land, and behold, it is very good; and are ye still? Be not slothful to go, and enter to possess the land: for God hath given it into your hands; a place where there is no want of anything that is in the earth - (Judg - 18:9-10)


Arise! Then there is something definite for us to do. Nothing is ours unless we take it. “The children of Joseph, Manasseh, and Ephraim, took their inheritance” (Joshua 16:4). “The house of Jacob shall possess their possessions” (Obad. 17). “The upright shall have good things in possession.”


We need to have appropriating faith regarding God’s promises. We must make God’s Word our own personal possession. A child was asked once what appropriating faith was, and the answer was, “It is taking a pencil and underscoring all me’s and mine’s and my’s in the Bible.”


Take any word you please that He has spoken and say, “That word is my word.” Put your finger on this promise and say, “It is mine.” How much of the Word has been endorsed and receipted and said: “It is done.” How many promises can you subscribe and say, “Fulfilled to me.”


“Son, thou art ever with Me, and all that I have is thine.” Don’t let your inheritance go by default.


“When faith goes to market it always takes a basket.”

Tuesday, December 28, 2021

_*Rejoice*_

_*ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి*_ (ఫిలిప్పీ 4:4). 


*హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట*

*చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి*

*పూలు వికసిస్తున్నాయి*

*పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట*


*కోటి గొంతులు శ్రుతి కలవాలని చూడకు* 

*వినిపిస్తున్నది ఒంటరి పాటే* 

*తెల్లవారి రాగాలాపన మొదలెడుతుంది*

*ఒంటరి కోయిల కంఠస్వరమే.*


*మంచు పట్టిన చలి పొద్దులో* 

*మబ్బుల్నీ చలిగాలినీ చీల్చుకుంటూ* 

*చీకటి కడుపులో చిరుదివ్వె వెలిగిస్తూ* 

*హాయిగా బిగ్గరగా పాట పాడు.*


నీ పాట దేవుడికి వినిపించినప్పుడు ఆయన చిరునవ్వుతో ముందుకి వంగి అతి జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తాడు. తలాడిస్తూ “ప్రియ కుమారా / కుమారీ పాడు, నేను ఆలకిస్తున్నాను. నిన్ను విడిపించడానికి వచ్చాను. నీ భారం నామీద వేసుకుంటాను. నామీద ఆనుకో, నీ దారి తేలికౌతుంది. నేను దాన్ని సరిచేస్తాను” అంటాడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

*Rejoice in the Lord always: and again I say, Rejoice* - (Phil - 4:4)


“Sing a little song of trust,  

Oh, my heart!  

Sing it just because you must,  

As leaves start;  

As flowers push their way through the dust;  

Sing, my heart, because you must.  


“Wait not for an eager throng  

Bird on the bird;  

’Tis the solitary song  

That is heard.  

Every voice at dawn will start,  

Be a nightingale, my heart!  


“Sing across the winter snow,  

Pierce the cloud;  

Sing when mists are drooping low  

Clear and loud;  

But sing sweetest in the dark;  

He who slumbers not will hark.”  


“An’ when He hears yo’ sing, He bends down wid a smile on His kin’ face an’ listens mighty keerful, an’ He says, ’Sing on, chile, I hear, an’ I’m comin’ down to deliver yo’: I’ll tote dat load fer yo’; jest lean hawd on Me and de road will get smoother bime by.”’

Monday, December 27, 2021

_*Iron Saints*_


*ఇనుము అతని ప్రాణమును బాధించెను*_ (కీర్తన 105:18). 


దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుము లాగా దృఢం అయింది. చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడడం, న్యాయంగా రావలసింది రాకపోవడం, ఆత్మలో పొంగే హుషారుకి ఎప్పుడూ ఆనకట్ట పడుతూ ఉండడం ఇవన్నీ దృఢ చిత్తాన్నీ, అచంచల నిశ్చయతనూ, ధీరత్వాన్ని, అన్నిటికి తట్టుకుని నిలబడగలిగే దీక్షనూ ఇస్తాయి. వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే.


శ్రమల నుండి దూరంగా పారిపోకండి. మౌనంగా, ఓపికగా వాటిని సహించండి. వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు. దేవునికి ఉక్కు మనుషులు, ఇనుప కత్తులు, ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలూ కావాలి. ఇనుప పరిశుద్ధులు కావాలి. అయితే మానవ హృదయాన్ని ఇనుము లాగా చెయ్యడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు. గనుక దేవుడు మనుషుల్ని శ్రమలపాలు చేస్తాడు.


నీ జీవితంలోని అతి శ్రేష్ఠమైన సంవత్సరాలు నిస్త్రాణంగా గతించిపోతున్నాయా? అడుగడుక్కీ అపార్థాలూ, ప్రతిఘటనలూ, దూషణలూ ఎదురవుతున్నాయా? నిరుత్సాహ పడవద్దు. ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు. దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చెయ్యడానికి వాడుకుంటున్నాడు. శ్రమలు అనే ఇనుప కిరీటాన్ని ధరించ గలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది. నీ హృదయాన్ని దృఢతరం, ధైర్యవంతం చెయ్యడానికే ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది.


*దారిలోని ఆటంకాలను లెక్కచెయ్యకు*

*చలినీ, రోజంతా వీచే వడగాలుల్నీ పరిగణించకు*

*కుడికి గాని ఎడమకి గాని తిరగకు. రాత్రి నిన్నాప లేదు*

*దారి ఇంటిదారే కాబట్టి తిన్నగా సాగిపోతావు.*

-------------------------------------------------------------------




*His soul entered into iron* - (Ps - 105:18)


Turn that about and render it in our language, and it reads thus, “Iron entered his soul.” Is there not a truth in this? That sorrow and privation, the yoke borne in the youth, the soul’s enforced restraint, are all conducive to an iron tenacity and strength of purpose, and endurance or fortitude, which are the indispensable foundation and framework of a noble character.


Do not flinch from suffering; bear it silently, patiently, resignedly; and be sure that it is God’s way of infusing iron into your spiritual life. The world wants iron dukes, iron battalions, iron sinews, and thews of steel. God wants iron saints; and since there is no way of imparting iron to the moral nature but by letting people suffer, He lets them suffer.


Are the best years of your life slipping away in enforced monotony? Are you beset by opposition, misunderstanding, and scorn, as the thick undergrowth besets the passage of the woodsman pioneer? Then take heart; the time is not wasted; God is only putting you through the iron regimen. The iron crown of suffering precedes the golden crown of glory. And iron is entering into your soul to make it strong and brave. —F. B. Meyer


“But you will not mind the roughness nor the steepness of the way,  

Nor the chill, unrested morning, nor the searness of the day;  

And you will not take a turning to the left or the right,  

But go straight ahead, nor tremble at the coming of the night,  

For the road leads home.”

Sunday, December 26, 2021

No Active Mission


*నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడి*_ (మత్తయి 26:36).


పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు. గెత్సేమనే తోటలో పదకొండు మందిలో ఎనిమిది మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు. ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి. పేతురు, యాకోబు, యోహానులకు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు. మిగతా వాళ్ళంతా దూరంగా ఒక చోట కూర్చున్నారు. ఆ ఎనిమిది మంది చాలా సణుగుకుని ఉంటారను కుంటాను. వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది. అంతే దాన్లోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు. అది అత్యవసర పరిస్థితి. అందరూ అనేక రకాలైన వత్తిడులకి లోనై ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే “ఏమీ చెయ్యకుండా అక్కడ కూర్చోండి.” ఇలాటి అనుభవమే చాలాసార్లు నీకూ నాకూ వచ్చింది కదా. ఆ నైరాశ్యతను మనం చవి చూశాం. సేవ చెయ్యడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి. మన తోటివాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు. మరికొందరు మధ్యను ఉన్నారు. మనం మాత్రం వెనకాల పండుకుని ఉండవలసివచ్చింది. అస్వస్థతో, పేదరికమో, లేక మరో విధంగానో పరిస్థితులు తలక్రిందులు కావడం జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది. మనం చిన్నబుచ్చుకున్నాం. క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులేమిటో మనకి అర్థం కాదు. తోటలోకి మనం ప్రవేశించిన తరువాత కూడా చెయ్యడానికి ఏ పనీ లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది.


"హృదయమా మెదలకుండా ఉండు. నీకర్థమయ్యేదే ఎప్పుడూ వాస్తవం అనుకోకు. క్రైస్తవ జీవితంలో పాలుపంపులు నీకు తప్పకుండా ఉన్నాయి. దేవుని తోటలో నడిచేవాళ్ళే, నిలబడేవాళ్ళే నిజమైన సేవకులు అనుకోకు. నువ్వు కూర్చుని ఉండవలసి వచ్చిన స్థలం కూడా పరిశుద్ధమైనదే.” 


క్రీస్తులో జీవించి ఉండడంలో మూడు రకాలున్నాయి. ముందుకి వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని. మరి కొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్నవాటిని ఇతరులకు తెలియజేస్తుంటాయి. ఇవి రెండూ కాక మూడో రకం పోరాడలేనివి, పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి. ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ 'ఇక్కడే కూర్చుని ఉండండి. ”


నీకిలాటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడనుకో వద్దు. 'ఇక్కడ కూర్చోండి' అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. తోటలో నువ్వు కూర్చుని ఉన్న స్థలంకూడా పరిశుద్ధమైనదే. దాని పేరు 'వేచియుండే చోటు' కొన్ని ఆత్మలు గొప్ప పనులు చెయ్యడానికి గాని, గొప్ప భారాలు వహించడానికి గాని ఈ లోకానికి రావు. అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి. అవి మనుషులు ఎప్పుడూ ఉపయోగించని పూలు. వాటిని ఎవరూ దండగా గుచ్చలేదు. ఏ బల్ల మీదా అవి అలంకారంగా ఉండలేవు. పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు. కాని క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టాయి. వాటి పరిమళం వల్ల, వాటి అందం వల్ల అవి క్రీస్తుకి ప్రియమైనవయ్యాయి. తన అందాన్ని చూసేవాళ్ళెవరూ లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇలాటి పువ్వువైతే సణుక్కోవద్దు.

--------------------------------------------------------------------

*Sit ye here while I go and pray yonder* - (Matt - 26:36)


It is a hard thing to be kept in the background at a time of crisis. In the Garden of Gethsemane eight of the eleven disciples were left to do nothing. Jesus went to the front to pray; Peter, James and John went to the middle to watch; the rest sat down in the rear to wait. Methinks that party in the rear must have murmured. They were in the garden, but that was all; they had no share in the cultivation of its flowers. It was a time of crisis, a time of storm and stress; and yet they were not suffered to work.


You and I have often felt that experience, that disappointment. There has arisen, mayhap a great opportunity for Christian service. Some are sent to the front; some are sent to the middle. But we are made to lie down in the rear. Perhaps sickness has come; perhaps poverty has come; perhaps obloquy has come; in any case we are hindered and we feel sore. We do not see why we should be excluded from a part in the Christian life. It seems like an unjust thing that, seeing we have been allowed to enter the garden, no path should be assigned to us there.


Be still, my soul, it is not as thou deemest! Thou art not excluded from a part of the Christian life. Thinkest thou that the garden of the Lord has only a place for those who walk and for those who stand! Nay, it has a spot consecrated to those who are compelled to sit. There are three voices in a verb—active, passive and neuter. So, too, there are three voices in Christ’s verb “to live.” There are the active, watching souls, who go to the front, and struggle till the breaking of the day. There are the passive, watching souls, who stand in the middle, and report to others the progress of the fight. But there are also the neuter souls—those who can neither fight, nor be spectators of the fight, but have simply to lie down.


When that experience comes to thee, remember, thou are not shunted. Remember it is Christ that says, “Sit ye here.” Thy spot in the garden has also been consecrated. It has a special name. It is not “the place of wrestling,” nor “the place of watching,” but “the place of waiting.” There are lives that come into this world neither to do great work nor to bear great burdens, but simply to be; they are the neuter verbs. They are the flowers of the garden which have had no active mission. They have wreathed no chaplet; they have graced no table; they have escaped the eye of Peter and James and John. But they have gladdened the sight of Jesus. By their mere perfume, by their mere beauty, they have brought Him joy; by the very preservation of their loveliness in the valley they have lifted the Master’s heart. Thou needst not murmur shouldst thou be one of these flowers! —Selected

Saturday, December 25, 2021

Christ our Consolation

 ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు - భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము (మత్తయి 1:22,23).

. . . సమాధానకర్తయగు అధిపతి (యెషయా 9:6). 

గాలిలో పాట మ్రోగింది

నింగిలో తార వెలసింది

తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది.

తార వెలుగులు చిమ్మింది

వెలుగు జీవులు గళమెత్తారు

బేత్లెహేములో పశుల పాక రాజాధిరాజు రాక.


కొన్నేళ్ళ క్రితం ఒక క్రిస్మసు కార్డు చూశాను. దాని మీద 'క్రీస్తు పుట్టకపోయి నట్టయితే' అని రాసి ఉంది. “నేను రాకయున్నచో” అని క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం. ఆ కార్డు మీద ఒక బొమ్మ ఉంది. అదేమిటంటే… ఒక పాస్టర్ గారు క్రిస్మస్ రోజున చిన్న కునుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకోని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు.


ఆ కలలో అతడు తన ఇంట్లో నుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలేమీ లేవు. రక్షించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి క్రీస్తు లేడు. అతడు బయటికి వెళ్లే వీధిలో తల ఎత్తుకుని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు. అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకమూ మాయమైంది.


తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు. ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్య మీద ఉందని, వచ్చి చూడమనీ అన్నాడు. ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వరత్వరగా పాస్టరుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని 'ఇదిగో నిన్ను ఓదార్చేందుకుగాను కొన్ని మాటలు చెప్తాను' అంటూ బైబిలు తెరిచాడు. వాగ్దానాలేమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకీయే ఆఖరు పుస్తకం. సువార్తలు లేవు. రక్షణ లేదు. నిరీక్షణ లేదు. అతడు కూడా తన తలవంచి ఏడుస్తున్న వాళ్ళతో కలసి ఏడవవలసివచ్చింది.


ఆ తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళాడు పాస్టరుగారు. ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పడానికి. మహిమలోకి పునరుత్థానం లేదు. తెరిచి ఉన్న ఆకాశం లేదు. మన్ను మంటిలో, బూడిద బూడిదలో కలిసిపోవడమే. అదే ఆఖరి చూపు. శాశ్వతమైన ఎడబాటు, క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు.


హఠాత్తుగా అతడికి మెలకువ వచ్చింది. ఒక్కసారి అతని నోటిలోనుండి స్తుతులూ, సంతోషగానాలూ వెలువడినాయి. ఎందుకంటే నిద్ర మేలుకొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి.


ఓ సద్భక్తులారా లోకరక్షకుడు

బేత్లెహేమందు నేడు జన్మించెను

రాజాధిరాజు ప్రభువైన క్రీస్తు

నమస్కరింప రండి నమస్కరింప రండి.


ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం. దూత చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం. “ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు” (లూకా 2:10,11).


అన్యజనుల వైపుకి మన హృదయాలను మళ్ళించుదాం. క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తుచేసుకుందాం. “పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి. మధురమైన దాని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసికొననివారికి వంతులు పంపించుడి” (నెహెమ్యా 8:10).

---------------------------------------------------------------------------------------------------------------------------

His name shall be called Emmanuel ... God with us - (Matt - 1:23)

The Prince of Peace - Isa 9:6


“There’s a song in the air!  

There’s a star in the sky!  

There’s a mother’s deep prayer,  

And a baby’s low cry!  

And the star rains its fire  

While the beautiful sing,  

For the manger of Bethlehem cradles a King.”

A few years ago a striking Christmas card was published, with the title, “If Christ had not come.” It was founded upon our Saviour’s words, “If I had not come.” The card represented a clergyman falling into a short sleep in his study on Christmas morning and dreaming of a world into which Jesus had never come.

In his dream he found himself looking through his home, but there were no little stockings in the chimney-corner, no Christmas bells or wreaths of holly, and no Christ to comfort, gladden and save. He walked out on the public street, but there was no church with its spire pointing to Heaven. He came back and sat down in his library, but every book about the Saviour had disappeared.

A ring at the doorbell, and a messenger asked him to visit a poor dying mother. He hastened with, the weeping child and as he reached the home he sat down and said, “I have something here that will comfort you.” He opened his Bible to look for a familiar promise, but it ended at Malachi, and there was no gospel and no promise of hope and salvation, and he could only bow his head and weep with her in bitter despair.

Two days afterward he stood beside her coffin and conducted the funeral service, but there was no message of consolation, no word of a glorious resurrection, no open Heaven, but only “dust to dust, ashes to ashes,” and one long eternal farewell. He realized at length that “He had not come,” and burst into tears and bitter weeping in his sorrowful dream.

Suddenly he woke with a start, and a great shout of joy and praise burst from his lips as he heard his choir singing in his church close by:

“O come, all ye faithful, joyful and triumphant,  

O come ye, O come ye to Bethlehem;  

Come and behold Him, Born the King of Angels,  

O come let us adore Him, Christ, the Lord.”  


Let us be glad and rejoice today, because “He has come.” And let us remember the annunciation of the angel, “Behold I bring you good tidings of great joy, which shall be to all people, for unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord.” (Luke 2:10, 11).

“He comes to make His blessing flow,  

Far as the curse is found.”

May our hearts go out to the people in heathen lands who have no blessed Christmas day. “Go your way, eat the fat, drink the sweet, and SEND PORTIONS TO THEM FOR WHOM NOTHING IS PREPARED.” (Neh. 8:10).

Friday, December 24, 2021

Quiet Time with God

 

సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి... (ఆది 24:63).

మనం ఎంత ఒంటరివాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమౌతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురుచూడాలి. కాని మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడీ, అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పనిచేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది. ప్రశాంతతలోను, నిశ్శబ్దంలోను మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహ లాడుతూ ఉంటాము. మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికీ వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతుంటాము. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటి కంటే లాభకరం. దేవునితో మాట్లాడడం పరలోకం వైపు తదేకంగా చూడడం, ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్ఠమైన వ్యాపకం. 


'ధ్యానముద్ర అనేది మానసిక ఆరాధనా దినం'. మన మనస్సుకి సాధ్యమైనన్నిసార్లు ఈ ఆరాధనా దినాన్ని కల్పిద్దాము. ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచెయ్యక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరచుకుని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనస్సు తడుస్తుంది. మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమీ చెయ్యకుండా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం. ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు.


జాలరివాళ్ళు తమ వలలను బాగుచేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు. గడ్డికోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు. పట్టణాల్లో నివసించేవాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్నిసార్లు జీవితపు హడావుడిల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, తొక్కిసలాటల నుండి దూరంగా, ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది, అది హృదయాలను సేదదీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది. 


నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను. నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాళికి వెళ్ళాను

-----------------------------------------------------------------------------------------------------------------------------

And Isaac went out to meditate in the fields at eventide - (Gen - 24:63)

We should be better Christians if we were more alone; we should do more if we attempted less, and spent more time in retirement, and quiet waiting upon God. The world is too much with us; we are afflicted with the idea that we are doing nothing unless we are fussily running to and fro; we do not believe in “the calm retreat, the silent shade.” As a people, we are of a very practical turn of mind; “we believe,” as someone has said, “in having all our irons in the fire, and consider the time not spent between the anvil and the fire as lost, or much the same as lost.” Yet no time is more profitably spent than that which is set apart for quiet musing, for talking with God, for looking up to Heaven. We cannot have too many of these open spaces in life, hours in which the soul is left accessible to any sweet thought or influence it may please God to send.

“Reverie,” it has been said, “is the Sunday of the mind.” Let us often in these days give our mind a “Sunday,” in which it will do no manner of work but simply lie still, and look upward, and spread itself out before the Lord like Gideon’s fleece, to be soaked and moistened with the dews of Heaven. Let there be intervals when we shall do nothing, think nothing, plan nothing, but just lay ourselves on the green lap of nature and “rest awhile.”

Time so spent is not lost time. The fisherman cannot be said to be losing time when he is mending his nets, nor the mower when he takes a few minutes to sharpen his scythe at the top of the ridge. City men cannot do better than follow the example of Isaac, and, as often as they can, get away from the fret and fever of life into fields. Wearied with the heat and din, the noise and bustle, communion with nature is very grateful; it will have a calming, healing influence. A walk through the fields, a saunter by the seashore, or across the daisy-sprinkled meadows, will purge your life from sordidness, and make the heartbeat with new joy and hope.


“The little cares that fretted me,  

I lost them yesterday,  

… Out in the fields with God.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

Christmas Eve


BELLS ACROSS THE SNOW


O Christmas, merry Christmas,  

Has it really come again,  

With its memories and greetings,  

With its joy and with its pain!  

There’s a minor in the carol  

And a shadow in the light,  

And a spray of cypress twining  

With the holly wreath tonight.  

And the hush is never broken  

By laughter light and low,  

As we listen in the starlight  

To the “bells across the snow.”  


O Christmas, merry Christmas,  

’Tis not so very long  

Since other voices blended  

With the carol and the song!  

If we could but hear them singing,  

As they are singing now,  

If we could but see the radiance  

Of the crown on each dear brow,  

There would be no sigh to smother,  

No hidden tear to flow,  

As we listen in the starlight  

To the “bells across the snow.”  


O Christmas, merry Christmas,  

This never more can be;  

We cannot bring again the days  

Of our unshadowed glee,  

But Christmas, happy Christmas,  

Sweet herald of goodwill,  

With holy songs of glory  

Brings holy gladness still.  

For peace and hope may brighten,  

And patient love may glow,  

As we listen in the starlight  

To the “bells across the snow.”  

—Frances Ridley Havergal

Thursday, December 23, 2021

God's Refreshment

 

నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది (1రాజులు 19:7). 


అలిసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు? తినడానికి ఆహారమిచ్చి నిద్రపొమ్మన్నాడు. ఏలీయా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథంకంటే ముందుగా పరుగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలిసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది. శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి మరి. మనుష్యుల్లో గొప్ప గొప్పవాళ్ళకి కూడా ఏలీయా లాగా బదరీవృక్షం కిందికి చేరవలసిన సమయం వస్తుంటుంది. ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేదదీరుస్తాయి. “నీ శక్తికి మించిన ప్రయాణమిది. నేను నిన్ను బలపరుస్తాను. శారీరకమైన బలహీనతను ఆత్మసంబంధమైన బలహీనతగా ఎంచి దిగులుపడకండి.”


ప్రార్థించడానిక్కూడా ఓపిక లేదు

అలసిన దేహం సొమ్మసిల్లింది

మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన

ఆదమరచి కొంత సేపు నిదురపోవాలి


అలా పడి నిద్రపోతే

దేవుడేమంటాడో

అనుమతి లేకుండా నిద్రలోకి జారితే

ప్రార్థించకుండా పవ్వళిస్తే


క్షమిస్తాడా లేదా? 

ఆలోచించు, నీకు మాటలైనా రాని ప్రాయంలో

నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా?

తన ఒడిలో లాలించి జోల పాడలేదా?


నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో

అడిగే దాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా?

నిద్రలో నీ గగుర్పాటును

తన కౌగిట చేర్చి ఓదార్చ లేదా? 


నీ బాల్యప్రాయంలో చెప్పడం చేతగాని వేళ

ఆ తల్లి ప్రేమ నీకు గుర్తు లేదా?

ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపిక లేని అలసటలో

మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ

నిస్సంకోచంగా పడుకుని విశ్రాంతి తీసుకో

తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిదురపో

నీ పరమతండ్రికి తెలుసు నీ అలసట

పసిపాపలాగా హాయిగా నిదురపో.


తలవాల్చవచ్చా లేదా? అని సందేహం వద్దు

నువ్వు అలిసిపోయిన విషయం తండ్రికి తెలుసు

నోటిమాటల ప్రార్ధనొక్కటే కాదు ఆయన్ని చేరేది

నీ హృదిలోని ప్రేమని చూడగలడాయన.


నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకి తెలుసు

అయితే ప్రార్థించే ఓపిక నీకు ఇప్పుడు లేదని తెలుసు

క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు

ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన.


తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు

కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు

నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు

ఇక భయమే లేకుండా ఆయనలో పవ్వళించు

----------------------------------------------------------------------------------------------------------------------------

The journey is too great for thee - (1 Kgs - 19:7)

And what did God do with His tired servant? Gave him something good to eat, and put him to sleep. Elijah had done splendid work and had run alongside the chariot in his excitement, and it had been too much for his physical strength, and the reaction had come on, and he was depressed. The physical needed to be cared for. What many people want is sleep, and the physical ailment attended to. Some grand men and women get where Elijah was—under the juniper tree! and it comes very soothingly to such to hear the words of the Master: “The journey is too great for thee, and I am going to refresh you.” Let us not confound physical weariness with spiritual weakness.


“I’m too tired to trust and too tired to pray,  

Said one, as the over-taxed strength gave way.  

The one conscious thought by my mind possessed,  

Is, oh, could I just drop it all and rest.  


“Will God forgive me, do you suppose,  

If I go right to sleep as a baby goes,  

Without an asking, if I may,  

Without ever trying to trust and pray?  


“Will God forgive you? why think, dear heart,  

When language to you was an unknown art,  

Did a mother deny you needed rest,  

Or refuse to pillow your head on her breast?  


“Did she let you want when you could not ask?  

Did she set her child an unequal task?  

Or did she cradle you in her arms,  

And then guard your slumber against alarms?  


“Ah, how quick was her mother love to see,  

The unconscious yearnings of infancy.  

When you’ve grown too tired to trust and pray,  

When over-wrought nature has quite a given way:  


“Then just drop it all, and give up to rest,  

As you used to do on a mother’s breast,  

He knows all about it—the dear Lord knows,  

So just go to sleep as a baby goes;  


“Without even asking if you may,  

God knows when His child is too tired to pray.  

He judges not solely by uttered prayer,  

He knows when the yearnings of love are there.  


“He knows you do pray, He knows you do trust,  

And He knows, too, the limits’ of poor weak dust.  

Oh, the wonderful sympathy of Christ,  

For His chosen ones in that midnight tryst,  


“When He bade them sleep and take their rest,  

While on Him the guilt of the whole world pressed—  

You’ve given your life up to Him to keep,  

Then don’t be afraid to go right to sleep.”

Wednesday, December 22, 2021

Night of Pure Faith

 భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా... (ఆది 15:12).


సూర్యాస్తమయమైంది. రాత్రి తన ముసుగును భూమిపై పరచింది. రోజంతా పనిచేసి తనువూ మనస్సూ అలిసిపోయి అబ్రాహాము నిద్రకు ఒరిగాడు. నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది. అతణ్ణి ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారమది. అతని గుండెలపై పీడకల లాగా ఎక్కి కూర్చుంది. ఆ చీకటి చేసే భీభత్సం నీకు కొంచెమైనా తెలుసా? ఏదైనా ప్రగాఢ సంతాపం, తిరిగి కోలుకోనీయకుండా మనస్సుని నొక్కిపట్టినప్పుడు, దేవుని కరుణవల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఊడబెరికేసినప్పుడు, ఆశా కిరణమేమీ లేని నడి సముద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు, ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందర వందర చేసినప్పుడు, ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటినీ ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు విలవిలలాడినప్పుడు ఈ “భయంకరమైన కటిక చీకటి” ఏమిటో అర్థమౌతుంది. మానవ జీవితం నిండా ఇవే. చీకటి వెలుగులు, కొంతసేపు సూర్యుడు, కొంత సేపు మబ్బు నీడ, వీటన్నిటి మధ్య దేవుని న్యాయవిధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది. క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదనే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీదా తన ప్రభావాన్ని చూపిస్తున్నది. దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహా జ్ఞానాన్ని బట్టి, కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు. దిక్కుమాలినవాడై కేకలు పెట్టాడు. అందుమూలంగా మరణమనే గాఢాంధకారపు లోయలో నీతో బాటు తోడుగా ఉండి అవతలి వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు. అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వానిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయన పైనే ఆధార పడదాము. మన లంగరును ఆయనలోనే దించుదాము. ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది. తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది.


సముద్రంపై రేగిన తుపాను తమను యేసునుండి వేరుచేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు. ప్రియ స్నేహితుడా, ఇలాటి సమయాల్లోనే కష్టాల ముల్లు గుచ్చుకుంటుంది. సైతాను నీ చెవిలో ఊదుతాడు. “దేవుడు నిన్ను మర్చి పోయాడు. నిన్ను వదిలేశాడు” అని. నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది. “ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది?” దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకు రావడానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరుచెయ్యడానికి కాదు; నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆత్రుతగా హత్తుకోవాలనే.


దేవుడు మనల్ని వదిలేసాడన్నట్టు కనిపించిన  పరిస్థితుల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగునూ ఆదరణనూ అనుభవిద్దాము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు గాని ఆయన మీదే ఆశపెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం.


విజయం తెచ్చే విశ్వాసం కావాలి

పరాజయం నీ మీద పడనుంటే

కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం

జయధ్వానాల్లోకి నడిపిస్తుంది

అపజయమెరుగని విజయ విశ్వాసం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Lo, a horror of great darkness fell upon him - (Gen - 15:12)

The sun, at last, went down, and the swift, eastern night cast its heavy veil over the scene. Worn out with the mental conflict, the watchings, and the exertions of the day, Abraham fell into a deep sleep, and in that sleep, his soul was oppressed with dense and dreadful darkness, such as almost stifled him and lay like a nightmare upon his heart. Do you understand something of the horror of that darkness? When some terrible sorrow which seems so hard to reconcile with perfect love, crushes down upon the soul, wringing from it all its peaceful rest in the pitifulness of God, and launching it on a sea unlit by a ray of hope; when unkindness and cruelty maltreat the trusting heart, till it begins to doubt whether there be a God overhead who can see and still permit—these know something of the “horror of great darkness.” It is thus that human life is made up; brightness and gloom; shadow and sun; long tracks of cloud, succeeded by brilliant glints of light, and amid all Divine justice is working out its own schemes, affecting others equally with the individual soul which seems the subject of special discipline. O ye who are filled with the horror of great darkness because of God’s dealings with mankind, learn to trust that infallible wisdom, which is co-assessor with immutable justice; and know that He who passed through the horror of the darkness of Calvary, with the cry of forsakenness, is ready to bear you company through the valley of the shadow of death till you see the sun shining upon its further side. Let us, by our Forerunner, send forward our anchor, Hope, within the veil that parts us from the unseen; where it will grapple in-ground and will not yield, but hold until the day dawns, and we follow it into the haven guaranteed to us by God’s immutable counsel. —F. B. Meyer

The disciples thought that that angry sea separated them from Jesus. Nay, some of them thought worse than that; they thought that the trouble that had come upon them was a sign that Jesus had forgotten all about them, and did not care for them. Oh, dear friend, that is when troubles have a sting, when the devil whispers, “God has forgotten you; God has forsaken you”; when your unbelieving heart cries as Gideon cried, “If the Lord be with us, why then is all this befallen us?” The evil has come upon you to bring the Lord nearer to you. The evil has not come upon you to separate you from Jesus, but to make you cling to Him more faithfully, more tenaciously, more simply. —F. S. Webster, M.A.

Never should we so abandon ourselves to God as when He seems to have abandoned us? Let us enjoy light and consolation when it is His pleasure to give it to us, but let us not attach ourselves to His gifts, but to Himself; and when He plunges us into the night of pure faith, let us still press on through the agonizing darkness.


Oh, for the faith that brings the triumph  

When defeat seems strangely near!  

Oh, for a faith that brings the triumph  

Into victory’s ringing cheer—  

Faith triumphant; knowing not to defeat or fear.  

—Herbert Booth

Tuesday, December 21, 2021

The Path to Blessing

 

అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక ... అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదను (ద్వితీ 1:36).


నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టం లేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది. ఆ పనిని చెయ్యకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే.


నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారీ, వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాటా దీవెన మార్గమే. ఈ ఏటవాలు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ దీవెనలు దక్కవు. 


నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధరంగమూ, కత్తిదూసి శత్రువు నెదిరించే ప్రతి సమయమూ విజయవంతమే. నీ జీవితానికి ఆశీర్వాద కారణమే. నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ అందుకు తగిన బలాన్నిచ్చే గుణం ఉంది.


కెరటాలు ఎగిరెగిరిపడుతున్నాయ్

పొగమంచు కమ్ముకొస్తోంది

ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది

ఒక్కడినే ఏమీ చెయ్యలేను

ఇద్దరం కలిస్తే సాధిస్తాం… యేసూ + నేనూ


పిరికివాణ్ణి, దారితప్పిన బలహీనుణ్ణి

రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి

ఈరోజు ఉత్సాహంగా, రేపు నిస్త్రాణంగా

ఆయనైతే పట్టు వదలడు

ఇద్దరం కలిస్తే గెలుస్తాము… యేసూ, నేనూ


నా జీవిత నావను చెలరేగే సంద్రంలో

నాకై నేను నడిపించలేను

నా చెంతను ఉన్నారొకరు

నాతో కలిసి నడిపించేవాడు

ఇద్దరం కలిస్తే నాకు తెలుసు

నావను తీరం చేర్చగలమని… యేసూ, నేనూ.

-----------------------------------------------------------------------------------------------------------------------------

To him will I give the land that he hath trodden upon because he hath wholly followed the Lord - (Deut -1:36)

Every hard duty that lies in your path, that you would rather not do, that it will cost you pain and struggle or sore effort to do, has a blessing in it. Not to do it, at whatever cost, is to miss the blessing.

Every hard piece of road on which you see the Master’s shoe-prints and along which He bids you follow Him surely leads to blessing, which you cannot get if you cannot go over the steep, thorny path.

Every point of battle to which you come, where you must draw your sword and fight the enemy, has a possible victory that will prove a rich blessing to your life. Every heavy load that you are called to lift hides in itself some strange secret of strength. —J. R. Miller

“I cannot do it alone;  

The waves run fast and high,  

And the fogs close all around,  

The light goes out in the sky;  

But I know that we two  

Shall win in the end, Jesus and I.  


“Coward and wayward and weak,  

I change with the changing sky;  

Today so eager and bright,  

Tomorrow too weak to try;  

But He never gives in,  

So we two shall win, Jesus and I.  


“I could not guide it myself,  

My boat on life’s wild sea;  

There’s One who sits by my side,  

Who pulls and steers with me.  

And I know that we two  

Shall safe enter port,  

Jesus and I.”

Monday, December 20, 2021

Dare to Be Alone

 

తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను (యోహాను 16:32).


నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చెయ్యవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నోవాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్నీ, ఒంటరితనాన్నీ వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు, దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్ముకోని ఆకాశం నిరంతరం నిలిచి ఉండేచోట ఉండదలుచుకున్నవాడు, కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే.


పక్షిరాజుకన్న ఒంటరి పక్షి లేదు. ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఎగరవు. రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపేవాళ్ళకి ఇది అనుభవమౌతుంది.


ఇలాటివాళ్ళే దేవుడికి కావాలి. దేవునికి సమీపంగా వెళ్ళి అవతలివైపున ఆయనతో ఒంటరిగా నడవనివాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్ఠమయిన విషయాల్లో పాలు పొందలేరు. హోరేబు పర్వతం మీద అబ్రాహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు. కాని సొదొమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు. ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంటబట్టించుకుని గమలీయేలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవుడు నిన్ను ఒంటరివాణ్ణిగా చెయ్యనియ్యి. అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది. ఇలాటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇక ఆపైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం, ప్రార్థన, విశ్వాసం, ఆదరణలు అవసరం ఉండవు. ఇతరుల నుండి ఇలాటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికీ, క్షేమానికీ అవి అడ్డు బండలౌతాయి. మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు. మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు. అది గడిచిపోయిన తరువాత మనం అంతవరకూ ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధార పడడం మాత్రం మానేస్తాము. ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమౌతుంది.


ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి. షిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఊదాలంటే అతను ఒంటరివాడవ్వాలి. పరలోక దర్శనాలను చూడాలంటే దానియేలు ఏకాంతంగా ఉండాలి. భవిష్యద్దర్శనాలను చూడాలంటే యోహాను పత్మసు లంకకి వెళ్ళాలి.


ఆయన ఒంటరిగా ద్రాక్ష గానుగలో పనిచేశాడు. ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా?

-----------------------------------------------------------------------------------------------------------------------------

Yet I am not alone, because the Father is with me - (John - 16:32)

It need not be said that to carry out conviction into action is a costly sacrifice. It may make necessary renunciations and separations which leave one to feel a strange sense both of deprivation and loneliness. But he who will fly, as an eagle does, into the higher levels where cloudless day abides, and live in the sunshine of God, must be content to live a comparatively lonely life.

No bird is so solitary as the eagle. Eagles never fly in flocks; one, or at most two, ever being seen at once. But the life that is lived unto God, however it forfeits human companionships, knows Divine fellowship.

God seeks eagle-men. No man ever comes into a realization of the best things of God, who does not, upon the Godward side of his life, learn to walk alone with God. We find Abraham alone in Horeb upon the heights, but Lot, dwelling in Sodom. Moses, skilled in all the wisdom of Egypt must go forty years into the desert alone with God. Paul, who was filled with Greek learning and had also sat at the feet of Gamaliel, must go into Arabia and learn the desert life with God. Let God isolate us. I do not mean the isolation of a monastery. In this isolating experience He develops an independence of faith and life so that the soul needs no longer the constant help, prayer, faith or attention of his neighbor. Such assistance and inspiration from the other members are necessary and have their place in the Christian’s development, but there comes a time when they act as a direct hindrance to the individual’s faith and welfare. God knows how to change the circumstances in order to give us an isolating experience. We yield to God and He takes us through something, and when it is over, those about us, who are no less loved than before, are no longer depended upon. We realize that He has wrought some things in us, and that the wings of our souls have learned to beat the upper air.

We must dare to be alone. Jacob must be left alone if the Angel of God is to whisper in his ear the mystic name of Shiloh; Daniel must be left alone if he is to see celestial visions; John must be banished to Patmos if he is deeply to take and firmly to keep “the print of heaven.”

He trod the wine-press alone. Are we prepared for a “splendid isolation” rather than fail Him?

Sunday, December 19, 2021

Call Back

 

ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును (లూకా 21:13). 

జీవితం ఏటవాలు బాట. ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులూపుతూ ఉంటే బావుంటుంది. మనందరం ఎక్కిపోయే వాళ్ళమే. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కొండలెక్కడమన్నది కష్టతరమైనదే గాని మహిమాన్వితమైనది. శిఖరాన్ని చేరాలంటే శక్తి, స్థిరమైన నడక అవసరం. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ దృష్టి విశాలమౌతూ ఉంటుంది. మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్నవాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి.

నాకంటే నువ్వు ముందుకి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్నూ పిలువు. ఈ రాళ్ళ దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్ళను బలపరుస్తుంది. ఒకవేళ విశ్వాస నేత్రం మసకబారితే, దీపంలో నూనె అడుగంటితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమౌతుంది. కేకవేసి చెప్పు, తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం, అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్నవేళ నీకు తోడై ఉన్న విషయం, ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలని కదిలించినవేళ, ప్రశాంత వాతావరణంలోకి ఆ దేవుడు నిన్ను తీసుకుపోయిన విషయం నాకు చెపుతావు కదూ! 

నేస్తం, వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు. నీ జాడ నా కనుమరుగైంది. పందెంలో పాల్గొంటున్నవాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు. కానీ నీకూ, నాకూ మధ్య పొగమంచు పట్టింది. నా కన్ను మసకబారింది. దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను. కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే, పాపపు అంధకారంలోగుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనసు తేలికౌతుంది. ఈ రాళ్ళదారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది.


నేస్తం నువ్వు కాస్తంత ముందున్నావు; నువ్వు వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

It shall turn to you for a testimony - (Luke - 21:13)

Life is a steep climb, and it does the heart good to have somebody “call back” and cheerily beckon us on up the high hill. We are all climbers together, and we must help one another. This mountain climbing is serious business, but glorious. It takes strength and steady step to find the summits. The outlook widens with the altitude. If anyone among us has found anything worth while, we ought to “call back.”


If you have gone a little way ahead of me, call back—  

’Twill cheer my heart and help my feet along the stony track;  

And if, perchance, Faith’s light is dim, because the oil is low,  

Your call will guide my lagging course as wearily I go.  


Call back, and tell me that He went with you into the storm;  

Call back, and say He kept you when the forest’s roots were torn;  

That, when the heavens thunder and the earthquake shook the hill,  

He bore you up and held you where the very air was still.  


Oh, friend, call back, and tell me for I cannot see your face,  

They say it glows with triumph, and your feet bound in the race;  

But there are mists between us and my spirit eyes are dim,  

And I cannot see the glory, though I long for word of Him.  


But if you’ll say He heard you when your prayer was but a cry,  

And if you’ll say He saw you through the night’s sin-darkened sky  

If you have gone a little way ahead, oh, friend, call back—  

’Twill cheer my heart and help my feet along the stony track. 

Saturday, December 18, 2021

More Than Conquerors

 

మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37).


సాక్షాత్తూ నీతో పోరాడే శత్రువులనూ, నీకు ఎదురై నిలిచిన శక్తులనూ దేవుని సన్నిధికి చేరడానికి నీకు సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు. సువార్తలోని సౌకర్యం ఇదే. దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే.

కమ్ముకు వస్తున్న చీకటినీ, నాలుకలు చాపి చెలరేగే మెరుపుల్నీ చూస్తూ కొండల్లో తన గుహ ఎదుట నిశ్చలంగా కూర్చుని ఉంటుంది డేగ. తుఫాను వంక ఒక కంటితో, మళ్ళీ రెండో కంటితో చూస్తూ ఉంటుంది. అయితే పెనుగాలి తనని తాకిన తరువాతనే అది చలిస్తుంది. ఒక్కసారి కూత పెట్టి తన రొమ్మును గాలికెదురుగా తిప్పి ఆ గాలి సాయంతోనే ఆకాశంలోకి ఎగిరిపోతుంది.

తన వాళ్ళందరూ ఇలానే ఉండాలని దేవుని ఆకాంక్ష. వాళ్ళంతా విజేతలై తుఫాను మేఘాలను తమకు రథాలుగా చేసుకోవాలని ఆయన కోరిక. గెలిచిన సైన్యం ఓడిపోయిన సైన్యాన్ని తరుముతుంది. ఆయుధాలనూ, ఆహార పదార్థాలనూ స్వాధీనం చేసుకుంటుంది. పైన చదివిన వాక్యానికి అర్థం ఇదే. దోపుడు సొమ్ము చాలా ఉంది.

నీవు దాన్ని స్వాధీనం చేసుకున్నావా? భయంకరమైన బాధల లోయలోకి నువ్వు వెళ్ళినప్పుడు దోపుడు సొమ్మును తెచ్చుకున్నావా? నీకు ఆ బలమైన గాయం తగిలినప్పుడు నీ సమస్తమూ నాశనమైపోయిందని నీవనుకున్నప్పుడు ఆ స్థితిలో నుండి ఇంకా ధన్యజీవిగా బయటపడేటట్టు క్రీస్తులో నమ్మకముంచావా? శత్రువుల వస్తువుల్ని స్వాధీనం చేసుకుని మనం వాడుకోవాలంటే 'అత్యధిక విజయం' పొందగలిగి ఉండాలి. నిన్ను కూల్చడానికి వచ్చిన ఆయుధాలను జయించి వాటిని నువ్వే వాడుకో.

ఇంగ్లండులో డాక్టర్ మూన్ అనే ఆయన గ్రుడ్డివాడైపోయినప్పుడు ఇలా అన్నాడు, “దేవా గ్రుడ్డితనం అనే ఈ తలాంతును స్వీకరిస్తున్నాను. దీన్ని నీ మహిమ కొరకు వాడగలిగేలా నీ రాకడలో దీన్ని వడ్డీతో సహా నీకు తిరిగి అప్పగించగలిగేలా సహాయం చెయ్యి.” అప్పుడు దేవుడు గ్రుడ్డివాళ్ళకోసం మూన్ అక్షరమాలను కనిపెట్టగలిగే తెలివిని ఆయనకిచ్చాడు. దీని ద్వారా ఎందరో చూపులేనివాళ్ళు దేవుని వాక్యాన్ని చదవగలిగారు. చాలామంది రక్షణ పొందారు.

దేవుడు పౌలుకున్న ముల్లును తీసెయ్యలేదు. అంతకంటే ఎక్కువ మేలే చేశాడు. ఆ ముల్లును వంచి పౌలుకి లోబడేలా చేశాడు. సింహాసనాలు చేసిన సేవకంటే ముళ్ళు చేసిన సేవ శ్రేష్ఠమైనది.

-----------------------------------------------------------------------------------------------------------------------------

In all these things we are more than conquerors through him that loved us - (Rom - 8:37)

The Gospel is so arranged and the gift of God so great that you may take the very enemies that fight you and the forces that are arrayed against you and make them steps up to the very gates of heaven and into the presence of God.

Like the eagle, who sits on a crag and watches the sky as it is filling with blackness, and the forked lightnings are playing up and down, and he is sitting perfectly still, turning one eye and then the other toward the storm. But he never moves until he begins to feel the burst of the breeze and knows that the hurricane has struck him; with a scream, he swings his breast to the storm, and uses the storm to go up to the sky; away he goes, borne upward upon it.

That is what God wants of every one of His children, to be more than conqueror, turning the storm-cloud into a chariot. You know when one army is more than conqueror it is likely to drive the other from the field, to get all the ammunition, the food and supplies, and to take possession of the whole. That is just what our text means. There are spoils to be taken!

Beloved, have you got them? When you went into that terrible valley of suffering did you come out of it with spoils? When that injury struck you and you thought everything was gone, did you so trust in God that you came out richer than you went in? To be more than conqueror is to take the spoils from the enemy and appropriate them to yourself. What he had arranged for your overthrow, take and appropriate for yourself.

When Dr. Moon, of Brighton, England, was stricken with blindness, he said “Lord, I accept this talent of blindness from Thee. Help me to use it for Thy glory that at Thy coming Thou mayest receive Thine own with usury.” Then God enabled him to invent the Moon Alphabet for the blind, by which thousands of blind people were enabled to read the Word of God, and many of them were gloriously saved. —Selected

God did not take away Paul’s thorn; He did better—He mastered that thorn, and made it Paul’s servant. The ministry of thorns has often been a greater ministry to man than the ministry of thrones.

Friday, December 17, 2021

Full Salvation

సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును (1థెస్స 5:23,24).


1771 లో జన్మించిన గొప్ప భక్తుడు జాన్ వెస్లీ ఇలా అన్నాడు. “పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు” అనే విషయం ఎప్పటి నుంచో నాకు తెలుసు. నేను ఈ దారిలో నాతో పరిచయమున్న వాళ్ళందరినీ ఇలానే చెయ్యమని చెబుతూ ఉండేవాణ్ణి. దాదాపు పదేళ్ళ తరువాత అంతకు ముందెన్నడూ లేనంత సూక్ష్మదృష్టిని దేవుడు నాకనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే దైవకుమారుని మీద విశ్వాసం ఉంచడం. వెంటనే అందరికీ ప్రకటించాను. “మనం పాపం నుండి విడిపించబడడం, పరిశుద్ధులు కావడం విశ్వాస మూలంగానే.” దీన్ని నేను ఇంటా బయటా మాట్లాడేటప్పుడూ, రాతల ద్వారానూ నొక్కి వక్కాణించాను. వెయ్యి విధాలైన ఋజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు. గత ముప్పయి సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు (జాన్ వెస్లీ 1771).


“యేసును నేనెరుగుదును. నా ఆత్మకి ఆయన ప్రియుడు, అయితే నా లోపలున్నదేదో ఒక బలహీనత నన్ను మంచిగా ఓర్పుతో, దయతో ప్రవర్తించనియ్యడం లేదు. దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను. సాధ్యపడలేదు. సహాయం చెయ్యమని యేసునడిగాను. నా చిత్తాన్ని ఆయనకప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు. నా ఓర్పుకీ, మంచితనానికీ, కరుణా స్వభావానికి అడ్డుపడే దాన్నంతటినీ తీసేసాడు. ఆపైన ఆయన తలుపు మూసేశాడు.”


హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదిటి మీద పడింది. దాన్లో బలం ఉంది. అది క్రోధపూరితమైనది కాదు. ప్రేమ హస్తం. బాహ్యంగా కాదు ఆంతర్యంలో అది నన్ను స్పృశించింది. నా వ్యక్తిత్వాన్నంతటినీ ఆక్రమించింది. పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది. అది నాలోని అణువణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం, నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి. దాని ప్రభావానికి లోనై నేను నేలమీద పడిపోయి, పట్టరాని ఆనందంతో బిగ్గరగా కేకవేశాను. ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది. కదిలిన చోటల్లా రక్షకుని మహిమా స్వరూపాన్ని నాలో చిత్రిస్తున్నది. కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమసాగరం నన్ను ముంచేసింది. దాని పొంగులు, కెరటాలు నా మీదుగా పొర్లిపారాయి.


పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను. పరిశుద్ధత అంటే  ఒక మధురమైన, ఆహ్లాదకరమైన మృదుగంభీరమైన ఒక ప్రవృత్తి. అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను, ప్రకాశాన్ని, శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది. మనస్సుని దేవుని తోటగా చేస్తుంది. దాన్లో అన్నిరకాల పుష్పాలు, ఫలాలు, చూపులకి ఇంపుగా గలిబిలి లేకుండా, ప్రశాంతంగా, జీవమిచ్చే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి.


ఆపలేని ప్రేమధారలు

అంతరంగంలో ప్రవహించాయి

ఆలోచన, అనుభూతి

ఇప్పుడూ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి

పాపశక్తి నుండి విముక్తి

సంపూర్ణ విమోచన నాకున్నాయి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And the very God of peace sanctify you wholly; and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. Faithful is he that calleth you who also will do it - (1 Thess - 5:23-24)

Many years since I saw that “without holiness no man shall see the Lord.” I began by following after it and inciting all with whom I had intercourse to do the same. Ten years after, God gave me a clearer view than I ever had before of the way to obtain it; namely, by faith in the Son of God. And immediately I declared to all, “We are saved from sin, we are made holy by faith.” This I testified in private, in public, and in print, and God confirmed it by a thousand witnesses. I have continued to declare this for above thirty years, and God has continued to confirm my work. —John Wesley in 1771

“I knew Jesus, and He was very precious to my soul; but I found something in me that would not keep sweet and patient and kind. I did what I could to keep it down, but it was there. I besought Jesus to do something for me, and, when I gave Him my will, He came to my heart, and took out all that would not be sweet, all that would not be kind, all that would not be patient, and then HE shut the door.” —George Fox

My whole heart has not one single grain, this moment, of thirst after approbation. I feel alone with God; He fills the void; I have not one wish, one will, one desire, but in Him; He hath set my feet in a large room. I have wondered and stood amazed that God should make a conquest of all within me by love. —Lady Huntington

“All at once I felt as though a hand—not feeble, but omnipotent; not of wrath, but of love—was laid on my brow. I felt it not outwardly but inwardly. It seemed to press upon my whole being, and to diffuse all through me a holy, sin-consuming energy. As it passed downward, my heart as well as my head was conscious of the presence of this soul-cleansing energy, under the influence of which I fell to the floor, and in the joyful surprise of the moment, cried out in a loud voice. Still the hand of power wrought without and within; and wherever it moved, it seemed to leave the glorious influence of the Saviour’s image. For a few minutes the deep ocean of God’s love swallowed me up; all its waves and billows rolled over me.” —Bishop Hamline

Holiness—as I then wrote down some of my contemplations on it—appeared to me to be of a sweet, calm, pleasant, charming, serene nature, which brought an inexpressible purity, brightness, peacefulness, ravishment to the soul; in other words, that it made the soul like a field or garden of God, with all manner of pleasant fruits and flowers, all delightful and undisturbed, enjoying a sweet calm and the gentle vivifying beams of the sun. —Jonathan Edwards


“Love’s resistless current sweeping  

All the regions deep within;  

Thought and wish and senses keeping  

Now, and every instant clean:  

Full salvation! Full salvation!  

From the guilt and power of sin.”

Thursday, December 16, 2021

Continue in Prayer

 

అన్న అను ఒక ప్రవక్తియుండెను . . . దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను (లూకా 2:36, 37).


ప్రార్థించడం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు. ఎంత తరుచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరమైన, శక్తివంతం అయిన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు.


ప్రార్థన ద్వారా మన దేవుని గొప్పశక్తి మన అందుబాటులోనే ఉంది. కాని దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. అబ్రాహాము తన జీవితకాలమంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సొదొమ కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా?


పెనూయేలు దగ్గర రాత్రంతా యాకోబు తన దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భమనుకుంటున్నారా? మన ప్రభువు గెత్సేమనేకి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ, పెందలకడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా.


తన ఇష్ట ప్రకారం ప్రార్థనా వీరుడినవ్వాలని ఎవరన్నా అనుకుంటే, అతని ప్రయాస అంతా వ్యర్థమే. ఆకాశపు వాకిళ్ళను మూసి, తరువాత వాటిని తెరచి వానలు కురిపించిన ఏలీయా ప్రార్థన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే. క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి. ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి.


హతసాక్షులు మొదలైనవాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్పగొప్ప ప్రార్థనాపరుల పేర్లు బయటికి తెలియవు. అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసినవారే. కృపాసింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులయ్యారు. ప్రార్థన కోసం ప్రార్థించాలి. మన ప్రార్థనలు కొనసాగడం కోసం ప్రార్థించాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And there was Anna, a prophetess ... which departed not from the temple, but served God with fastings and prayers night and day - (Luke - 2:36-37)

No doubt by praying we learn to pray, and the more we pray the oftener we can pray, and the better we can pray. He who prays in fits and starts is never likely to attain to that effectual, fervent prayer which availeth much.

Great power in prayer is within our reach, but we must go to work to obtain it. Let us never imagine that Abraham could have interceded so successfully for Sodom if he had not been all his lifetime in the practice of communion with God.

Jacob’s all-night at Peniel was not the first occasion upon which he had met his God. We may even look upon our Lord’s most choice and wonderful prayer with his disciples before His Passion as the flower and fruit of His many nights of devotion, and of His often rising up a great while before day to pray.

If a man dreams that he can become mighty in prayer just as he pleases, he labors under a great mistake. The prayer of Elias which shut up heaven and afterwards opened its floodgates, was one of long series of mighty prevailings with God. Oh, that Christian men would remember this! Perseverance in prayer is necessary to prevalence in prayer.

Those great intercessors, who are not so often mentioned as they ought to be in connection with confessors and martyrs, were nevertheless the grandest benefactors of the Church; but it was only by abiding at the mercy-seat that they attained to be such channels of mercy to men. We must pray to pray, and continue in prayer that our prayers may continue. —G. H.. Spurgeon

Wednesday, December 15, 2021

Trust and Rest


_*నీవు ఆయనను నమ్ముకొనుము*_ (కీర్తన 37:5). 


'నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాటిది.” ఇది పాత నిబంధనలో కనిపించే మాట. విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు. విశ్వాసం అనే మాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష. విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం.


'నమ్మిక' లో ఇంతకంటే ఎక్కువ అర్థమే ఉంది. దానికి దృష్టి ఉంది. అనుభూతులు ఉన్నాయి. ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది. ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం. కాబట్టి ఆ దేవుని మీద ఇలాటి నమ్మిక ఉంచుదాం. “ఎన్ని ఆలస్యాలు అయినా, కష్టాలు వచ్చిపడినా, నిరాకరణలు ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలమైనా, మార్గం అర్థం కాకపోయినా, సంగతేమిటో తెలియకపోయినా” మార్గం సుగమం అవుతుంది. స్థితిగతులు సుఖాంతమౌతాయి. మబ్బు విడిపోతుంది. నిత్యప్రకాశం నెలకొంటుంది.


*విశ్వాసానికి విషమ పరీక్షలెదురైతే*

*దేవునిలో నీ నమ్మిక ఉంచు.*

*శత్రుభయాన్ని కట్టి పెట్టు నమ్మికతో*

*విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు*


*గూట్లో కుదురుగా కూర్చున్న*

*గువ్వపిల్లలా హాయిగా ఉండు*

*ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి*

*నమ్మకముంచి హాయిగా సేదదీర్చుకో*

--------------------------------------------------------------------

Trust also in him* - (Ps - 37:3)


The word trust is the heart word of faith. It is the Old Testament word, the word given to the early and infant stage of faith. The word faith expresses more the act of the will, the word belief the act of the mind or intellect, but trust is the language of the heart. The other has reference more to a truth believed or a thing expected.


Trust implies more than this, it sees and feels, and leans upon a person, a great, true, living heart of love. So let us “trust also in him,” through all the delays, in spite of all the difficulties, in the face of all the denials, notwithstanding all the seemings, even when we cannot understand the way, and know not the issue; still “trust also in him, and he will bring it to pass.” The way will open, the right issue will come, the end will be peace, the cloud will be lifted, and the light of an eternal noonday shall shine at last.


“Trust and rest when all around thee  

Puts thy faith to sorest test;  

Let no fear or foe confound thee,  

Wait for God and trust and rest.  


“Trust and rest with heart abiding,  

Like a birdling in its nest,  

Underneath His feathers hiding,  

Fold thy wings and trust and rest.”-nd trust and rest.”-

Tuesday, December 14, 2021

Christ's Business is Supreme

ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన - మీరు ప్రార్థన చేయునప్పుడు… నీ రాజ్యము వచ్చును గాక… అని పలుకుడని వారితో చెప్పెను*_ (లూకా 11:1,2). 


మాకు ప్రార్థన చెయ్యడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమనొక్కసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి “ఇలా ప్రార్థించండి” అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకీ దీనికీ ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన “దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్నీ, నా సంఘాన్నీ, మా ఊరినీ, మా దేశాన్నీ దీవించు” ఎక్కడో ఓ మూలను ఆయన రాజ్యం గురించి ఒకమాట అంటామేమో.


ప్రభువైతే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాలు తరువాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకుని, ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించీ, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తరువాత నా కోసం చిన్న రొట్టెముక్కనిమ్మని అడగమంటున్నాడు.


తనకున్నదంతా ఇచ్చేసి, తనకు తానే మన కోసం సిలువపై త్యాగం చేసేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరు స్త్రీ పురుషులూ అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు. క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధానాంశాలనీ, మన వ్యక్తిగత అవసరాలు, మనకెంత ముఖ్యమైనవైనా, ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తరువాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే.


ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ ని ఒక పాప తన ఆల్బమ్ లో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలివి,


*నా హృదయమే నా ఆల్బమ్*

*తుపానుకమ్మి చీకటి మూసి*

*కాంతి విహీనమైన ఆల్బమ్*

*యేసు పేరు దానిపై రాయాలి*

*ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి*

*సౌందర్య లోకాల్ని వీక్షించాలి*

*ఇదే నా ప్రియమైన కోరిక.*


*“ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును”* (లూకా 1:33).


మిషనరీ పని చెయ్యడమన్నది ఈనాటి సంఘాలు తరువాత ఆలోచించి తెలుసుకున్నది కాదు. క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది.

-------------------------------------------------------------------
His disciples said unto him, Lord, teach us to pray ... and he said unto them, When ye pray, say... Thy kingdom come* - (Luke 11:1-2)


When they said, “Teach us to pray,” the Master lifted His eyes and swept the far horizon of God. He gathered up the ultimate dream of the Eternal, and, rounding the sum of everything God intends to do in the life of man, He packed it all into these three terse pregnant phrases and said, “When you pray, pray after this manner.”


What a contrast between this and much praying we have heard. When we follow the devices of our own hearts, how runs it? “O Lord bless me, then My family, My church, My city, My country,” and away on the far fringe as we close up, there is a prayer for the extension of His Kingdom throughout the wide parish of the world.


The Master begins where we leave off. The world first, my personal needs second, is the order of this prayer. Only after my prayer has crossed every continent and every far-flung island of the sea, after it has taken in the last man in the last backward race, after it has covered the entire wish and purpose, of God for the world, only then am I taught to ask for a piece of bread for myself.


When Jesus gave His all, Himself for us and to us in the holy extravagance of the Cross, is it too much if He asks us to do the same thing? No man or woman amounts to anything in the kingdom, no soul ever touches even the edge of the zone of power, until this lesson is learned that Christ’s business is the supreme concern of life and that all personal considerations, however dear or important, are tributary thereto. —Dr. Francis


When Robert Moffat, the veteran African missionary and explorer, was asked once to write in a young lady’s album, he penned these lines:


“My album is a savage breast,  

Where tempests brood and shadows rest,  

Without one ray of light;  

To write the name of Jesus there,  

And see that savage bow in prayer,  

And point to worlds more bright and fair,  

This is my soul’s delight.”


“And His Kingdom shall have no frontier” (Luke 1:33, the old Moravian version).


The missionary enterprise is not the Church’s afterthought; it is Christ’s forethought; —Henry van Dyke

Monday, December 13, 2021

When We're in the Dark

అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను ... నీకిచ్చెదను*_ (యెషయా 45:3).


బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్థమైన లేసును అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలోనుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతులమీద పడేలా కూర్చుని ఉంటాడు. ఈ పద్ధతివల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోను, డిజైను వెలుగులోను ఉంటే అందమైన లేసు తయారవుతుందట.


మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైను మనకి కనబడదు. మనకి అనుభవమౌతున్నదాన్లో ఏమీ అందం, ఉపయోగం కనబడవు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి, అలసటకి తావియ్యక అనుమానం లేక విశ్వాసంలో, ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధలోనుండి, కన్నీళ్ళలోనుండి అందాన్ని సృష్టిస్తాడు.


*దేవుని సంకల్పమనే మగ్గాలు తిరుగుతున్నాయి*

*ఆయనకిష్టమైన నేత నేస్తున్నాయి*

*వచ్చే మడతల్నీ, కలిసే నల్లదారాలనీ అయిష్టంగా చూడకు*

*ఆ నల్లదారాల వెంట బంగారుతీగె ఉంది.*


*ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు*

*తుడుచుకో నీళ్ళు నిండిన నీ కళ్ళు* 

*దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు*

*ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు.*

------------------------------------------------------------------

I Will give thee the treasures of darkness* - (Isa - 45:3)


In the famous lace shops of Brussels, there are certain rooms devoted to the spinning of the finest and most delicate patterns. These rooms are altogether darkened, save for a light from one very small window, which falls directly upon the pattern. There is only one spinner in the room, and he sits where the narrow stream of light falls upon the threads of his weaving. “Thus,” we are told by the guide, “do we secure our choicest products. Lace is always more delicately and beautifully woven when the worker himself is in the dark and only his pattern is in the light.”


May it not be the same with us in our weaving? Sometimes it is very dark. We cannot understand what we are doing. We do not see the web we are weaving. We are not able to discover any beauty, any possible good in our experience. Yet if we are faithful and fail not and faint not, we shall some day know that the most exquisite work of all our life was done in those days when it was so dark.


If you are in the deep shadows because of some strange, mysterious providence, do not be afraid. Simply go on in faith and love, never doubting. God is watching, and He will bring good and beauty out of all your pain and tears. —J. R. Miller


The shuttles of His purpose move  

To carry out His own design;  

Seek not too soon to disapprove  

His work, nor yet assign  

Dark motives, when, with silent tread,  

You view some sombre fold;  

For lo, within each darker thread  

There twines a thread of gold.  


Spin cheerfully,  

Not tearfully,  

He knows the way you plod;  

Spin carefully,  

Spin prayerfully,  

But leave the thread with God.  


—Canadian Home Journal

Sunday, December 12, 2021

Fight the Good Fight

 

నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని (2 తిమోతి 4:6,7). 


సైనికులు ముసలితనంలో తమ ఇళ్ళకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నామో అక్కడ దేవుని కరుణ గురించి, విశ్వాస్యత గురించి, మనల్ని ఆయన శ్రమల్లోనుంచి నడిపించిన దానిని గురించీ చెప్పుకుంటాము. ధవళవస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి ఇతడు తప్ప మిగిలిన వాళ్ళంతా మహా శ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్నవాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు గదా?


నీ సంగతేమిటి? దుఃఖమంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇడుగో అని నీవైపు చెయ్యెత్తి ఎవరైనా చూపించడం నీకు ఇష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరివౌతావు. పోరాటంలో పాల్గొనాలి. ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది.


పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడిని డాక్టరు అడిగాడు “నీకు గాయం ఎక్కడ అయింది?” ఆ సైనికుడు జవాబిచ్చాడు "శిఖరం పైన. " తన శరీరంపైనున్న గాయం మాటే మర్చిపోయాడతను. పోరాటమే గుర్తుంది. తాను కూలిపోయిన చోటే గుర్తుంది. తమ గెలుపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. 'శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తిచేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను' అంటూ సింహనాదం చేద్దాము.


నీ పని సంపూర్ణం చెయ్యి

ఆ పైన విశ్రమించు

విశ్రాంతి దేవుడిచ్చేదే

ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు

దేవుడు నీ దగ్గర పతకాలూ,

డిగ్రీలూ ఉన్నాయా అని చూడడు

నీ గాయపు మచ్చల్ని చూస్తాడు.


ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం

అతని వీరఖడ్గానికి

అలంకారాలేం లేవు

అన్నీ గంట్లు తప్ప


సేవలో తనకి సంక్రమించిన గాయపు మచ్చలు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన నష్టాలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

The last drops of my sacrifice are falling; my time to go has come. I have fought in the good fight; I have kept the faith (2 Tim - 4:6-7)

As soldiers show their scars and talk of battles when they come at last to spend their old age in the country at home, so shall we in the dear land to which we are hastening, speak of the goodness and faithfulness of God who brought us through all the trials of the way. I would not like to stand in the white-robed host and hear it said, “These are they that came out of great tribulation, all except one.”

Would you like to be there and see yourself pointed at as the one saint who never knew a sorrow? Oh, no! for you would be an alien in the midst of the sacred brotherhood. We will be content to share the battle, for we shall soon wear the crown and wave the palm. —C. H. Spurgeon

“Where were you wounded?” asked the surgeon of a soldier at Lookout Mountain. “Almost at the top,” he answered. He forgot even his gaping wound—he only remembered that he had won the heights. So let us go forth to higher endeavors for Christ and never rest till we can shout from the very top, “I have fought a good fight, I have finished my course, I have kept the faith.”

“Finish thy work, then rest,  

Till then rest never;  

The rest for thee by God  

Is rest forever.”  


“God will not look you over for medals, degrees or diplomas but for scars.”


Of an old hero the minstrel sang—


“With his Yemen sword for aid;  

Ornament it carried none,  

But the notches on the blade.”


What nobler decoration of honor can any godly man seek after than his scars of service, his losses for the crown, his reproaches for Christ’s sake, his being worn out in his Master’s service!