Monday, January 31, 2022

Refreshing Dew

 

చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును (హోషేయ 14:5) 

మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం! భూమిని నూతన పరచడానికి ఇది ప్రకృతి అందించే కానుక. మంచు రాత్రిలో కురుస్తుంది. ఇది లేకుంటే మొక్కలు ఎదగవు. బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది. దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు. ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు. తీతు 3:5లో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్ముని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది. "పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయును."

చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచు కున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు. అందువల్ల వాళ్లలో స్వచ్ఛత, చురుకుదనం ఉండవు. ఆధ్యాత్మిక మంచు లేకపోవడంతో వాళ్ల ఆత్మలు తోటకూరకాడల్లాగా వేలాడుతూ ఉంటాయి. 

నాతోటి సేవకులారా, భోజనం చేయకుండా శ్రమించి పని చేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా. అలానే పరలోకపు మన్నాను తినకుండా తన తోటివారికి వాక్య పరిచర్య చేయబూనుకునేవాళ్ల గతి కూడా అంతే. అప్పుడప్పుడూ ఆత్మీయాహారం తీసుకుంటామంటే కుదరదు. ప్రతినిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి. నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికీి, నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికీ తేడా నీకే తెలుస్తుంది గదా. నిశ్చలమైన ధ్యానం, వాక్యాన్ని వంటబట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి. రాత్రివేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నపుడు వాటి రంద్రాలు తెరుచుకుని ఆకాశపు మంచును జుర్రుకుంటాయి. ఆత్మసంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానంవల్ల నీ మీద కురుస్తుంది. ఆయన సన్నిధిలో ధ్యాన ముద్ర వహించు. తొందరపాటు మంచును అడ్డగిస్తుంది. నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు. ఆ పైన నీ విధి నిర్వహణకు తాజాదనంతో క్రీస్తులో చురుకుదనంతో ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు.  

వేడిమి గాని, గాలి గాని ఉన్నపుడు మంచు కురవదు, వాతావరణం చల్లారాలి.  గాలి స్తంభించాలి. పరిసరాలన్నీ చల్లగా, నిశ్చలంగా అయిపోతేనే గాని గాలిలోని తేమ మంచు ముత్యాలుగా మారి ఆకులమీద, పువ్వుల మీద కురవదు. అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా, నిశ్చలంగా ఉన్నపుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోకి దిగి వస్తాడు.


నీ నిశ్చలత్వపు మంచు కురిపించు

ప్రభూ నా అసహనాన్ని ఖండించు

కదులుతూ మెదులుతూ కలవరపడే

నా మనస్సులో నీ శాంతిని స్థాపించు


కోరికలతో వేసారిన నా హృదయంలోకి

నీ చల్లని ఊపిరి పంపించు

భూకంప అగ్నిజ్వాలల్లో

వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు

-----------------------------------------------------------------------------------------------------------------------------

I will be as the dew unto Israel - (Hos - 14:5 )

     The dew is a source of freshness. It is nature’s provision for renewing the face of the earth. It falls at night, and without it, the vegetation would die. It is this great value of the dew which is so often recognized in the Scriptures. It is used as the symbol of spiritual refreshing. Just as nature is bathed in dew, so the Lord renews His people. In Titus 3:5 the same thought of spiritual refreshing is connected with the ministry of the Holy Ghost—“renewing of the Holy Ghost.”

    Many Christian workers do not recognize the importance of the heavenly dew in their lives, and as a result, they lack freshness and vigor. Their spirits are drooping for lack of dew.

    Beloved fellow-worker, you recognize the folly of a laboring man attempting to do his day’s work without eating. Do you recognize the folly of a servant of God attempting to minister without eating the heavenly manna? Nor will it suffice to have spiritual nourishment occasionally. Every day you must receive the renewing of the Holy Ghost. You know when your whole being is pulsating with the vigor and freshness of Divine life and when you feel jaded and worn. Quietness and absorption bring the dew. At night when the leaf and blade are still, the vegetable pores are open to receive the refreshing and invigorating bath; so spiritual dew comes from quiet lingering in the Master’s presence. Get still before Him. Haste will prevent your receiving the dew. Wait before God until you feel saturated with His presence; then go forth to your next duty with the conscious freshness and vigor of Christ.  —Dr. Pardington

    Dew will never gather while there is either heat or wind. The temperature must fall, and the wind ceases, and the air come to a point of coolness and rest—absolute rest, so to speak—before it can yield up its invisible particles of moisture to bedew either herb or flower. So the grace of God does not come forth to rest the soul of man until the still point is fairly and fully reached.

“Drop Thy still dews of quietness,

Till all our strivings cease:

Take from our souls the strain and stress;

And let our ordered lives confess

The beauty of Thy peace.


“Breathe through the pulses of desire

Thy coolness and Thy balm;

Let sense be dumb, its beats expire:

Speak through the earthquake, wind, and fire,

O still small voice of calm!”

Sunday, January 30, 2022

Unshaken in Christ

 

దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు (కీర్తన 46: 5)

“దానికి చలనము లేదు” అనే మాట ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం, మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపొస్తలుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకి వెళ్ళబోతున్నపుడు అక్కడ తన కోసం “బంధకములు, శ్రమలు" కాచుకొని ఉన్నాయని తెలిసినా “ఈ విషయాలేమీ నన్ను కదిలించవు" అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ, అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయాయి. ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశలను గానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలచుకున్నదాన్ని చెయ్యనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు గాని, బాధ పెట్టే బరువైన శ్రమలు గానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్నవాళ్ళకి బహుమానం ఇదే.

“జయించేవాడిని నా దేవుని మందిరంలో మూలస్థంభంగా చేస్తాను. అతణ్ణి అక్కడినుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు." దేవుని గుడిలో స్థంభంగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి.


దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సీయోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ, ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తీ ఇవ్వలేదు. ఏ శక్తీ లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు కూడా మనుషుల హృదయాలు ఆకులా వణికిపోతాయెందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్టించడమే కదా కావలసింది.


ప్రభువులో విశ్వాసముంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా కదలక సిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది

నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు

సీయోను శిఖరంలా నిలబడతారు నిండుగా

అది తొణకదు బెణకదు గడగడ వణకదు 

ఇనుములా, ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా

-----------------------------------------------------------------------------------------------------------------------------

God is in the midst of her; she shall not be moved: God shall help her, and that right early - (Ps  - 46:2,3,5)

    “Shall not be moved”—what an inspiring declaration! Can it be possible that we, who are so easily moved by the things of earth, can arrive at a place where nothing can upset us or disturb our calm? Yes, it is possible; and the Apostle Paul knew it. When he was on his way to Jerusalem where he foresaw that “bonds and afflictions” awaited him, he could say triumphantly, “But none of these things move me.” Everything in Paul’s life and experience that could be shaken had been shaken, and he no longer counted his life, or any of life’s possessions, dear to him. And we, if we will but let God have His way with us, may come to the same place, so that neither the fret and tear of little things of life nor the great and heavy trials, can have the power to move us from the peace that passeth understanding, which is declared to be the portion of those who have learned to rest only on God.

    “He that overcometh will I make a pillar in the temple of my God, and he shall go no more out.” To be as immovable as a pillar in the house of our God, is an end for which one would gladly endure all the shakings that may be necessary to bring us there!  —Hannah Whitall Smith

    When God is amid a kingdom or city He makes it as firm as Mount Zion, that cannot be removed. When He is amid a soul, though calamities throng about it on all hands, and roar like the billows of the sea, yet there is a constant calm within, such a peace as the world can neither give nor take away. What is it but want of lodging God in the soul, and that in His stead the world is in men’s hearts, that makes them shake like leaves at every blast of danger?  —Archbishop Leighton

    “They that trust in the Lord shall be as mount Zion, which cannot be removed, but abideth for ever.” There is a quaint old Scottish version that puts iron into our blood:


“Who sticketh to God in stable trust

As Zion’s mount, he stands full just,

Which moveth no whit, nor yet doth reel,

But standeth forever as stiff as steel!”

Saturday, January 29, 2022

The Harp

 దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను (2 కొరింథీ 11:2)

అనుభవం గల వైణికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు! పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతుంటాడు. అతని జీవితమంతా దానితోనే ముడిపడి ఉంది. కాని దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి, దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారి గట్టిగా మీటుతాడు. అది నొప్పిలో ఉన్నట్లు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దాని పైకి వంగి ఆ నాదాన్ని వింటాడు. దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు. అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మీటుతాడు. అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు.


దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు. ఏ వైణికుడూ తన వీణెను ప్రేమించనంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో అన్నీ అపశ్రుతులే. నీ హృదయతంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు. నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు. నువ్వు బాధలో కోపంగా, కరుకుగా గొణుగుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది. అయినప్పటికీ 'నాది కాదు ప్రభూ, నీ చిత్తమే సిద్ధించుగాక' అనే స్వరం వినిపించేదాకా ఈ శ్రుతి చెయ్యడం చాలించడు. ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైనది. నీ హృదయం బుద్ధితెచ్చుకుని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను, రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు.


వేయి తీగెల వీణ పలికే రాగాలు 

ప్రేమస్వరాల్లో మారుమ్రోగే సరాగాలు

ఆ మధురిమను బాధ పరిచే అపశ్రుతులు 

తెగిన తీగెల విషాద గతులు


ప్రేమ తరంగాలున్నాయి అశ్రు నయనాల్లో 

కిరీటముంది సిలువ మోసిన చేతుల్లో

శ్రమించనివాడు విజేత కాలేడు

కష్టపడనివాడు విశ్రాంతి పొందలేడు 


దౌర్భాగ్యపు కన్నీళ్లు, ఆనందభాష్పాలూ 

కావాలంటే రెండూ కోరుకో 

లేకుంటే ఏ ఒక్కటీ దక్కదు 

ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం

-----------------------------------------------------------------------------------------------------------------------------

For I am jealous for you with a godly jealousy, because I promised you in marriage to one husband, to present you as a pure virgin to Christ - (2 Cor - 11:2 )

How an old harper dotes on his harp! How he fondles and caresses it, as a child resting on his bosom! His life is bound up in it. But, see him tuning it. He grasps it firmly, strikes a chord with a sharp, quick blow; and while it quivers as if in pain, he leans over intently to catch the first note that rises. The note, as he feared, is false and harsh. He strains the chord with the torturing thumb-screw; and though it seems ready to snap with the tension, he strikes it again, bending down to listen softly as before, till at length you see a smile on his face as the first true tone trembles upward.

So it may be that God is dealing with you. Loving you better than any harper loves his harp, He finds you a mass of jarring discords. He wrings your heartstrings with some torturing anguish; He bends over you tenderly, striking and listening; and, hearing only a harsh murmur, strikes you again, while His heart bleeds for you, anxiously waiting for that strain—“Not my will, but thine be done”—which is melody sweet to His ear as angels’ songs. Nor will He cease to strike until your chastened soul shall blend with all the pure and infinite harmonies of His own being. —Selected.

“Oh, the sweetness that dwells in a harp of many strings,

While each, all vocal with love in a tuneful harmony rings!

But, oh, the wail and the discord, when one and another is rent,

Tensionless, broken and lost, from the cherished instrument.


“For rapture of love is linked with the pain or fear of loss,

And the hand that takes the crown must ache with many a cross;

Yet he who hath never a conflict, hath never a victor’s palm,

And only the toilers know the sweetness of rest and calm.


“Only between the storms can the Alpine traveler know

Transcendent glory of clearness, marvels of gleam and glow;

Had he the brightness unbroken of cloudless summer days,

This had been dimmed by the dust and the veil of a brooding haze.


“Who would dare the choice, neither or both to know,

The finest quiver of joy or the agony thrill of woe!

Never the exquisite pain, then never the exquisite bliss,

For the heart that is dull to that can never be strung to this.”

Friday, January 28, 2022

Peter


మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును*_ (1 పేతురు 5:10) క్రీస్తుతో మనం ఏదైనా కొత్త సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని సంతృప్తిపర్చుకోవాలి. అందుకుతగ్గ మనోవికాసం మనకి ఉండాలి. ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిపోతుంది. ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని, ఆ సమర్పణను, ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి. ఒక చెట్టు నేలలో నాటుకుని ఉన్నట్టు, వివాహవేదిక మీద వధువు వరునికి శాశ్వతంగా అంకితమైనట్టు మరి తిరుగులేకుండా ఒకేసారి బేషరతుగా ఇది జరిగిపోవాలి. ఆపైన స్థిరపడి, బలపడి పరీక్షల నెదుర్కొనడానికి కొంతకాలం పడుతుంది. ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి. డాక్టరు విరిగిన చెయ్యిని అతకడంలాటిదే ఇది. దాన్ని చెక్కముక్కల మధ్య అటూ ఇటూ కదలకుండా ఉంచుతారు. దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలిదశల్లో చంచలులు కాకుండా ఉండడానికి తన ఆత్మ సంబంధమైన పిండికట్టు వాళ్ళచుట్టూ కడతాడు. ఇది మనకి కష్టంగా ఉండవచ్చు గాని "తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.” పాపానికి, రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది. పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగితే, ఇక అంతే. శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది. అయితే ఆత్మీయ జీవనానికి, భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది. క్రీస్తులో ఉంటే మనం వర్థిల్లుతాము. ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్వీర్యం చేసి, దానికధికారం లేకుండా చేస్తుంది. కాని దీన్ని చెయ్యడానికి మనకి నిజమైన ఆత్మశక్తి, దృఢ నిశ్చయం, అలవడిన విశ్వాసం, స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి. మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తిలాటితే ఇది కూడా. యంత్రానికున్న బెల్టు తిరుగుతూనే ఉండాలి. శక్తి ఎప్పుడూ అక్కడ ఉంటుంది. కాని దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలకు బెల్టు వేసి కలపాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటరులోని శక్తి మిగతా యంత్రాలన్నిటినీ తిప్పుతుంది. ఎన్నుకోవడం, నమ్మడం, కట్టుబడి ఉండడం, దేవునితో నిలకడగా నడిచి వెళ్ళడం వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలున్నాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి, స్వస్థపరచడానికి అవసరం

Thursday, January 27, 2022

Deuteronomy

 

దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను . . . స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము*_ (ద్వితీ 2:31)

దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది. దీనికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహసం కోల్పోతూ ఉంటాము. మన జీవితాల్లో కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే మన తొందరపాటు, దుడుకుతనం వల్లనే. ఒక ఫలం పండే దాకా మనం ఉండలేం. పచ్చిగా ఉన్నపుడే తుంచెయ్యాలని చూస్తాము. మన ప్రార్థనలకు జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేం. మనం అడిగేవి పొందడానికి మనకి చాలా సంవత్సరాల పాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము. దేవునితో నడవాలనుకుంటాము. బాగానే ఉంది. కానీ దేవుడు ఒక్కోసారి చాలా మెల్లిగా నడుస్తాడు. అంతేకాదు, దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా.   ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరచిన ఆశీర్వాదాలను పొందము. దేవుని సమయం కోసం ఎదురు చూడకపోయినా, సమయం వచ్చినప్పటికీ అలా ఎదురుచూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సుని చేతులారా జారవిడుచుకుంటాము. కదలక ఊరికే కూర్చోవడంలో ఒక్కోసారి మనకి లాభం కలుగుతుంది. ఒక్కోసారి సంకోచంలేని అడుగులతో ముందుకి సాగవలసి ఉంటుంది. మనం చెయ్యవలసిన పనిని ముందు మనం మొదలు పెట్టిన తరువాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. మనం లోబడడం మొదలుపెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెడతాడు. అబ్రాహాముకి చాలా వాగ్దానాలు చేసాడు దేవుడు. కాని అబ్రాహాము కల్దీయుల దేశంలోనే ఆగిపోయినట్టయితే అవేవీ నిజమయ్యేవి కావు. అబ్రాహాము తన దేశాన్నీ, బంధువులనీ, ఇంటినీ వదిలి, కొత్త దారులగుండా ప్రయాణాలు చేసి, తొట్రుపడని విధేయతతో సాగవలసి ఉంది. అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి. పదిమంది కుష్టరోగుల్ని ప్రభువు ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాల్ని చూపెట్టుకోండి అని. “వాళ్ళు వెళ్తూ ఉండగా” వాళ్ళ శరీరాలు బాగయ్యాయి. తమ దేహాలు పరిశుద్ధమయ్యే దాకా కదలకుండా ఉన్నట్టయితే వాళ్ళపట్ల ఆ అద్భుతం అసలు జరిగేది కాదు. వాళ్ళని బాగుచెయ్యాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు. వాళ్ళ విశ్వాసం పనిచెయ్యడం మొదలుపెట్టినప్పటినుంచి ఆ దీవెన వాళ్ళలో పనిచెయ్యడం ప్రారంభించింది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే “మీరు సాగిపోవుడి.” ఇక వేచి ఉండడం వాళ్ళ పనికాదు. లేచి సాహసోపేతమైన విశ్వాసంతో ముందుకి వెళ్ళడమే. వాళ్ళ విశ్వాసాన్ని ప్రదర్శించమని మరోసారి ఆజ్ఞ అయింది -యొర్దాను నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీదుగా నడిచి వెళ్ళమని. వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాలకున్న తాళాన్ని తీసే తాళపుచెవి వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచే దాకా అది తెరుచుకోలేదు. ఆ తాళంచెవి విశ్వాసమే. మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది. మనం యుద్ధరంగంలోకి దూకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షంగా పోరాడుతాడు. ఆయనలో మనం జయశాలులం. కాని మనం వణకుతూ, సందేహిస్తూ మన సహాయకుడు వచ్చే దాకా యుద్ధం మొదలుపెట్టం అని కూర్చుంటే ఆ ఎదురు తెన్నులకి అంతం ఉండేది కాదు. ఇది విశ్వాసంతో సమయానికి మించి ఎదురు చూడడం. దేవుడు నీ మీద తన పరమాశీర్వాదాలను కురిపించాలని ఎదురు చూస్తున్నాడు. ధైర్యంతో కూడిన నిరీక్షణతో ముందుకి వెళ్ళి నీ హక్కును దక్కించుకో. “నేను ఇవ్వడం మొదలుపెట్టాను, స్వాధీనపర్చుకోవడం మొదలుపెట్టు.”

Wednesday, January 26, 2022

Psalm

 నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును*_ (కీర్తన 23:4)

మా నాన్నగారిది ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో మా ఇంట్లో ఒక చిన్న అల్మెరా ఉంది. దాన్లో తరతరాలుగా మా పూర్వికులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి. సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ యింట్లో ఉంటుంటాము. అక్కడుండేటప్పుడు నేను, మా నాన్నగారు షికారుకి వెళ్తూ అల్మెరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాల్లో దుడ్డుకర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది.  యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్రలాగా ఆదరించేది. “చెడు వర్తమానమునకు అతడు భయపడడు. అతని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగానున్నది.” మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది. వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది. “రాత్రంతయు విలాపముండెను. ఉదయముతోపాటు ఆనందము వచ్చెను.” నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరంపాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి ఇంటికివెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి. నాతోబాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్ళాను. అది నన్నెప్పుడు ఆదరించక మానలేదు. “నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియును. అవి మేలుకేగాని కీడు చేయునవి కావు.” ప్రమాదం, లేక అనుమానం అలుముకున్న సమయంలో, సమస్య మానవ జ్ఞానానికి అందకుండాపోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకి సాగిపోవడం నాకు తేలికైంది. “ఊరకుండుటయందే వారికి బలము కలదు.” అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది. “తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి.” మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది, “దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాక పోయినట్టయితే, ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయనీ, ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు. క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది. అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది. దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు. *దేవుడెప్పుడూ తన దండంతోపాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు.* _*“నీ కమ్ములు (పాదరక్షలు) ఇనుపవియు, ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి (బలము) కలుగును”*_ (ద్వితీ 33:25) రాతిబండలున్న దారిగుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహముగా నమ్ముదాం. మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికీ పంపడు.

Tuesday, January 25, 2022

Genesis

 

తన అరకాలు నిలుపుటకు దానికి (నల్లపావురమునకు) స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగివచ్చెను… సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటనుండెను*_ (ఆది 8:9-11)

మనకి ప్రోత్సాహాన్నివ్వకుండా ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలో, ఎప్పుడు సూచక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు. ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడమన్నది ఎంత ధన్యత! ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామనే ఋజువులేమీ కనిపించనప్పుడు ఇదే మన కర్తవ్యం. కంటికి కనిపించే సూచనలన్నిటికన్నా తానిచ్చిన మాట, మనల్నెప్పుడూ గుర్తుంచుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినదీ, ఎన్నదగినదీ అని మనం గ్రహించాలని ఆయన ఉద్దేశం. ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అదీ మంచిదే. అది లేకుండా ఆయన్ని నమ్మిన మనం అది కనిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని స్తుతిస్తాము. ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మినవాళ్ళు ఆయన్నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమ బహుమానాలు పొందుతారు. *తుపాను మబ్బులు చుట్టూరా కమ్మితే* *పరలోక స్వరం మూగవోతే* *నమ్మండాయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు* *దుఃఖం, శ్రమలు, బాధ దగ్గరైనా* *అతి చేరువైన ఆత్మీయులు దూరమైనా* *స్తుతించండి ఆయనున్నాడు మనకి* *దారి కష్టమైనా, బ్రతుకు నిష్టూరమైనా* *భయంతో మన కళ్ళకి మసకలు కమ్మినా* *చెంతనున్నాడు చేతిలో చెయ్యి వెయ్యండి* *దారులన్నీ మూసుకుపోయినా* *అందమంతా అణగారినా* *మనతో ఉంటాడు నమ్మి విశ్రమించండాయనలో* ఆలస్యాలు తిరస్కారాలు కావు. మన ప్రార్ధనలన్నీ ఆయన రిజిస్టరులో రాసుకుంటాడు. వాటికింద రాసుకుంటాడు, “దీని సమయం ఇంకా రాలేదు” అని. దేవుడికి ఒక సమయం, ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి. మన ఉనికిని నిర్దేశించినవాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేశాడు.

Monday, January 24, 2022

A Very Present Help

 

యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? (కీర్తన 10:1)

బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు. కాని బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు, మన మీద పడుతున్న వత్తిడి తనకేమీ పట్టదన్నట్టు. మనం ఆ బాధలు పడడానికి అనుమతిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము. కాని ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని, మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంతా చీకటి. మన కళ్ళకి గంతలు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును గాని ఆయన మన దగ్గరే ఉన్నాడు. కనిపించే దానిమీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధి “తెరలో ఉన్నట్టు” ఉన్నప్పటికీ, ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే, నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు. నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నువ్వు సొరంగంలోంచి వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు.


దారి తెలియకపోతేనేం? కష్టాల కారుచీకటైతేనేం?

నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు

-----------------------------------------------------------------------------------------------------------------------------

Why, Lord, do you stand far off? Why do you pay no attention during times of trouble? - (Ps - 10:1) 

God is “a very present help in trouble.” But He permits trouble to pursue us, as though He were indifferent to its overwhelming pressure, that we may be brought to the end of ourselves, and led to discover the treasure of darkness, the unmeasurable gains of tribulation. We may be sure that He who permits the suffering is with us in it. It may be that we shall see Him only when the trial is passing, but we must dare to believe that He never leaves the crucible. Our eyes are holden, and we cannot behold Him whom our soul loveth. It is dark—the bandages blind us so that we cannot see the form of our High Priest; but He is there, deeply touched. Let us not rely on a feeling, but on faith in His unswerving fidelity; and though we see Him not, let us talk to Him. Directly we begin to speak to Jesus, as being literally present, though His presence is veiled, there comes an answering voice which shows that He is in the shadow, keeping watch upon His own. Your Father is as near when you journey through the dark tunnel as when under the open heaven! —Daily Devotional Commentary

“What though the path be all unknown?

What though the way be drear?

Its shades I traverse not alone

When steps of Thine are near.”

Sunday, January 23, 2022

Music and the Rest

 

అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను (మత్తయి 14:13)

వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది. వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతుంటుంది. ఈ మౌనంలో సంగీతమేమీ వినిపించదు. మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాము. దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టం లేని విశ్రమాన్ని, అనారోగ్యాన్ని, మన అంచనాల వైఫల్యాన్ని, ప్రయత్నాల పరాజయాన్నీ మనకి కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు. మన స్వరం మూగవోయింది అని చిన్నబుచ్చుకుంటాం. మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరిలో మన గొంతు కలపడం లేదే అని నిరాశపడతాము. సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు? జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు. ఆ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు.

మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వెయ్యకుండా ఆలపించడు. రాగం ఏమిటో తెలుసుకోవడం మన విధి. అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది. ఈ మౌనాలు, సంగీతానికి అడ్డు రావు, తాళాన్ని అధిగమించవు, పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు.  మనం దేవుని వైపుకి చూస్తే దేపుడే మన రాగాలకు తాళం వేస్తూండడం చూస్తాము. ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తరువాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము. మౌనం వచ్చినప్పుడు సంగీతం ఆగిపోయిందని నిరుత్సాహపడితే వెనుకబడి పోతాము. మౌనంలో కూడా సంగీతం ఉందని మరచిపోవద్దు, జీవన రాగం ఆలపించడం చాలా కష్టమైన పని. దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు. ఎంత కాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు.

దైనందిన జీవితపు హడావుడిలోంచి

ప్రపంచ పోకడల పరుగు పందేలనుంచి   

పరలోకపు నీడలోకి, పరిశుద్ధుని జాడలోకి

కాసింత సేపు ఇటు రమ్మని కబురందిందా? 


బహుశా ఎడారి సీమల్లోకి

ఒంటరి తనలోకి, దేవుని సన్నిధిలోకి

ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న

ఆయన కోమల స్వరం వినడానికి పిలుపు అందిందా? 


క్రీస్తు నడచిన ఇరుకు దారుల్లోకి 

జీవజలం ప్రవహించే వాగుల్లోకి 

దేవునితో కలిసి నడిచే ధన్యతలోకి

ఆయన ఇల్లు కనిపించే చేరువలోకి పిలుపు అందిందా? 


నీడ కోసం, నైర్మల్యం కోసం 

దేవా నీకు వందనాలు

నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం 

చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం 

దేవా నీకు వందనాలు


అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు

ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు

నీ సిలువనీడలో, ఏకాంతంలో

నను పిలిచినందుకు దేవా, ఇవే నా కృతజ్ఞతలు

-----------------------------------------------------------------------------------------------------------------------------

Into a desert place apart - (Matt - 14:13)

     “There is no music in a rest, but there is the making of music in it.” In our whole life melody the music is broken off here and there by “rests,” and we foolishly think we have come to the end of the tune. God sends a time of forced leisure, sickness, disappointed plans, frustrated efforts, and makes a sudden pause in the choral hymn of our lives; and we lament that our voices must be silent, and our part missing in the music which ever goes up to the ear of the Creator. How does the musician read the “rest”? See him beat the time with unvarying count and catch up the next note true and steady as if no breaking place had come between.

    Not without design does God write the music of our lives. Be it ours to learn the tune, and not be dismayed at the “rests.” They are not to be slurred over, not to be omitted, not to destroy the melody, not to change the keynote. If we look up, God Himself will beat the time for us. With the eye on Him, we shall strike the next note full and clear. If we sadly say to ourselves, “There is no music in a ‘rest,’” let us not forget “there is the making of music in it.” The making of music is often a slow and painful process in this life. How patiently God works to teach us! How long He waits for us to learn the lesson!  —Ruskin

“Called aside—

From the glad working of thy busy life,

From the world’s ceaseless stir of care and strife,

Into the shade and stillness by thy Heavenly Guide

For a brief space thou hast been called aside.


“Called aside—

Perhaps into a desert garden dim;

And yet not alone, when thou hast been with Him,

And heard His voice in sweetest accents say:

‘Child, wilt thou not with Me this still hour stay?’


“Called aside—

In hidden paths with Christ thy Lord to tread,

Deeper to drink at the sweet Fountainhead,

Closer in fellowship with Him to roam,

Nearer, perchance, to feel thy Heavenly Home.


“Called aside—

Oh, knowledge deeper grows with Him alone;

In the secret of His deeper love is shown,

And learned in many an hour of dark distress

Some rare, sweet lesson of His tenderness.


“Called aside—

We thank thee for the stillness and the shade;

We thank Thee for the hidden paths Thy love hath made,

And, so that we have wept and watched with Thee,

We thank Thee for our dark Gethsemane.


“Called aside—

Oh, restful thought—He doeth all things well;

Oh, blessed sense, with Christ alone to dwell;

So in the shadow of Thy cross to hide,

We thank Thee, Lord, to have been called aside.”

Saturday, January 22, 2022

He Has Overcome the World

 ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచ్ఛానువాదం)

సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీద పడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.

మనం దేవుడి కోసం ఏదన్నా గొప్పకార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి అది మనకి రక్షణ సూచన. రెండింతలు ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనవి అవుతాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలోగుండా వెళ్ళవలసి రావడంచేత దాని వేగం రెట్టింపవుతుంది. విద్యుచ్ఛక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హవుస్ లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది.


వీరుడి జీవితం విరిపాన్పు కాదు

ముళ్ళతోట అతని బాట

మహనీయుల నివాసాలు చెరసాలలే

పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపకే


విజయానికి బాటలే కష్టాలు. లోయ దారిగుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది గదా. గొప్ప విజయాలన్నిటి మీదా కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోత పోసేది. దుఃఖపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘనవిజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదిటి మీద కలతల చారలతో హెచ్చరించాడు “ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి.” ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది. “అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను.” ఈ అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళినా కన్పిస్తాయి. సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహా బలవంతుల దగ్గరనుంచి కిరీటాలను మనం లాక్కుంటాము. గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. 


సంస్కర్తలైనవాళ్ళను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడాయి. పౌలు, లూథరు, నాక్స్, వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే నడిచి వచ్చారు.


శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాసారు. “వీరంతా మహా శ్రమకాలం నుండి బయటికి వచ్చినవాళ్ళు.” గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు? హోమర్, కాని ఆయన గ్రుడ్డివాడు. ‘యాత్రికుని ప్రయాణం' అనే కరిగిపోని కలను రచించిందెవరు? చీనాంబరాలు ధరించుకుని పట్టు పరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా? కాదు. ఆ కల వెలుగు బెడ్ ఫోర్డు జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బన్యన్. ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు.


విజేత గొప్పవాడు, సరే. 

క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ

కొన ఊపిరితో మూర్ఛితుడై

రణరంగంలో కడదాకా పోరాడుతూ

నేలకొరిగిన వీరుడు

అతనికంటే నిజంగా గొప్పవాడు

-----------------------------------------------------------------------------------------------------------------------------

None of these things move me - (Acts - 20:24)

     We read in the book of Samuel that the moment that David was crowned at Hebron, “All the Philistines came up to seek David.” And the moment we get anything from the Lord worth contending for, then the devil comes to seek us.

    When the enemy meets us at the threshold of any great work for God, let us accept it as “a token of salvation,” and claim double blessing, victory, and power. Power is developed by resistance. The cannon carries twice as far because the exploding power has to find its way through resistance. The way electricity is produced in the powerhouse yonder is by the sharp friction of the revolving wheels. And so we shall find someday that even Satan has been one of God’s agencies of blessing.  —Days of Heaven upon Earth

A hero is not fed on sweets,

Daily his own heart he eats;

Chambers of the great are jails,

And headwinds right for royal sails.

—Emerson

    Tribulation is the way to triumph. The valley-way opens into the highway. Tribulation’s imprint is on all great things. Crowns are cast in crucibles. Chains of character that wind about the feet of God are forged in earthly flames. No man is the greatest victor till he has trodden the winepress of woe. With seams of anguish deep in His brow, the “Man of Sorrows” said, “In the world, ye shall have tribulation”—but after this sob comes the psalm of promise, “Be of good cheer, I have overcome the world.” The footprints are traceable everywhere. Blood marks stain the steps that lead to thrones. Sears is the price of scepters. Our crowns will be wrested from the giants we conquer. Grief has always been a lot of greatness. It is an open secret.

“The mark of rank in nature.

Is the capacity for pain;

And the anguish of the singer

Makes the sweetest of the strain.”

    Tribulation has always marked the trail of the true reformer. It is the story of Paul, Luther, Savonarola, Knox, Wesley, and all the rest of the mighty army. They came through great tribulation to their place of power.

    Every great book has been written in the author’s blood. “These are they that have come out of great tribulation.” Who was the peerless poet of the Greeks? Homer. But that illustrious singer was blind. Who wrote the fadeless dream of “Pilgrim’s Progress”? A prince in royal purple upon a couch of ease? Nay! The trailing splendor of that vision gilded the dingy walls of old Bedford jail while John Bunyan, a princely prisoner, a glorious genius, made a faithful transcript of the scene.

Great is the facile conqueror;

Yet haply, he, who wounded sore,

Breathless, all covered o’er with blood and sweat,

Sinks fainting, but fighting evermore

Is greater yet.


Friday, January 21, 2022

Sorrow, God's Plowshare

 

నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. (ప్రసంగి 7:3)


విచారం దేవుని కృప క్రిందికి వస్తే, అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది. తెలియని సామర్ధ్యాలను, మరచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేవాళ్ళలో లోతు ఉండదు. తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్లయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికి తీసే సాధనమయ్యేది. కానీ ఈ పతనమైన లోకంలో మనకర్థమయ్యేలా చెయ్యడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే. విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాం.


విచారం మనల్ని మెల్లగా తరచి తరచి మన హృదయాలను, అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే. దేవుని కొరకు, తోటి మానవుల కొరకు సేవ చెయ్యడమనే మహా సముద్రంలో మన సమర్పణా నౌకను నడిపించడానికి మనలను ప్రోత్సహించేది విచారమే.


ఒక గొప్ప పర్వత శేణి దగ్గర కొందరు సోమరి జనం నివశిస్తున్నారు. ఆ పర్వతాల లోయలనూ దారులనూ వాళ్ళెప్పుడూ పరిశోధించడానికి పూనుకోలేదు. ఒక రోజు ఆ ప్రాంతాల్లో ఒక పెను తుఫాను వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరై వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెదకసాగారు. ఆ గాలివానలోనే వాళ్లకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు, పండ్ల చెట్లు, నీటి వాగులు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి. అప్పటి దాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధ పడ్డారు. మనం కూడా ఇంతే. మన వ్యక్తిత్వపు ఇవతలి అంచులో ఏ చలనమూ లేకుండా ఉంటుంటాము. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి.


దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితే గాని ఏ గొప్ప పనికీ వాడుకోడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే అతణ్ణి అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా వచించాడు. "యోసేపు ఫలించెడి కొమ్మ..." దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును" (ఆది 49:22). ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం.


నాగటి చాలు పైకి తెస్తుంది

సారవంతమైన సేంద్రియాన్ని

నేర్పింది ఇది నాకో సరికొత్త పాఠాన్ని


ఆకాశం కింద పరచుకున్న

అవనీతలం నా జీవితం

అందులో విరివిగా పండాలి ఫలసాయం


విశ్వాసం, దయ వంటి

బంగారు పంట ఎక్కడ పండుతుంది?

దుఃఖం అనే నాగలి దున్నిన గుండె పొలం లోనే


దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి. "రాత్రి ఎంత బావుంటుంది! రాత్రిళ్ళే కదా చుక్కలు కనిపిస్తాయి" అంటాము. అలాగే "దుఃఖం ఎంత మంచిది. దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకి దొరికేది" అనాలి. వరదలు వచ్చి ఒకతని ఇల్లు, అతని జీవనోపాది సర్వస్వం కొట్టుకుపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయిన తరువాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడా వ్యక్తి. అంతలో నేలలో పాతుకొని ఏదో మెరుస్తూ కనిపించిందతనికి. వరద నీళ్ళు దానిపైనున్న మట్టిని కడిగేశాయి. "బంగారంలా ఉందే" అంటూ చూసాడతను. బంగారమే! అతన్ని దరిద్రుణ్ని చేసిన వరదలే అతన్ని ధనికుణ్ని చేసాయి. జీవితంలో చాలా సందర్భాలలో ఇలాగే జరుగుతుంది.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Sorrow is better than laughter; for by the sadness of the countenance the heart is made better - (Eccl  - 7:3)

     When sorrow comes under the power of Divine grace, it works out a manifold ministry in our lives. Sorrow reveals unknown depths in the soul and unknown capabilities of experience and service. Gay, trifling people are always shallow, and never suspect the little meannesses in their nature. Sorrow is God’s plowshare that turns up and subsoils the depths of the soul, that it may yield richer harvests. If we had never fallen or were in a glorified state, then the strong torrents of Divine joy would be the normal force to open up all our souls’ capacities; but in a fallen world, sorrow, with despair taken out of it, is the chosen power to reveal ourselves to ourselves. Hence it is sorrow that makes us think deeply, long, and soberly.

    Sorrow makes us go slower and more considerately, and introspect our motives and dispositions. It is sorrow that opens up within us the capacities of the heavenly life, and it is sorrow that makes us willing to launch our capacities on a boundless sea of service for God and our fellows.

    We may suppose a class of indolent people living at the base of a great mountain range, who had never ventured to explore the valleys and canyons back in the mountains; and someday, when a great thunderstorm goes careening through the mountains, it turns the hidden glens into echoing trumpets, and reveals the inner recesses of the valley, like the convolutions of a monster shell, and then the dwellers at the foot of the hills are astonished at the labyrinths and unexplored recesses of a region so nearby, and yet so little known. So it is with many souls who indolently live on the outer edge of their own natures until great thunderstorms of sorrow reveal hidden depths within that were never hitherto suspected.

    God never uses anybody to a large degree, until after He breaks that one all to pieces. Joseph had more sorrow than all the other sons of Jacob, and it led him out into a ministry of bread for all nations. For this reason, the Holy Spirit said of him, “Joseph is a fruitful bough…by a well, whose branches run over the wall” (Gen. 49:22). It takes sorrow to widen the soul. —The Heavenly Life


The dark brown mold’s upturned

By the sharp-pointed plow;

And I have a lesson learned.


My life is but a field,

Stretched out beneath God’s sky,

Some harvest rich to yield.


Where grows the golden grain?

Where faith? Where sympathy?

In a furrow cut by pain.

—Maltbie D. Babcock


    Every person and every nation must take lessons in God’s school of adversity. “We can say, ’Blessed is night, for it reveals to us the stars.’ In the same way, we can say, ’Blessed is sorrow, for it reveals God’s comfort.’ The floods washed away home and mill, all the poor man had in the world. But as he stood on the scene of his loss, after the water had subsided, broken-hearted and discouraged, he saw something shining in the bank which the waters had washed bare. ’It looks like gold,’ he said. It was gold. The flood which had beggared him made him rich. So it is ofttimes in life.”  —H. C. Trumbull

Thursday, January 20, 2022

Persistent Prayer

 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను  (లూకా 18:1)

“చీమ దగ్గరికి వెళ్ళండి” తామర్లేన్ ఒక సంఘటనను తన స్నేహితులకి ఎప్పుడూ చెబుతుండేవాడు. “ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుబడిన భవనంలో తలదాచుకున్నాను. అక్కడ కూర్చుని చాలా గంటలు గడిపాను. నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను. అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్కబెట్టాను. ఆ గింజ అరవై తొమ్మిదిసార్లు పడిపోయింది. అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు. డెబ్భైయవసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందా చీమ. ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్నిచ్చింది. ఆ పాఠాన్ని నేనెప్పుడూ మరచిపోను.”


గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత, సోమరితనంగా యధాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట. ఇలా అనుకుని చేసేదే నిజమైన ప్రార్థన. మొదటినుండి చివరిదాకా మనం యేసుప్రభువు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి. దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన, నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన, చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్ధన - ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభువు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది.


సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు. “సంగీత సాధనను నేను ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది. మూడురోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరికి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది.” మనం నమ్మకంలోను, ప్రార్థనలోను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోను ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేసాడనుకోండి, ఏమవుతుందో మనకి తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనమూ సర్వశ్రేష్టతని సంతరించుకోగలం.

డేవిడ్ లివింగ్ స్టన్ ఆశయం ఇది. “నా గమ్యాన్ని చేరేదాకా, అనుకున్నదాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం.” తడబాటులేని నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Men ought always to pray and not to faint - (Luke - 18:1) 

    “Go to the ant.” Tamerlane used to relate to his friends an anecdote of his early life. “I once,” he said, “was forced to take shelter from my enemies in a ruined building, where I sat alone for many hours. Desiring to divert my mind from my hopeless condition, I fixed my eyes on an ant that was carrying a grain of corn larger than itself up a high wall. I numbered the efforts it made to accomplish this object. The grain fell sixty-nine times to the ground, but the insect persevered, and the seventieth time it reached the top. This sight gave me courage at the moment, and I never forgot the lesson.”  —The King’s Business

    A prayer that takes the fact that past prayers have not been answered as a reason for languor has already ceased to be the prayer of faith. To the prayer of faith, the fact that prayers remain unanswered is only evidence that the moment of the answer is so much nearer. From first to last, the lessons and examples of our Lord all tell us that prayer which cannot persevere and urge its plea importunately, and renew, and renew itself again, and gather strength from every past petition, is not the prayer that will prevail.  —William Arthur

    Rubenstein, the great musician, once said, “If I omit practice one day, I notice it; if two days, my friends notice it; if three days, the public notice it.” It is the old doctrine, “Practice makes perfect.” We must continue believing, continue praying, continue doing His will. Suppose along any line of art, one should cease practicing, we know what the result would be. If we would only use the same quality of common sense in our religion that we use in our everyday life, we should go on to perfection.

    The motto of David Livingstone was in these words, “I determined never to stop until I had come to the end and achieved my purpose.” By unfaltering persistence and faith in God, he conquered.

Wednesday, January 19, 2022

The Fiery Furnace

 

ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము (2 కొరింథీ 2:14)

ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘనవిజయాలనిస్తాడు. చాలా సార్లు శత్రువు కొంత కాలం జయిస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. కాని మధ్యలో కలిగించుకుని శత్రువు ప్రయత్నాలను పాడుచేసి అతనికందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు. దుష్టుల మార్గాన్ని దేవుడు తల్లక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసివున్నట్టు ఇది జరుగుతుంది. ఆ తరువాత మనకి దొరికే ఘన విజయం ‘అంతకు ముందు శత్రువుది పైచెయ్యిగా ఉండకపోయినట్టయితే’, అంత ఘనంగా కనిపించేది కాదు.


ముగ్గురు యూదా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకి తెలుసు కదా. ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది. సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టు అనిపించింది. మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు, శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది. ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తున్నారు. ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని. అయితే వాళ్ళు అగ్ని గుండంలో హాయిగా పచార్లు చేస్తూ ఉండడం చూసి నివ్వెరబోయారు. నెబుకద్నెజరు వాళ్ళని అగ్నిలోనుంచి బయటికి రమ్మని పిలిచాడు. వాళ్ళ తలవెంట్రుకలైనా కాల లేదు. వాళ్ళ బట్టలకి అగ్ని వాసనైనా అంటలేదు. ఎందుకంటే “ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు.”


అపజయంగా అనిపించినది ఉన్నట్టుండి ఘనవిజయంగా మారిపోయింది. ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కోల్పోయి “దేవుడు మమ్మల్ని ఎందుకీ అగ్నిగుండం పాలు చెయ్యబోతున్నాడు!” అని గోల పెట్టినట్టయితే వాళ్ళా అగ్ని గుండంలో కాలి మాడి మసైపోయేవాళ్ళేమో. దేవుడికి ఏమీ మహిమ కలిగేది కాదు. ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయంగా స్వీకరించవద్దు. విశ్వాసంతో అలానే సాగిపోతూ ఉండు. నిన్ను విజేతగా నిలబెట్టగలవాని పేరట విజయాన్ని ఆశించు. త్వరలోనే ఘనవిజయం నీదవుతుంది. దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు. ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి.

----------------------------------------------------------------------------------------------------------------------------

Now thanks be unto God, which always causeth us to triumph in Christ - (2 Cor - 2:14)

    God gets His greatest victories out of apparent defeats. Very often the enemy seems to triumph for a little, and God lets it be so; but then He comes in and upsets all the work of the enemy, overthrows the apparent victory, and as the Bible says, “turns the way of the wicked upside down.” Thus He gives a great deal larger victory than we would have known if He had not allowed the enemy, seemingly, to triumph in the first place.

    The story of the three Hebrew children being cast into the fiery furnace is a familiar one. There was an apparent victory for the enemy. It looked as if the servants of the living God were going to have a terrible defeat. We have all been in places where it seemed as though we were defeated, and the enemy rejoiced. We can imagine what a complete defeat this looked to be. They fell down into the flames, and their enemies watched them see them burn up in that awful fire, but were greatly astonished to see them walking around in the fire enjoying themselves. Nebuchadnezzar told them to “come forth out of the midst of the fire.” Not even a hair was singed, nor was the smell of fire on their garments, “because there is no other god that can deliver after this sort.”

    This apparent defeat resulted in a marvelous victory.

    Suppose that these three men had lost their faith and courage, and had complained, saying, “Why did not God keep us out of the furnace!” They would have been burned, and God would not have been glorified. If there is a great trial in your life today, do not own it as a defeat, but continue, by faith, to claim the victory through Him who can make you more than a conqueror, and a glorious victory will soon be apparent. Let us learn that in all the hard places God brings us into, He is making opportunities for us to exercise such faith in Him as will bring about blessed results and greatly glorify His name.  —Life of Praise

“Defeat may serve as well as victory

To shake the soul and let the glory out.

When the great oak is straining in the wind,

The boughs drink in new beauty and the trunk

Sends down a deeper root on the windward side.

Only the soul that knows the mighty grief

Can know the mighty rapture. Sorrows come

To stretch out spaces in the heart for joy.”

Tuesday, January 18, 2022

The Living God

 

జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? (దానియేలు 6:20)

దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి. కాని మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతినే. “జీవముగల దేవుడు" అని రాసి ఉందని మనకి తెలుసు. కాని మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్నీ నిర్లక్ష్యం చెయ్యం. మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడన్నది లక్ష్యపెట్టం. ఆయనకి అప్పటికీ, ఇప్పటికీ అదే రాజరికం ఉందనీ, ఆయన్ని ప్రేమించి, సేవించే వారిపట్ల ఆయనకి అదే ప్రేమ ఉందనీ, ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనుల్నే ఈ రోజుల్లోనూ చెయ్యగలడనీ.


ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడూ, మార్పులేని దేవుడనీ మనం మర్చిపోతుంటాము. ఆయనకి మన కష్టసుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం! మనం చీకటిలో ఉన్న సమయాల్లో ఆయన ఇప్పటికీ మరెప్పటికీ జీవముగల దేవుడు అన్న విషయాన్ని మనసులో ఉంచుకుందాము.


నువ్వు ఆయనతో నడుస్తూ, ఆయన వంక చూస్తూ, ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెప్పుడూ నిరాశపరచడన్న నిశ్చయత కలిగియుండు. “నలభైనాలుగు సంవత్సరాలుగా ప్రభుని ఎరిగి ఉన్న జార్జి ముల్లర్ అనే నీ అన్ననైన నేను ఈ మాటలు రాస్తున్నాను. నన్ను దేవుడెప్పుడూ నిరాశపరచలేదు. ఇది నీ ప్రోత్సాహం కొరకు వ్రాస్తున్నాను. ఘోర కష్టాల్లో, తీవ్రమైన శ్రమల్లో, నిరుపేదగా ఉన్నప్పుడు, అవసరాల్లో ఆయన నాకు సహాయం చెయ్యకుండా ఎప్పుడూ ఉండలేదు. తన కృపతో ఆయన్ని ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు. ప్రతీసారి నాకు సహాయం చేసాడు. ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం. -జార్జి ముల్లర్”


మార్టిన్ లూథర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు. భయం ఆవరించింది. తన టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అతని వేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు.... మనకీ, సమస్త మానవాళికీ ఉన్న నిరీక్షణ ఇదే. మనుషులు వస్తారు,  పోతారు. నాయకులు,  బోధకులు, తత్వవేత్తలు వస్తారు, మాట్లాడుతారు. కొంతకాలం పనులు చేస్తారు. అందరూ నిశ్శబ్దంగా నిర్జీవంగా నిష్క్రమిస్తారు. దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. వాళ్ళంతా చనిపోతారు. ఆయన బ్రతికే ఉంటాడు. వాళ్ళంతా వెలిగించిన దీపాలు. ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసినదే. కాని వాళ్ళందరిని వెలిగించిన స్వయం ప్రకాశకుడు దేవుడే. ఆయన నిత్యమూ ప్రకాశిస్తాడు.


సి.జి. ట్రంబుల్ గారు ఇలా రాసారు “ఒక రోజున నాకు డాక్టర్ జాన్ డగ్లస్ ఆడమ్స్ గారితో పరిచయమయింది. తనకి ఉన్న అతి ప్రశస్తమైన ఆత్మవరం ఏమిటంటే - యేసుక్రీస్తు ప్రత్యక్షంగా తన మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన స్పందన అని ఆయన నాతో చెప్పారు. యేసు నిత్యమూ వ్యక్తిగతంగా తనతో ఉన్నాడన్న విషయం తనని నిత్యమూ నిలబెడుతూ ఉంటుందన్నారాయన. ఇదంతా ఆయన ఆలోచనలకి, యేసు తనలో ఎలా ఉంటున్నాడు అన్న అవగాహనకీ సంబంధంలేని ఒక అనుభూతి.


ఇంకా క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారాయన. ఇతర విషయాలనుండి బయటపడిన వెంటనే క్రీస్తువైపుకి తిరిగేది తన మనస్సు. తాను ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభాషించేవాడు. వీధిలోగాని, మరెక్కడైనా, తన స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవాడు. ఆయన క్రీస్తు సాహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించాడు.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

O Daniel, a servant of the living God, is thy God whom thou servest continually, able to deliver thee - (Dan - 6:20)

    How many times do we find this expression in the Scriptures, and yet it is just this very thing that we are so prone to lose sight of. We know it is written “the living God”; but in our daily life, there is scarcely anything we practice so much lose sight of as the fact that God is the living God; that He is now whatever He was three or four thousand years since; that He has the same sovereign power, the same saving love towards those who love and serve Him as ever He had and that He will do for them now what He did for others two, three, four thousand years ago, simply because He is the living God, the unchanging One. Oh, how therefore we should confide in Him, and in our darkest moments never lose sight of the fact that He is still and ever will be the living God!

    Be assured, if you walk with Him and look to Him and expect help from Him, He will never fail you. An older brother who has known the Lord for forty-four years, who writes this, says to you for your encouragement that He has never failed him. In the greatest difficulties, in the heaviest trials, in the deepest poverty and necessities, He has never failed me; but because I was enabled by His grace to trust Him He has always appeared for my help. I delight in speaking well of His name.  —George Mueller

    Luther was once found at a moment of peril and fear, when he had a need to grasp unseen strength, sitting in an abstracted mood tracing on the table with his finger the words, “Vivit! visit!” (“He lives! He lives!”). It is our hope for ourselves, for His truth, and for mankind. Men come and go; leaders, teachers, thinkers speak and work for a season, and then fall silent and impotent. He abides. They die, but He lives. They are lights kindled, and, therefore, sooner or later quenched; but He is the true light from which they draw all their brightness, and He shines forevermore.  —Alexander Maclaren

    “One day I came to know Dr. John Douglas Adam,” writes C. G. Trumbull. "I learned from him that what he counted his greatest spiritual asset was his unvarying consciousness of the actual presence of Jesus. Nothing bore him up so, he said, as the realization that Jesus was always with him in actual presence; and that this was so independent of his own feelings, independent of his deserts, and independent of his own notions as to how Jesus would manifest His presence.

    “Moreover, he said that Christ was the home of his thoughts. Whenever his mind was free from other matters it would turn to Christ; and he would talk aloud to Christ when he was alone—on the street, anywhere—as easily and naturally as to a human friend. So real to him was Jesus’ actual presence.

Monday, January 17, 2022

The Breaking of the Storm

అప్పుడు పెద్ద తుఫాను రేగెను (మార్కు 4:37)

జీవితంలో కొన్ని కొన్ని తుఫాన్లు హఠాత్తుగా వస్తాయి. ఓ గొప్ప ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక అణగదొక్కేసే అపజయం. కొన్ని క్రమక్రమంగా వస్తాయి. అవి దూరాన కనిపించే మనిషి చెయ్యి అంత మేఘంలా ప్రారంభమై, ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకుని మనల్ని ముంచెత్తుతుంది.

అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకు సిద్ధపరుస్తాడు. దేవునికొక దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. పెనుగాలులు దాన్ని వణికిస్తాయి. వర్షం దాన్ని మర్దిస్తుంది. ఈ పోరాటాల్లో నే ఆ చెట్టుకి కావలసిన చేవను అది సంపాదించుకుని అరణ్యం మొత్తానికే రాజవుతుంది.

దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు. ఒక మనిషి విజయం సంపాదించడం అనేది చాలా కఠినమైన పరీక్షలతో కూడుకొని ఉంటుంది. ఏ మనిషీ “తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా” మనిషి అనిపించుకోలేడు. ప్రభూ, నన్ను పగులగొట్టు. తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు.

ఒక ఫ్రెంచి కళాకారుడు తన అపార మేధా శక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతి గాంచిన మహామహులంతా ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరినవాళ్లు. ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కనానుకు చేరలేకపోయిన మోషే ఉన్నాడు. అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్, మిల్టన్ ఉన్నారు. వీళ్లందరి ప్రక్కన ఉన్నతునిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది. ఆ కళాఖండానికి ‘తుఫాను’ అనే పేరు సరిగ్గా సరిపోతుంది.

తుఫాను తరువాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది. పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే.

నీ జీవితంలో కూడా పెనుగాలులు విసిరి నిన్ను అటూ ఇటూ కొట్టాయి. వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి, అలసిపోయి లోయలో మట్టికరిచావా? లేక ఆ పెనుగాలులు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించిపెట్టాయా? తుఫాను తాకిడులకు అలసిసొలసి ఉన్న వాళ్లంటే సానుభూతిని నీలో రేకెత్తించాయా?


దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనమూ కదిలించలేదు 

గాలి రేగినా, కొమ్మలు ఊగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు

భూమి లోతుల్లో వేరు తన్నే మహా వృక్షంగా

దేవుని పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది

ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు

ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవ్వడి

ఎంత రేగినా ఏమీ కాదు

దేవుడు నాటిన ఆ దివ్య వృక్షము

నిలకడగా ఉంటుంది, నిత్యం పుష్పిస్తుంది

----------------------------------------------------------------------------------------------------------------------------

And there arose a great storm - (Mark  4:37)

      Some of the storms of life come suddenly: a great sorrow, a bitter disappointment, a crushing defeat. Some come slowly. They appear upon the ragged edges of the horizon no larger than a man’s hand, but, trouble that seems so insignificant spreads until it covers the sky and overwhelms us.

    Yet it is in the storm that God equips us for service. When God wants an oak He plants it on the moor where the storms will shake it and the rains will beat down upon it, and it is in the midnight battle with elements that the oak wins its rugged fiber and becomes the king of the forest.

    When God wants to make a man He puts him into some storm. The history of manhood is always rough and rugged. No man is made until he has been out into the surge of the storm and found the sublime fulfillment of the prayer: “O God, take me, break me, make me.”

    A Frenchman has painted a picture of universal genius. There stand orators, philosophers, and martyrs, all who have achieved pre-eminence in any phase of life; the remarkable fact about the picture is this: Every man who is pre-eminent for his ability was first pre-eminent for suffering. In the foreground stands that figure of the man who was denied the promised land, Moses. Beside him is another, feeling his way—blind Homer. Milton is there, blind and heartbroken. Now comes the form of one who towers above them all. What is His characteristic? His Face is marred more than any man's. The artist might have written under that great picture, “The Storm.”

    The beauties of nature come after the storm. The rugged beauty of the mountain is born in a storm, and the heroes of life are the storm-swept and the battle-scarred.

    You have been in the storms and swept by the blasts. Have they left you broken, weary, beaten in the valley, or have they lifted you to the sunlit summits of a richer, deeper, more abiding manhood and womanhood? Have they left you with more sympathy with the storm-swept and the battle-scarred?  —Selected


The wind that blows can never kill

The tree God plants;

It bloweth east, it bloweth west,

The tender leaves have little rest,

But any wind that blows is best.

The tree that God plants

Strikes deeper root grows higher still,

Spreads greater boughs, for God’s goodwill

Meets all its wants.


There is no storm hath power to blast

The tree God knows;

No thunderbolt, nor beating rain,

Nor lightning flash, nor hurricane;

When they are spent, it doth remain,

The tree God knows,

Through every tempest standeth fast,

And from its first day to its last

Still, fairer grows.  —Selected

Sunday, January 16, 2022

Be Still

 ఆ రాత్రియే యెహోవా అతనికి (ఇస్సాకుకు) ప్రత్యక్షమాయెను ఆది 26:24

‘ఆ రాత్రే’ దేవుడు ప్రత్యక్షమయ్యాడట. బెయేర్షెబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షమవ్వడం ఏదో యదాలాపంగా జరిగిందనుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదేననుకుంటున్నారా? పొరపాటు. బెయేర్షెబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే. అప్పటి దాకా ఆ ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగాయి. బావి గురించి దెబ్బలాటల్లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చాయి. చిన్నచిన్న విషయాల గురించి పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు. ముఖ్యంగా ఇలాటివి ఒక దానివెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు. ఇస్సాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది.


పోట్లాట తీరకపోయినా, ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు. అక్కడినుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు. స్థలం మార్పు అవసరమనిపించిందతనికి. తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోటనుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ రాత్రే దర్శనం వచ్చింది. మనసులో ఏమీ అల్లకల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు. ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం. ఆత్మలో నలుమూలల నెమ్మది పరుచుకున్న తరువాతే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది. నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం.


“ఊరక నిలుచుండి చూడు” - ఈ మాటలనెప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా? ఆందోళన చెందియున్న వేళ నీ ప్రార్ధనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు. ప్రార్థన చేసిన తరువాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకెప్పుడూ అనిపించలేదా? బాధతో నువ్వు పెట్టిన పొలికేకకి కలిగిన భూకంపంలో, ఉరుములో, రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు. నీ ఆక్రందనలు అంతమయ్యాక, నిశ్శబ్దం అలుముకున్నాక, నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక, ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తరువాత, నువ్వెప్పుడో ఎదురుచూసిన జవాబు వస్తుంది. ఓ హృదయమా, నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి. నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పుళ్ళను ముందు అదుపులో పెట్టుకో.  నీ జీవితంలో రేగిన తుఫానును మర్చిపోయి, నీ తోటివారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో. ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకిపోతున్న వరద వెనకాలే దేవుని వర్షపు ధనస్సు కనిపిస్తుంది. నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు.


ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో 

చింతలు లేని నీ అంతరంగం 

ఇంతకు ముందెన్నడూ వినని వింత గొలిపే

అందమైన దైవ రహస్యాలు వింటుంది


అల్లరి మూక విరుచుకుపడుతుంది

అన్ని విషయాల కోసం ప్రాకులాడుతుంది 

అన్వేషించు వినిర్మల సంగీతం వినిపించే

మరో లోకపు ధన్యతా స్వరాలను


దుమ్ము నిండిన దారి నీకొద్దు 

తెల్లవారు జామున తళతళ మెరిసే 

సముద్రోపరితలంలాగా మచ్చలేని ఆత్మను

నవ నవోన్మేషంగా వుంచుకో

-----------------------------------------------------------------------------------------------------------------------------

The Lord appeared to him that night and said, “I am the God of your father Abraham. Do not be afraid, for I am with you. I will bless you and multiply your descendants for the sake of my servant Abraham.” - (Gen - 26:24 )

“Appeared the same night,” the night on which he went to Beer-sheba. Do you think this revelation was an accident? Do you think the time of it was an accident? Do you think it could have happened on any other night as well as this? If so, you are grievously mistaken. Why did it come to Isaac in the night on which he reached Beer-sheba? Because that was the night on which he reached rest. In his old locality, he had been tormented. There had been a whole series of petty quarrels about the possession of paltry wells. There are no worries like little worries, particularly if there is an accumulation of them. Isaac felt this. Even after the strife was passed, the place retained a disagreeable association. He determined to leave. He sought a change of scene. He pitched his tent away from the place of former strife. That very night the revelation came. God spoke when there was no inward storm. He could not speak when the mind was fretted; His voice demands the silence of the soul. Only in the hush of the spirit could Isaac hear the garments of his God sweep by. His still night was his starry night.

My soul, hast thou pondered these words, “Be still, and know”? In the hour of perturbation, thou canst not hear the answer to thy prayers. How often has the answer seemed to come long after the heart got no response in the moment of its crying—in its thunder, its earthquake, and its fire. But when the crying ceased, when the stillness fell, when thy hand desisted from knocking on the iron gate, when the interest of other lives broke the tragedy of thine own, then appeared the long-delayed reply. Thou must rest, O soul, if thou wouldst have thy heart’s desire. Still the beating of thy pulse of personal care. Hide thy tempest of individual trouble behind the altar of a common tribulation and, that same night, the Lord shall appear to thee. The rainbow shall span the place of the subsiding flood, and in thy stillness thou shalt hear the everlasting music. —George Matheson


Tread in solitude thy pathway,

Quiet heart and undismayed.

Thou shalt know things strange, mysterious,

Which to thee no voice has said.


While the crowd of petty hustlers

Grasps at vain and paltry things,

Thou wilt see a great world rising

Where soft mystic music rings.


Leave the dusty road to others,

Spotless keep thy soul and bright,

As the radiant ocean’s surface

When the sun is taking flight.

—(From the German of V. Schoffel) H. F.

Saturday, January 15, 2022

Put Forth

 

అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించును (యోహాను 10:4) 

ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే. కాని ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడూ ఉండిపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చరియల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నూర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది.


నిరుత్సాహపడవద్దు, ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోకి, సెలయేళ్ళ ఒడ్డుకి, పర్వత శిఖరాల పైకి వెళదాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంటబడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా అయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు.


ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం, తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం, దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాటి  గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది.


రేపేం జరుగుతుందో తెలియదు

బ్రతుకు బాటలో వేకువింకా కాలేదు

నా నేత్రాలు గమ్యాన్నింకా చూడలేదు

నా ముందు ఆయన నడుస్తున్నాడు 

అందుకు మాత్రం సందేహం లేదు


ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి

జీవితంలో ఏం రాసి పెట్టి ఉందోనని

మనసులో వణుకు పుట్టుకొస్తున్నది

కాని నేనాయనవాణ్ణి, నాదారి ఏదైనా

నాముందు ఆయన వెళ్తున్నాడు


జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ

సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి

ఆయన వాక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది?

ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే

ధన్యకరమైన నిశ్చయత ఏది?


నా ముందుగా ఆయన వెళ్తున్నాడు

దీని మీదే నా మనసు నిలుపుకున్నాను

నా రక్షణకి అభయం ఇదే

నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు

ఇక నాకంతా క్షేమమే


కాపరులెప్పుడూ గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు. ఏదైనా మంద మీద దాడి చెయ్యాలనుకుంటే కాపరిని ఎదుర్కోవలసి ఉంటుంది. మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు. మనకి రాబోయే 'రేపు'లో దేవుడిప్పుడే ఉన్నాడు. ఆ 'రేపు' గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది. గాని దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఆ రేపు అనేది ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదికి రాగలిగేది.


దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు

నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను

దారిలో ఉషోదయం నడిపింపు

తప్పకుండా దొరుకుతుందన్న తపనతో

ప్రతి బలహీనతని భరించే సత్తువ

ప్రతి దుఃఖం గెలిచేందుకు  నిబ్బరం

వర్షించిన తరువాత హర్షించే సూర్య రశ్మి

ఆయనిస్తాడన్న  నిత్య నిరీక్షణతో

ఈ రోజు కోసమే బ్రతుకుతాను

-----------------------------------------------------------------------------------------------------------------------------

He putteth forth his own sheep - (John - 10:4 )

    Oh, this is bitter work for Him and us—bitter for us to go, but equally bitter for Him to cause us pain; yet it must be done. It would not be conducive to our true welfare to stay always in one happy and comfortable lot. He, therefore, puts us forth. The fold is deserted, that the sheep may wander over the bracing mountain slope. The laborers must be thrust out into the harvest, else the golden grain would spoil.

    Take heart! it could not be better to stay when He determines otherwise; and if the loving hand of our Lord puts us forth, it must be well. On, in His name, to green pastures and still waters and mountain heights! He goeth before thee. Whatever awaits us is encountered first by Him. Faith’s eye can always discern His majestic presence in front; and when that cannot be seen, it is dangerous to move forward. Bind this comfort to your heart, that the Savior has tried for Himself all the experiences through which He asks you to pass; and He would not ask you to pass through them unless He was sure that they were not too difficult for your feet, or to trying for your strength.

    This is the Blessed Life—not anxious to see far in front, nor care about the next step, not eager to choose the path, nor weighted with the heavy responsibilities of the future, but quietly following behind the Shepherd, one step at a time.


Dark is the sky! and veiled the unknown morrow

Dark is life’s way, for the night is not yet o’er;

The longed-for glimpse I may not meanwhile borrow;

But, this I know, HE GOETH ON BEFORE.


Dangers are nigh! and fears my mind are shaking;

Heart seems to dread what life may hold in-store;

But I am His—He knows the way I’m taking,

More blessed still—HE GOETH ON BEFORE.


Doubts cast their weird, unwelcome shadows o’er me,

Doubts that life’s best—life’s choicest things are o’er;

What but His Word can strengthen, can restore me,

And this blest fact; that still HE GOES BEFORE.


HE GOES BEFORE! Be this my consolation!

He goes before! On this, my heart would dwell!

He goes before! This guarantees salvation!

HE GOES BEFORE! And therefore all is well.

—J. D. Smith


    The Oriental shepherd was always ahead of his sheep. He was down in front. Any attack upon them had to take him into account. Now God is down in front. He is in tomorrow. It is tomorrow that fills men with dread. God is there already. All the tomorrows of our life have to pass Him before they can get to us.  —F. B. M.


“God is in every tomorrow,

Therefore I live for today,

Certain of finding at sunrise,

Guidance and strength for the way;

Power for each moment of weakness,

Hope for each moment of pain,

Comfort for every sorrow,

Sunshine and joy after rain.”

Friday, January 14, 2022

Hardship Makes Character

మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37)


ఇది విజయంకంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయమంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవడమే గాక, మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి, విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని, అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి, మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వేళ్ళు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధశత్రువని మనమనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణ నిస్తుందన్నమాట. పురాతన కాలంలో ప్రుగియ ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడెల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయినవాడి బలాన్నంతటినీ తనలోకి పీల్చుకుంటాడట. ఆ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట. అలానే మనమొక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మబలం రెట్టింపవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పనిచేయించుకోవచ్చు. ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడుతాడు (యెషయా 11:14). ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల బద్ద శత్రువులు. అయితే ఇక్కడ అంటున్నదాని ప్రకారం ఇశ్రాయేలీయులు వాళ్ళని జయంచడమే కాకుండ తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది. అలాగే జయాన్ననుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించేవాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే. "నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి” అని ప్రతిసారి చెప్తుండాలి.


కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకర జీవితం అని అందరూ అనుకుంటారు. కాని మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెపుతున్నాయి. కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతునిగా చేస్తుంది.  కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి, శక్తివంతమైన నిండు బ్రతుకుకీ తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి.


“మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము” (2 కొరింథీ 2:14)

-----------------------------------------------------------------------------------------------------------------------------

In all these things we are more than conquerors through him, that loved us - (Rom - 8:37) 


    This is more than victory. This is a triumph so complete that we have not only escaped defeat and destruction, but we have destroyed our enemies and won a spoil so rich and valuable that we can thank God that the battle ever came. How can we be “more than conquerors”? We can get out of the conflict a spiritual discipline that will greatly strengthen our faith and establish our spiritual character. Temptation is necessary to settle and confirm us in the spiritual life. It is like the fire which burns in the colors of the mineral paint, or like winds that cause the mighty cedars of the mountain to strike more deeply into the soil. Our spiritual conflicts are among our choicest blessings, and our great adversary is used to train us for his ultimate defeat. The ancient Phrygians had a legend that every time they conquered an enemy the victor absorbed the physical strength of his victim and added so much more to his own strength and valor. So temptation victoriously met doubles our spiritual strength and equipment. It is possible thus not only to defeat our enemy but to capture him and make him fight in our ranks. The prophet Isaiah speaks of flying on the shoulders of the Philistines (Isa. 11:14). These Philistines were their deadly foes, but the figure suggested that they would be enabled not only to conquer the Philistines but to use them to carry the victors on their shoulders for further triumphs. Just as the wise sailor can use a headwind to carry him forward by tacking and taking advantage of its impelling force; so it is possible for us in our spiritual life through the victorious grace of God to turn to account the things that seem most unfriendly and unfavorable, and to be able to say continually, “The things that were against me have happened to the furtherance of the Gospel.”  —Life More Abundantly


    A noted scientist observing that “early voyagers fancied that the coral-building animals instinctively built up the great circles of the Atoll Islands to afford themselves protection in the inner parts,” has disproved this fancy by showing that the insect builders can only live and thrive fronting the open ocean, and in the highly aerated foam of its resistless billows. So it has been commonly thought that protected ease is the most favorable condition of life, whereas all the noblest and strongest lives prove on the contrary that the endurance of hardship is the making of the men and the factor that distinguishes between existence and vigorous vitality. Hardship makes character.  —Selected


    “Now thanks be unto God Who always leads us forth to triumph with the Anointed One, and Who diffuses by us the fragrance of the knowledge of Him in every place” (2 Cor. 2:14, literal translation).

Thursday, January 13, 2022

Hedged In


 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని ఎంచుకొనుడి (యాకోబు 1:2,3)


దేవుడే తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే.  అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు. ఆయన్ను అపార్ధం చేసుకుంటారు. యోబు కూడా అంతే (యోబు 3:23). ఇలాటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానుకి బాగా తెలుసు. యోబు 1:10లో కంచెని గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోను ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ముల్లు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధపెట్టిన మాటలు, ఆవేదనపాలు చేసిన ఉత్తరం, నీ ప్రియ మిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బులేక పడిన ఇబ్బంది, అన్నీ దేవుడికి తెలుసు. ఎవ్వరికీ లేనంత సానుభూతి ఆయనకి నీపట్ల ఉంది. ఆ బాధలన్నింటిలోను ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా, లేదా అన్నది ఆయన చూస్తాడు. 


ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది 

ఆకు రాలే కాలంలో ప్రతి కొమ్మా 

పొడుచుకొచ్చిన ముళ్ళతో 

గుడ్లురిమి చూస్తుంది 


వసంతం వస్తుంది, మోళ్ళు  చిగురిస్తాయి 

కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబౌతాయి 

భయపెట్టిన కంటకాలన్నీ

పత్రహరితం మాటున దాక్కుంటాయి 


కలతలు మనల్ని కలవరపెడతాయి 

కాని మన ఆత్మలు చెదిరిపోకుండా 

మనం పెద్ద ప్రమాదంలో పడకుండా 

దేవుని కృపలే అడ్డుకుంటాయి 


నరకానికి మన పరుగును ఆపలేవు 

గులాబీ పూదండల బంధకాలు 

కసిగా గుచ్చుకునే కటికముళ్ళే ఆపగలవు 

నాశనానికి చేసే పయనాన్ని 


కాటేసి నెత్తురు చిందించే ముళ్ళ పోటుకి 

ఉలిక్కిపడి ఏడ్చి గోలపెడతాము          

దేవుడు వేసిన కంచెల కాఠిన్యం 

మనకి జఠిలంగానే ఉంటుంది


సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం 

సణుగుడులన్నీ సర్దుకుంటాయి 

గుచ్చిన ముళ్లన్నీ చిగురిస్తాయి 

శాంతి ఫలాలు విరగ గాస్తాయి 


మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు 

పాడదాం ప్రభువుకి కీర్తనలు 

కృప, తీర్పు కలగలిపిన కంచెల కొరకు 

ఆనందం నిండిన ఆవేదన కొరకు

----------------------------------------------------------------------------------------------------------------------------

My brothers and sisters, consider it nothing but joy when you fall into all sorts of trials because you know that the testing of your faith produces endurance - (James - 1:2-3)

God hedges in His own that He may preserve them, but oftentimes they only see the wrong side of the hedge, and so misunderstand His dealings. It was so with Job (Job 3:23). Ah, but Satan knew the value of that hedge! See his testimony in chapter 1:10. Through the leaves of every trial, there are chinks of light to shine through. Thorns do not prick you unless you lean against them, and not one touches without His knowledge. The words that hurt you, the letter which gave you pain, the cruel wound of your dearest friend, shortness of money—are all known to Him, who sympathizes as none else can and watches to see, if, through all, you will dare to trust Him wholly.


“The hawthorn hedge that keeps us from intruding,

Looks very fierce and bare

When stripped by winter, every branch protruding

Its thorns would wound and tear.


“But spring-time comes, and like the rod that budded,

Each twig breaks out in green;

And cushions soft of tender leaves are studded,

Where spines alone were seen,


“The sorrows, that to us seem so perplexing,

Are mercies kindly sent

To guard our wayward souls against sadder vexing,

And greater ills prevent.


“To save us from the pit, no screen of roses

Would serve for our defense,

The hindrance that completely interposes

Stings back like a thorny fence.


“At first when smarting from the shock, complaining

Of wounds that freely bleed,

God’s hedges of severity us paining,

May seem severe indeed.


“But afterward, God’s blessed spring-time cometh,

And bitter murmurs cease;

The sharp severity that pierced us bloometh,

And yields the fruits of peace.


“Then let us sing, our guarded way thus wending

Life’s hidden snares among,

Of mercy and of judgment sweetly blending;

Earth’s sad, but lovely song.”